Check Out This Beautiful Short Story That Will Hit You Right In The Feels!

Updated on
Check Out This Beautiful Short Story That Will Hit You Right In The Feels!

(Story By PR)

రీ ఫ్యుయెల్

ఉదయం 11 కి ఇంటర్వ్యూ వుంది. టైమ్ ఇప్పుడు 9.20 అయ్యింది. ఈయన 10 నిమిషాల్లో వస్తా అని బండి తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏ టీ కొట్టు లో సోది చెప్తూ కూర్చున్నాడో! ఈయన అంటే మా నాన్న! సోది మనిషి. ఎప్పుడు వాగుతూనే వుంటాడు. అమ్మ వచ్చి, “సూర్య ! సాయంత్రం సరుకులు తేవాలి ! త్వరగా వస్తావుగా ?” అని అడిగింది. “ఏమో చెప్పలేను !” అన్నాను. వెంటనే “అయినా శేఖర్ వున్నాడు గా !” అని లాజిక్ అడిగాను. అమ్మ వెంటనే, “వాడు కాలేజీ నించి వచ్చే సరికి లేట్ అవుతుంది ! ఐనా వాడు నా మాట వినాడు!” అంది. శేఖర్ నా తమ్ముడు. వాడు చదివేది ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కానీ, అప్పుడే నెలకి లక్ష జీతం అన్న రేంజ్ లో ఫీల్ అవుతుంటాడు. పెద్ద వేస్ట్ గాడు. అమ్మ ఇంతలో , “ఇడ్లీ అయిపోవచ్చింది! తిని వెళ్ళు !” అంది. “టిఫిన్ 8 కి చేస్తారు, 10 కి కాదు!” అని చీకాకు గా నా బాగ్ & ఫైల్ తో బయటికి వచ్చాను. ఇక లాభం లేదు, బస్ కి వెళ్ళడం బెటర్ అనుకున్న మొమెంట్లో బండి వచ్చింది. వెంటనే స్టార్ట్ అయ్యాను.

బండి మీద బయలుదేరక కొంచెం ఉచ్చాహం వచ్చింది. కొత్త ఏజెన్సీ కాబట్టి పోటీ పెద్దగా వుండకపోవొచ్చు. వున్న నా లాంటి అనుభవం లేని కుర్రళ్లే వుండొచ్చు. జాబ్ దొరికితే, ముందు డిజిటల్ స్టోరీ బోయర్డింగ్ కి సెట్ అయ్యే లా సిస్టమ్ అప్డేట్ చెయ్యాలి. స్టార్టింగ్ సేలరీ ఓ 25 అడగొచ్చు ! ఏమో ఇంప్రెస్ అయితే 30 కూడా ఇవొచ్చు ! ఇలా ఫ్యూచర్ మీద హాప్ మీద ప్లాన్ చేసుకునే మొమెంట్ లో బండి ఆగిపోయింది.

పెట్రోల్ అయిపోయింది అని రియలైజె అయ్యాను. కరెక్ట్ గా ఎర్రమంజిల్ అప్ ఎక్కే రోడ్ దగ్గర ఆగిపోయింది. పాకెట్ లో 10 రూపాయలు వున్నాయి. టైమ్ 10.20 అవుతుంది. చేసిడి లేక నెమ్మది గా తొయ్యటం మెఒడలు పెట్టాను. నిన్న సాయంత్రం 200 కి పెట్రోల్ కొట్టిచాను అప్పుడే ఎలా అయిపోయింది అని ఆలోచించాను. “శేఖర్ ఫ్రెండ్స్ తో సెకండ్ షో కి వెళ్ళాడు. వాడే ఊరు అంతా తిరిగి వుంటాడు ! కనీసం సెన్స్ లేదు ! నాన్న కూడా , “రిజర్వ్ లో వుంది రా పెట్రోల్ అయిపోతుంది ఏమో !”అని గుర్తు చెయ్యల్సింది! ఆయన అసలు ఎక్కడో ఆలోచిస్తుంటాడు ! ఛ! అమ్మ దగ్గర సరుకులకి డబ్బులు తీసుకుంటే పెట్రోల్ కి హెల్ప్ అయ్యేది ! తప్పు చేశాను ! అయినా అసలు ఎంసిఏ మానకుండా ఉండి వుంటే నేను ఈ పాటికి కార్ లో ఆఫీసు కి వెళ్తుందేవాడిని .. ఇలా వంద ఆలోచనలు వరసపెట్టి వస్తూనే వున్నాయి ! చేతులు లాగుతుంటే స్టాండ్ వేసి ఆగాను ! ఆ మొమెంట్, వెనక్కి డౌన్ లోకి బండి తోసేయాలి అనిపించింది. మా అయితే ఏమవుతుంది పల్టీకొట్టి చొట్టలు పోతుంది ! అంతే గా !” అనిపించింది.

పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి మళ్ళీ తోయటం మొదలు పెట్టాను ! అలా ఆగిపోయిన బండి లో నా కదల్లేని జీవితం కనిపించింది. ఇలా కలని తోసుకుంటే బతకాల్సిందే నా ! అని బాధేసింది. నా ఆలోచనల్లో పడి, బాధపడి, ఆ బాధలో , తెలీకుండానే రోడ్ అప్ కి వచ్చేస్సాను. సిగ్నల్ దగ్గర రోడ్ దాటాక , స్లోప్ లో ఈసీ అనిపించింది. ఎక్కి, కూర్చుంటే చాలు, వెళ్లిపోతుంది. డబ్బు ఉనోళ్ళ జీవితాలి కూడా స్లోప్ లో బండిలా ఏ బాధ లేకుండా వెళ్లిపోతాయి . ఇంకో పది నిమిషాలు తోశాక, ఆడ్ ఏజెన్సీ ఆఫీసుకి రీచ్ అయ్యాను.

షర్ట్ అంతా చెమటతో తడిసింది. వెంటనే లోపలికి వెళ్లకుండా అక్కడ పక్కనే ఉన్న చెట్టు కింద టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ చెప్పాను. టీ తాగే లోపు షర్ట్ ఆరుతుంది అన్న ఆశ. టీ తాగుతూ నా బండి వంక చూశాను , దానిలో ‘సారీ ‘ అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది. నవ్వుకున్నా. టీ తాగాక ఓ 10 మినేట్స్ రిలాక్స్ అయ్యాను. , టైమ్ 11 అయ్యింది. జుట్టు సరిచేసుకుని ఏజెన్సీ ఆఫీసు లోకి అడుగు పెట్టాను.

ఏజెన్సీ రిసెప్షన్ లో ఓ అందమైన అమ్మాయి ఉంది. నా పేరు, వివరాలు చెప్పాను. వెంటనే ఆ అమ్మాయి “ అయ్యో ! సారీ అండి! పొద్దున్నే చారి గారు ఫోన్ చేసి మరీ చెప్పారు, మిమ్మల్ని మధ్యానం రమ్మని చెప్పమని. నేనే హడావిడి లో పడి మర్చిపోయాను ! సారీ !” అంది. “ఆయన ఎన్నిటికి వస్తారో చెప్పగలరా ?” అని అడిగాను. ఓ నిమిషం ఆలోచించి, “3కి రావోచ్చెమో !” అంది. వెంటనే తనే .. “మీకు ఏదైనా వర్క్ ఉంటే చూసుకుని రండి !” అంది. నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. నవ్వాను. తను నవ్వింది. “సరే , మధ్యానం వస్తాను !” అని చెప్పి బయటకి నడిచాను ! బయట నా పెట్రోల్ లేని బండి చూసి మళ్ళీ ఆలోచనలో పడ్డాను. మళ్ళీ లోపలికి వెళ్ళాను.

తను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. తన మాట తీరు చాలా పొందికగా వుంది. ఫోన్ కాల్ అయ్యాక , “చెప్పండి !” అంది. నేను కొద్దిగా ఇబ్బంది పడి, “మీరు ఏమీ అనుకోకపోతే చారి గారు వచ్చే వరకు ఇక్కడ వేయట్ చేయొచ్చా ?” అని అడిగాను. తను ఈ సారి నవ్వలేదు. ఊరికే తాలూపింది. నాకు ఇబ్బంది గా అనిపించినా చేసేది లేక అక్కడ కార్నర్ సీట్ లో కూర్చున్నా !

అక్కడ డెస్క్ మీద పాపేర్స్ వుంటే చూస్తూ కూర్చున్నా . తనకి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అక్కడ సంభాషణల్లో విన్న దాని బట్టి తన పేరు కావ్య అని అర్ధం అయ్యింది. కోరియర్స్ & లెటర్స్ కలెక్ట్ చేసి సార్ట్ చేస్తుంది. అక్కౌంట్స్ వాళ్ళతో క్లయింట్ అప్డేట్స్ తెలుసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. చెప్పాలంటే ఒకే సారి వంద పనులు చేస్తుంది . ఆయినా మాట లో విసుగు లేదు, ముఖం లో చిరాకు లేదు. నవ్వుతూనే వుంది. తన వాయిస్, నవ్వు అన్నీ బాగున్నాయి . “ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా వుంటే !” అన్న ఆలోచన వచ్చింది, మళ్లీ వెంటనే నా పని, స్థాయి గుర్తుకొచ్చి ఆ ఆలోచన అమాంతం ఆవిరైపోయింది. ఇంతలో ఆఫీసు బోయ్ వచ్చి “సార్ ! కాఫీ !” అంటూ ఓ కప్ ఇచ్చాడు. కాఫీ తగాను. అది రుచిపచి లేదు, నా జీవితం లా.

ఆల్మోస్ట్ గంట తరువాత, “సూర్య ! ఇంతకముందు ఎక్కడ వర్క్ చేశారు?” అని అడిగింది. నేను వర్క్ చేసిన రెండు యాడ్ ఏజెన్సీ పేర్లు చెప్పాను. ఆ పేర్లు విని నవ్వింది. ఆ నవ్వులో చులకన భావం కనిపించింది. వీడు వేస్టే అనుకుందో ఏమో .. ఇంకో ప్రశ్న అడగలేదు . మధ్యానం అయ్యింది. తను లంచ్ కి వెళుతూ, “మీరు లంచ్ కి వెళ్లరా ?” అని అడిగింది. నేను నవ్వి నా ఫైల్ , పోర్ట్ ఫోలియో అక్కడ పెట్టి బయటకి నడిచాను. నా ఆ మధ్యానం పరిస్థితి నా జేబులో పొద్దున టీ తాగాక మిగిలిన నాలుగు రూపాయలకి, పెట్రోల్ లేని నా బండికే తెలుసు, కాసేపు బయట చెట్టుకింద కూర్చుని టీ కొట్టు వాళ్ళ కబురులు విన్నాను . ఓ లంచ్ టైమ్ గడిచింది అనిపించాక మళ్లీ ఆఫీసు లోకి వెళ్ళాను.

నా ఫైల్ , పోర్ట్ ఫోలియో అలాగే వున్నాయి. కావ్య నన్ను చూసి నవ్వింది. “ లంచ్ చేశారా !” అని అడిగింది. ఈ సారి ఆ నవ్వు లో నిజాయితీ వుంది అనిపించింది. నేను నవ్వి “చేశాను !” అని అబద్ధం చెప్పాను. తను నవ్వి , తన పని లో బిజీ అయ్యింది. మళ్లీ అదే హడావిడి. పేపర్ చదుతున్నట్టు నటిస్తూ తన మాటలు వింటూ కూర్చున్నా! “ఈ రోజు నా టైమ్ ఏమి బాగోలేదు అనిపించింది ! పొద్దున పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు రోజంతా వెయిటింగ్ తో సరిపోయింది!” అనిపించింది. నేను అలా ఆలోచిస్తున్న మొమెంట్ లో కావ్య, “సూర్య ! మీరు చారి గారు వచ్చే లోగా చిన్న హెల్ప్ చేసి పెడతారా ?” అని అడిగింది. నేను తలూపాను. “రైన్ బో హాస్పిటల్ కి ఓ ప్రింట్ యాడ్ చేసిస్తారా ?” అని అంది. వెంటనే తను నవ్వి , నన్ను ఆర్ట్ డిపార్ట్మెంట్ రూమ్ లోకి తీసుకెళ్లింది. సిస్టమ్ ఆన్ చేసి ఇచ్చి వెళ్లింది. వెళుతూ వెళుతూ , “ఇది మిమ్మల్ని జడ్జ్ చేయటానికి కాదు, జస్ట్ నా కవరింగ్ కోసం! ఆర్ట్ డిపార్ట్మెంట్ కిరణ్ రాలేదు. క్లయింట్ డెడ్ లైన్ ఈ రోజే ! సొ ! “ అంది. తన నవ్వు నవ్వి వెళ్లిపోయింది.

సాయంత్రం ఆరు గంటలకి నా మూడో డిజైన్ పూర్తి కావొస్తుంటే, వెనక ఓ పెద్దాయన వచ్చి నిల్చున్నాడు. “డిజైన్ బాగుంది ! కానీ మరీ ఇంటెలెక్చువల్ గా వుంది ! చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి పిల్లల కి సూట్ అయ్యే టెంప్లేట్ అయితే బాగుంటుంది !” అన్నాడు. నేను వెంటనే లేచి నిల్చున్నాను. “పర్లేదు కూర్చో !” అని ఆయన నా పక్క చైర్ లో కూర్చున్నాడు. నేను వెంటనే అంతక ముందు చేసిన రెండు డిజైన్లు చూపించాను. ఆయన ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆ ఫీలింగ్ బయటకి కనిపించనివ్వలేదు. “కావ్య చెప్పింది, పొద్దున్నుంచి వేయట్ చేస్తున్నవంటగా ! బయట డెస్క్ దగ్గర వున్న నీ పోర్ట్ ఫోలియో చూశాను ! పర్లేదు ..” అన్నాడు. వెంటనే.. , “అమ్మా , కావ్య ఓ రెండు స్ట్రాంగ్ అల్లం టీ చెప్పు !” అని అన్నాడు. కావ్య బయట నించే, “ఓకె సార్ !” అంది.

పది నిమిషాలకి టీ వచ్చింది. ఆయన మళ్లీ టీ తాగుతూ నా పోర్ట్ ఫోలియో చెక్ చేశాడు. “చూడు! నేను 20 వేలు ఇస్తాను ! టైమ్ తో సంబంధం లేకుండా పని చేస్తాను ! డెడ్ లైన్ మిస్ అవ్వనీను అని నీకు అనిపిస్తే రేపు జాయిన్ అవ్వు. కావ్య నీకు క్లయింట్ డీటైల్స్ ఇస్తుంది. నేను వైజాగ్ వెళ్తున్నా ! కావ్య అన్నీ చూసుకుంటుంది, ఒకవేళ ఆమె లేకపోతే , అకౌంట్స్ లో యోగి వుంటాడు, ఏదన్నా కావలిస్తే ఆయన్ని అడుగు. “ అన్నాడు. నేను నవ్వి , “సరే సార్ !” అన్నాను . ఆయన బయటికి వచ్చి కావ్యకి ఏవో చెప్పాడు. తను అన్నిటికి ఓకె చెప్పక ముసలాయన వెళ్ళాడు. నేను నా ఫైల్ , పోర్ట్ ఫోలియో తీసుకుని బయటకి నడిచాను. బాయ్స్ లేకపోవటం తో కావ్య నే ఆఫీసు కి లాక్ వేసింది. నేను బయట బైక్ దగ్గరకి వెళ్ళాక , కాసేపు కావ్య కోసం ఆగాను. తను బైక్ తీసి , “సరే ! సీ యు టుమారో !” అంది నవ్వుతూ . నేను కొద్దిగా ఇబ్బంది పడి, “సారీ ! ఒక వంద అప్పు గా ఇస్తారా ! రేపు ఇచ్చేస్తాను ! బైక్ లో పెట్రోల్ లేదు !” అన్నాను. కావ్య నవ్వి, వెంటనే ఆపి వంద ఇచ్చింది. నేను థాంక్స్ చెప్పాను. తను వెళ్లిపోయింది. నేను నా బైక్ తీస్తుంటే మళ్లీ వచ్చింది. “బంకు రెండు కిలోమీటర్లదూరం వుంది, నేను డ్రాప్ చేస్తా ! బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుందాం రండి !” అని సజెస్ట్ చేసింది. నేను బైక్ ఆఫీసు దగ్గరే పెట్టి తన బైక్ ఎక్కాను .

“నేను మధ్యనమ్ భోజనం చేయలేదు అని గ్రహించిందేమో , “టిఫిన్ చేద్దామా ! ఆకలి గా వుంది!” అని ఓ స్టాల్ దగ్గర ఆపింది. ఇద్దరం వేడి వేడి ఇడ్లీ తిన్నాక. బంకు కి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకున్నాం. నన్ను మళ్లీ ఆఫీసు దగ్గర దిగపెట్టింది. నేను పెట్రోల్ ఫిల్ చేసుకునే దాకా వెయిట్ చేసింది. అనుకోకుండా నా ఫోన్ రింగ్ అయ్యింది. ఏదో ఆన్నోన్ నెంబర్. ఫోన్ చూస్తున్న నాతో, “అది నా నెంబర్ ! సేవ్ చేసుకో !”అంది నవ్వుతూ . నా బైక్ స్టార్ట్ అయ్యాక , “ సరే ! సీ యు టుమారో!” అని నవ్వి వెళ్లిపోయింది. టైమ్ 7.30 అవుతుంది. నా మనసు లో చెప్పలేని ఆనందం. అది జాబ్ సెట్ అయినందుకా . కావ్య పరిచయం అయినందుకా అని అర్ధం కాలేదు. కావ్య మధ్యానం నాకు ఆ చిల్డ్రన్ హాస్పిటల్ వర్క్ చెప్పకపోయి వుంటే నాకు అంత ఇన్స్టంట్ గా జాబ్ వచ్చేది కాదు. తను ఎందుకో కావాలనే నా చేత ఆ పని చేయించింది అనిపించింది. ఏమో మనం తోసుకుంటూ వెళ్ళే కలకి, ఎవరు ఎప్పుడు ఎలా ఎదురై రీ ఫ్యుయెల్ చేస్తారో చేప్పలేం. లైఫ్ స్పీడ్ అందుకోవటానికి ఆ ఒక్క మనిషి చాలు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.