This Journey Of A Father To See His New Born Baby Ends On An Unexpected Twist

Updated on
This Journey Of A Father To See His New Born Baby Ends On An Unexpected Twist

Contributed By Krishna Prasad

ఆదివారం, ఉదయం 8 గంటలు. ఫోన్ మోగుతుంది.... బద్దకంగా లేస్తూ, పొద్దున్నే ఫోన్ ఏంట్రా అనుకుంటూ నిద్ర లేచాడు రవి. ఫోన్ వంక చూసాడు, నంబర్ ఎవరిదా అని. హో... మావయ్య దగ్గర నుంచి. హడావిడిగా లిఫ్ట్ చేశాడు రవి.

హల్లో, రవి నేను మీ మావ్వయని. నువ్వు తండ్రయ్య వ్ అల్లుడు, నీకు ఆడపిల్ల పుట్టింది. ఒక్కసారిగా రవిలో ఆనందం. ఎం మాట్లాడాలో తెలియడం లేదు. ఒక్కసారిగా కళ్లనుంచి ఆనంద బాష్పాలు. వాటిని తుడుచుకుంటూ.. హా మావయ్య సరే అని ఫోన్ పెట్టాడు రవి.

రవి కి ఎలాగైనా తన ముద్దుల కూతురు నీ చూడాలి అని అనిపించింది. అనుకున్నదే తడువుగా త్వరగా రెడీ అయ్యి ఊరు వెళ్దామని బండి స్టార్ట్ చేశాడు. అలా బండి స్టార్ట్ చేసి వెళుతున్న రవి కి ఆ ఉదయం చాలా కొత్తగా ఉంది. చుట్టూవున్న పరిసరాలు, ప్రతి ఒక్క వస్తువు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా గత జ్ఞాపకాల లో కి వెళ్ళిపోయాడు.

రవికి తల్లి తండ్రి లేరు. పెద్దమ్మ పెదనాన్న ల దగ్గర పెరిగాడు. చదువు లో అందరికన్నముందు వరుసలో వుండే వాడు. అందువల్ల పెద్దమ్మ, పెదనాన్నలకి రవి అంటే చాలా ఇష్టం. స్కూల్ లో కాలేజ్ లో ఇలా ప్రతి చోటా అందరితో కలివిడిగా ఉండేవాడు, ఎవరైన ప్రాబ్లమ్స్ లో వుంటే సాయం చేసేవాడు. అతని మంచితనానికి తగినట్టే తనకు భార్య దొరికింది. ఆమె పేరు ప్రియ. చుట్టాల అమ్మాయే ..చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి అమ్మాయి. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట నీ చూసి చుట్టూ పక్కన ఉండే వాళ్ళు కూడా ముచ్చట పడేవారు. ఇలా ఆనందంగా గడిచిపోతున్నా వాళ్ల జీవితం లో మరో ఆనందకర విషయం. ప్రియ గర్భవతి అయింది. తనని కాలు కూడా కింద పెట్టనివ్వకుండ తన దగ్గర ఉన్నన్ని రోజులు ప్రియని చాలా బాగా చూసుకుని కాన్పు కోసం వాళ్ల మావయ్య వల్ల ఊరు పంపాడు రవి.

ఒక్కసారిగా వెనకనుంచి గట్టిగా హారన్ సౌండ్.

ఈ ప్రపంచం లోకి వచ్చాడు రవి. రవి మొహం మీద చిన్న చిరునవ్వు. మరి కాసేపట్లో ఊరు వచ్చేస్తుంది. తన భార్య, తన బిడ్డని చూడబోతున్నా అనే ఫీలింగ్ తనలోని సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తున్నది. గేర్ మార్చాడు రవి. తన బైక్ కి ఎడమ పక్కనుంచి వేగంగా ఒక బైక్ తనను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళింది. వేగంగా వెళ్తున్న రవికి కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆ బైక్ వాడు లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. సర్లే కదా అని కొంచెం గేర్ డౌన్ చేస్తుండగా వాడు ఒకేసారి బైక్ నీ రైట్ కి తిప్పాడు.

అంతే ఒక్కసారిగా బండిని కంట్రోల్ చేసుకోలేని రవి పక్కనున్న డివైడర్ ఢీ కొన్నాడు. అంతే జరగకూడని ఘోరం జరిగిపోయింది.. అప్పటిదాకా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్న రవి ఊపిరి వదిలాడు. తన భార్యను, కన్న కూతురిని చూడాలనే ఆశ తీరకుండానే... లెఫ్ట్ సిగ్నల్ వేసి, కుడిచేతి వైపు బైక్ ఒకే సారి తిప్పి ఆ బైక్ వాడు చేసిన తప్పిదం, ఆ బైక్ వాడి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది, ఒక కుటుంబాన్ని ఒక జీవిత కాలపు దుఃఖం లో ముంచింది.