సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వ... చిన్నారి చిలకమ్మా... నా వాడు ఎవడే నాతోడు ఎవడే ఎన్నాళ్ళ కొస్తాడే... ఈ పాట వచ్చి ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం ఆ గొంతు మాధుర్యంతో తన్మయత్వానికి లోనవుతాం.. నిజానికి ఆమె గాత్రంతో ఏ పాట ఆలపించినా ఆ పాటకి స్పష్టమైన న్యాయం చేస్తుంది మన కోకిలమ్మ జానకమ్మ. కోకిల పుట్టగానే కూయడం మెదలుపెట్టినట్టిగా మన జానకమ్మ కూడా 3 సంవత్సరాల వయసు నుండే పాడటం మొదలు పెట్టారట.. జానకమ్మ గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర పల్లెపట్ల అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు. సత్యవతి, శ్రీరామమూర్తి ఆమె తల్లిదండ్రులు, తండ్రి ఆయుర్వేద వైద్యులు. ఆరుగురు సోదరిమనులలో జానకమ్మ నాల్గొవ కూతురు..
ఇక జానకమ్మను వరించిన అవార్ఢుల విషయానికొస్తే ఆరు జాతీయ అవార్ఢులు, 32 సార్లు వివిధ ప్రాంతాల అవార్ఢులతో పాటు, మన తెలుగులో 10 రాష్ట్రస్థాయి నంది పురస్కారాలను అందుకున్నారు... అంతేకాదు సంగీతంలో ఆమె అందించిన సేవలకు ఆ ఘనతకు గాను భారతదేశపు మూడో అత్యుత్తమ గౌరవం "పద్మ భూషన్" తో భారత ప్రభుత్వం 2013లో ఘనంగా సత్కరించింది.. 1957లో ఆరంభించిన జానకి డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్ గా తన స్వర జీవితంలో తమిళం, తెలుగు, హింది, కన్నడ, మలయాళి, ఇంగ్లీష్,,సింహళ, బెంగాలీ, ఒరియా,సంస్కృతం, తుళు, జపనీస్, జర్మన్ తదితర 17భాషలలో జానకమ్మ తన ప్రావీణ్యాన్ని చూపించారు. దాదాపు 50వసంతాల సినీ ప్రస్థానంలో 50,000కు పైగా పాటలకు తన స్వరంతో కొత్త జీవాన్ని అందించారు.. సాలురు రాజేశ్వర రావు, ఘంటశాల, కే.వి మహదేవన్, ఏం.ఎస్ విశ్వనాథ్, ఇళయరాజ, ఏ.ఆర్ రెహమాన్, మణిశర్మ,కీరవాణి లాంటి అత్యుత్తమ సంగీత దర్శకత్వంలో లో మాత్రమే కాకుండా నేటి అనిరుద్ లాంటి కొత్త సంగీత దర్శకులతో కూడా పనిచేశారు.. దక్షిణభారత దేశంలో ఇప్పుడు ఉత్తమ గాయకులుగా వెలుగొందుతున్న చిత్ర, బాలసుబ్రమణ్యం, మనో, శైలజ, జేసుదాసు లాంటి గాయనీమనులందరు "జానకమ్మ" అంటు ప్రేమగా గౌరవంగా పిలుచుకుంటున్నారంటే సంగీతంలో తను చేసిన సేవలు, తన వ్యక్తిత్వం అర్ధంచేసుకోవచ్చు.. ఒక సినీ సంగీత ప్రేమికుల మదిలో ఎప్పటికి గుర్తుండి పోయే పాటలను అందించిన మన జానకమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జానకమ్మ పాడిన పాటలలో కొన్నింటిని మాత్రమే పొందుపరచడం కష్టమైన పని తను పాడిన ప్రతిపాట ఒక అణిముత్యమే..
జానకమ్మ గాత్రంలో కొన్ని మధుర గీతాలు..
1. సిరిమల్లె పువ్వా.. (16 ఏళ్ల వయసు)
2. జాబిల్లి కోసం.. (మంచి మనసులు)
3. వెన్నెల్లో గోదారి అందం.. (సితార, నంది అవార్డ్, నేషనల్ అవార్డ్)
4. నరుడా ఓ నరుడా.. (భైరవద్వీపం, నంది అవార్డ్)
5. కళ్ళలో ఉన్నదేదొ.. (అంతులేని కథ)
https://youtu.be/E-5fnBhU810
6. అటు అమలా పురం.. (ఖైది నెంబర్ 786)
7. అమ్మ అని పిలిచి.. (సింహారాశి)
8. తొలిసారి మిమ్మల్ని చుసింది మొదలు.. (శ్రీవారికి ప్రేమలేఖ)
9. సిన్ని సిన్ని కోరికలడగా.. (స్వయంకృషి)
10. మనసా తుల్లి పడకే.. (శ్రీవారికి ప్రేమలేఖ)
https://youtu.be/qFTAqqQoCos
11. సువ్వి సువ్వి.. (స్వాతిముత్యం)
12. మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. (రాక్షసుడు)
13. ఈ ధుర్యోదన దుశ్యాసన.. (ప్రతిఘటన, నంది అవార్డ్)
14. ఓం నమశివాయ.. (సాగర సంగమం)
15. చిన్నారి పొన్నారి పొన్నారి కిట్టయ్య.. (స్వాతిముత్యం)
16. సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా.. (అంతఃపురం, నంది అవార్డ్)
17. గోవుళ్ళు తెల్లనా.. (సప్తపది)
18. ఆకాశం ఏనాటిదో.. (నిరీక్షణ)
https://youtu.be/mpyUHoyGAdo
19. ఆకాశంలో ఆశల హరివిల్లు.. (స్వర్ణకమలం)
20. మౌనమేలనోయి.. (సాగర సంగమం)