Looking In Between The Beautiful Lyrics Of Dosti From RRR, Here's What The Song Means

Updated on
Looking In Between The Beautiful Lyrics Of Dosti From RRR, Here's What The Song Means

Friendship day sandarbanga.. Team RRR #Dosti song ni 5 languages ni release chesindi.. Telugu lo Hemachandra, Tamil lo Anirudh, Kannada lo Yazin Nazir, Malayalam lo Vijay Yesudas, Hindi lo Amit Trivedi.. ee song ni paadaaru.. Cinemalo ni oka important context ni.. lyrics chaala baaga explain chesaayi..

ఇద్దరు భిన్న ధృవాలు.. ఒకరికి ఒకరు ఎదురవుతే.. హోరాహోరీ పోరు లో సమంగా నిలిచేటి వ్యక్తిత్వాలు.. ఒక గమ్యం కోసం దోస్తీ మొదలు పెడితే... వారి ప్రయాణాన్ని వివరించే పాట ఇది.. సిరివెన్నెల గారు.. ఈ పాట ని రాశారు..

సాహిత్యం:

పులికి, విలుకాడికి
తలకి, ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి
దోస్తీ....

పులి, ఆ పులిని ఎదురించగల వేటగాడు.
ఒకరికి ఒకరు ఎదురవుతే ఎవరో ఒకరి ఓటమి తథ్యం
తలకి.. ఉరితాడు బిగిస్తే.. ఏదో ఒకటి తెగుతుంది..
కార్చిచ్చు ని వడగళ్ల వాన ఎదురవుతే..
ఏదో ఒకటి మిగులుతుంది..
రవి ని మేఘం కమ్మగలదో..
ఆ మేఘాన్నిచీల్చుకుని, రవి ఉదయిస్తాడో చెప్పడం కష్టం..

అలాంటి రెండు భిన్న వ్యక్తిత్వాలకి
దోస్తీ ఏర్పడింది...

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో..
తీస్తుందో..

ఈ దోస్తీ వల్ల.. ఇది వరకు చుడని పరిణామం
ఎదురు కాబోతోంది..
ఈ పరిస్థితి వల్ల.. ఒకరి ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారా...?
ఒకరి ప్రాణం ఇంకొక్కరు తీసుకుంటారా?

బడబాగ్నికి, జడివాన కి దోస్తీ...
విధిరాత కి ఎదురీత కి దోస్తీ...
పెనుజ్వాల కి హిమనగమిచ్చిన

కౌగిలి ఈ దోస్తీ...

అగ్నులలో 5 రకాలుంటాయి..
1. జఠరాగ్ని: మన కడుపులో ఉండే మంట.. ఈ మంట వల్ల ఆహరం జీర్ణం అవుతుంది
2. కాష్టాగ్ని: రెండు రాళ్ళ రాపిడి వల్ల, కర్రల రాపిడి వల్ల కలిగే అగ్ని.. హోమాలు వాళ్ళ పుట్టే అగ్ని ని కాష్టాగ్ని అంటారు...
3. వజ్రాగ్ని: పురాణాల ప్రకారం. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం వల్ల కలిగే. అగ్ని ని వజ్రాగ్ని అంటారు
4. సూర్యాగ్ని: సూర్యుడి వల్ల పుట్టే అగ్ని ని సూర్యాగ్ని అంటారు..

5. బడబాగ్ని: ఈ అగ్ని, సముద్రం లో ఉంటుంది.. సముద్రం ఉంది ఉద్భవిస్తుంది..

సముద్రం లో పుట్టే బడబాగ్ని కి, మేఘాల రాపిడి (మెరుపు కూడా అగ్నికి ప్రతిరూపమే) వల్ల వచ్చే జడివాన కి దోస్తీ కుదరబోతోంది..

విధిరాత ని ఎవరు మార్చలేరు అంటారు..
కానీ ఆ విధిరాత ఎదురు వెళ్ళాలి అనే ప్రయత్నానికి,
విధిరాతకి దోస్తీ కుదరబోతోంది..

పెను జ్వాల (పెద్ద మంట) కి హిమనగం (హిమాలయాల కొండ) ఇచ్చిన కౌగిలి లాంటి దోస్తీ.. ఇది..

అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగా
వైరమే కూరిమై
?

ఒక 'గాలి' దుమారం వల్ల. 'అగ్ని', 'జలం' లాంటి ఇద్దరు కలిశారు.. వాళ్ళ వైరం (శత్రుత్వం) కురిమిగా (స్నేహంగా) మారుతుందా ఈ కారణం వల్ల.

నడిచేది ఒకటే దారే...
వెతికేది మాత్రం వేరే...
తెగిపోదా ఏదో క్షణాన
స్నేహమే ద్రోహమై..

వాళ్ళు కలిసి ఒక దారిలో నడుస్తున్నారు.. కానీ ఇద్దరి గమ్యం వేరే.. ఈ గమ్యాల వల్ల.. వీళ్ళ స్నేహం ద్రోహం గా మారదు కదా..?

తొందర పడి పడి ఉరకలెత్తే
ఉప్పెన పరుగులహో
ముందుగ తెలియదు ఎదురువచ్చే
తప్పని మలుపులేవో...

ఎందుకంటే.. తొందర పది పరుగులు తీసే ఉప్పెన వేగానికి.. ముందు వచ్చే మలుపేంటో తెలీదు.. ఆ మలుపుగా అగ్ని జ్వాలా ఎదురవుతే.. జరిగే పరిణామం ఊహించలేం..

ఒక చెయ్యి రక్షణ కోసం.
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిసాయి ఒకటై ఇలాగా తూరుపు పడమర

ఒకరి చెయ్యి, రక్షణ కోసం చాస్తే.. ఒకరి చెయ్యి మృత్యువు లా మారేది..
అలాంటి తూర్పు పడమర లాంటి రెండు భిన్న మార్గాల్లో నడిచే చేతులు ఒక కార్యం కోసం కలిసాయి..

ఒకరేమో దారుణ శస్త్రం
ఒకరేమో మారణ శాస్త్రం
తెర తొలగిపోతే
ప్రచండ యుద్ధమే జరగదా?

ఒకరెమో శస్త్ర విద్యలో ప్రావీణ్యులు.. ఒకరేమో మారణ శాస్త్రాన్ని సృష్టించే వాళ్ళు.. ఇద్దరి మధ్య తెర తొలగిపోతే.. యుద్ధం జరగకుండా ఉంటుందా?

తప్పని సరి అని తరుణమొస్తే
జరిగే జగడములో
ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో...

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో..
తీస్తుందో.
..?

ఇద్దరి మధ్య అనుకోని పరిస్థితి ఏమొచ్చిన యుద్ధం జరిగే తీరుతుంది.. అలాంటి యుద్ధం జరిగితే... గెలుపు ఎవరిదీ ఓటమి ఎవరిది. తేల్చేవారెవరు..? ఇది చిత్రమే కదా.. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో స్నేహం కోసం చాచిన హస్తం.. ప్రాణం ఇస్తుందా తీస్తోందా?

బడబాగ్నికి, జడివాన కి దోస్తీ…
విధిరాత కి ఎదురీత కి దోస్తీ…మేఘాల
పెనుజ్వాల కి హిమనగమిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ…

Lyrics in English Script:

Puliki vilukaadiki
Thalaki uri thaaduki
Kadhile kaarchicchuki
Kasire padagallaki
Raviki meghaaniki eee..
Dosthiiii…

Oohinchani chithrame chithram
Snehaniki chesina hastham
Prnaaniki pranam
Isthundho theesthundho

Badagaagniki jadivaanaki dosthi
Vidhi raathaki edhureethaki dosthi
Penu jwaalaki himanagamicchina
Kougili ee dosthi

Anukoni gaali dhumaram
Cheripindhi iruvuri dhooram
Untaara ikapai ilaaga
Vairame koorimai
Nadichedi okate dhaarai
Vethikedhi maathram verai
Thegipodha edho kshanaana
Snehame dhrohamai

Thondhara padi padi
Urakaletthe uppena parugulaho
Mundhuga teliyadu
yedhuru vacche
Thappani malupulu ho

Oka cheyyi rakshana kosam
oka cheyyi mruthyu vilaasam
bigisaayi okatai ilaaga turupu padamara

Okaremo daaruna sasthram
okaremo maarana saasthram
tera tolagipothe prachanga yuddhame jaragadha?

Tappani sari ani tarunamosthe
jarige jagadamulo..
otami evaridho gelupevaridho
telche vaarevaro…

Oohanchani chithra vichithram
Snehaaniki chaachina hastham
Praananiki pranam
Isthundho theeshtundho

Badagaagniki jadivaanaki dosthi
Vidhi raathaki edhureethaki dosthi
Penu jwaalaki himanagamicchina
Kougili ee dosthi

https://youtu.be/VPT_EIo89cc
https://youtu.be/88fwgGrZVbw
https://youtu.be/0p4mGx7QIU0
https://youtu.be/88fwgGrZVbw
https://youtu.be/_XSrkAJ_V8g