Meet The Couple Behind Rangasthalam's Extraordinary Set Design & Art Work!

Updated on
Meet The Couple Behind Rangasthalam's Extraordinary Set Design & Art Work!

సహజంగా ఒక ఊరు నిర్మితమవ్వాలంటే దశాబ్ధాల సమయం పడుతుంది.. అప్పుడే దానికో రూపం ఏర్పడుతుంది. అందరి అభిమానుల మన్ననలు అందుకుంటున్న రంగస్థలం సెట్ ఎన్ని రోజులలో నిర్మించారో తెలుసా కేవలం రెండు నెలలోనే.. 1980ల కాలం నాటి గోలీసోడాలు, మట్టికుండలు, బడ్డీ కొట్టు, మట్టి పెంకుటిల్లులు, లైట్లు, కరెంట్ స్థంభాలు, రోళ్ళు, గుడిసెలు.. ఇలాంటి వాటాన్నీటితో 25 ఏకరాలలో, 5 కోట్ల బడ్జెట్ తో రంగస్థలాన్ని నిర్మించారు ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనిక.

రామకృష్ణ, మౌనిక లిద్దరికి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే వారిద్దరిని కలిపింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ లో కోచింగ్ ఇద్దరూ తీసుకుంటున్న సమయంలోనే వారిద్దరూ తెలుసుకున్నారు ఒకరికోసం ఒకరు పుట్టారని. ఈరోజుల్లో డబ్బు కన్నా, మిగిలిన వాటన్నింటి కన్నా స్వేచ్ఛ ను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కరువవడం వల్లనే చాలా సంబంధాలు తెగిపోతున్నాయి. ఇంట్లో, పనిలో, జీవితంలో కలిసి బ్రతికే వీరిద్దరికి కూడా ఒకరి వ్యక్తిత్వం మీద, వర్కింగ్ స్టైల్ మీద పరిపూర్ణ అవగాహన ఉండడంతో వారి ప్రతిభతో అద్భుతాలను సృష్టిస్తున్నారు.

ఇప్పటికీ 20 కి పైగా సినిమాలకు కథకు తగినట్టుగా ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. సాహసం ఎక్కువ శాతం పాకిస్థాన్ నేపథ్యంలోనే సాగుతుంది. అందుకోసం అక్కడి ప్రాంతానికి తగినట్టుగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే అద్భుతమైన వేశారు. నిజానికి ఆ సినిమా అంతా కూడా పాకిస్థాన్ లోనే జరుగుతున్నట్టుగా ఉంటుంది తప్పా ఇదొక సెట్ అనే ఆలోచన ఏ మాత్రమూ రాదు. అందాల రాక్షసి సినిమా కూడా అంతే నవీన్ చంద్ర స్క్రాప్ తో వేసిన బొమ్మలు, బీర్ బాటిల్స్ తో నిర్మించిన లావణ్య రూపం కాని ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలా ఒక ఆర్ట్ డైరెక్టర్స్ గా ఏవయితే చేయగలరో వాటన్నిటినీ సమర్ధవంతంగా చేసి సినిమా తరతరాలు గుర్తుండిపోయేలా కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇక రంగస్థలం విషయానికొస్తే పెద్ద కసరత్తే జరిగింది. 2018లో 1980ల నాటికి వెళ్ళాలి. నాటి వస్తువులు, ఇల్లులు వారి జీవన శైలిని తెలిపే పనిముట్లు వీటన్నిటిని ప్రత్యేకంగా తయారుచేయించారు. పోనీ ఏదైనా పల్లెటూరిలో షూటింగ్ చేద్దామా అంటే ఇప్పుడు గ్రామాలన్నీ మారిపోయాయి. సీసీ రోడ్లు, ఎల్ ఈ డి బల్బ్, కరెంట్ స్తంభాలు ఇంకా రకరకాలుగా.. అందుకే హైదరాబాద్ లోనే 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఐదు వందలమంది రెండు నెలలు కష్టపడి సెట్ వేశారు. ఐతే సెట్ వేశాక అనుకోని ఉపద్రవం వచ్చింది. హైదరాబాద్ లో తీవ్రమైన వర్షాలు మొదలయ్యాయి. ఓ భారీ గాలి వాన వచ్చేసింది సెట్ అంతా పూర్తిగా తడిసిపోయింది. సెట్ ధృడంగా నిర్మించడంతో పెద్దగా డ్యామేజ్ జరగలేదు. తర్వాత చిన్న చిన్న మార్పులతో షూటింగ్ కు సిద్ధం చేశారు.

‌మొదట చిన్న బడ్జెట్ మొదలైన వీరి సినీ ప్రస్థానం పెద్ద సినిమాల వరకు ఎదిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, శక్తిని ప్రపంచానికి తెలియజేసిన ఎన్. టి రామారావు గారి బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమా కోసం ప్రస్తుతం రామకృష్ణ మౌనికలు అప్పుడే సెట్ నిర్మాణ పనులలో నిమగ్నమైపోయారు. రంగస్థలం కోసం ప్రేక్షకులను1980 కి తీసుకుపోతే ఎన్.టి.ఆర్ కోసమయితే ఏకంగా 1920 కి తీసుకుపోబోతున్నారు...