"మనిషికి విలువనిచ్చే ప్రతి ఒక్కరి వ్యధ ఇది. ఒకరిని నమ్మి మాటకు విలువ ఇచ్చి ఇపుడు మోసపోయి మనిషిని నమ్మాలంటే భయపడే ప్రతి ఒక్కరి కదా ఇది. ఒరేయ్ సత్తిగా, ఇగో అటు చూడు, నవ్వుతు వెళ్తున్నారుగా అదంతా నిజం కాదు. ఒక నాటకం. లోపల అగ్నిగోళం దాగున్న పైకి చిరునవ్వుతో కప్పేస్తున్నారు. ఈరోజు గడవాలి కాబట్టి ఒకరికి నచ్చినట్టు ఒకరం నటిస్తూ అవసరాన్ని తీర్చుకుంటూ కాలం సాగిస్తున్నం. ఈ బంధాలు బంధుత్వాలు అన్ని అవసరం కోసం వాడుకుంటున్న ఆయుధాలు. ఇలా ఎన్నాళ్ళు రా? రోజులు మారే కొంది మనుషులు మారుతున్నారు. కలిసి తిరిగే కొంది బంధాలు బలపడేలే కానీ ఇలా బరువైపోతున్నాయి. తాగినోడు ఎపుడు నిజాలే చెప్తాడు అంటారు కదా, మత్తు లో వాడు నిజం మాట్లాడట్లేదు, ఇగో తాగాను అన్న ఒక్క కారణం వాడికి దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాడు. అరేయ్ సత్తిగా ఇనుకో ఈ ప్రపంచం ఎలా తయారయ్యిందో.. నాటకాలు, నటులతో నిండినా ఓ నా ప్రపంచమా ఇది నీ కోసం!!"
మారింది సత్తి మారిందిరో ఈ లోకం చానా మారిందిరో స్నేహం అనే బంధాన్ని ఒక ఉంపుడుగత్తెను చేసిన్రురో ప్రేమ అనే అనుభూతిని పెద్ద బూతు పదం చేసి వదిలిండ్రురో మారింది సత్తి మారిందిరో ఈ లోకం చానా మారిందిరో
వస్తువులని ఆపేసి ఓ నా దొరా మనుషుల్ని వాడటం మొదలెట్టిన్రు రా లేని ప్రేమను నటించేసి మనిషునపుడు వాడిని మరిచితిరా ఆడదాని కున్న ఆ గౌరవం మగవానికి ఇవ్వాలని గుర్తించరా? మారింది సత్తి మారిందిరో ఈ లోకం చానా మారిందిరో
డబ్బు, దేహం చూసే వాడు ప్రేమలో ఎపుడు ముందుంటాడు అన్ని ఆలోచించే ఆ ఒక్కడు ఓడిపోతూ వాడు వెనకుంటాడు చూడాలే అనుకుంటారా చెప్పలేదని అంటారా కన్నీరు నిండిన కన్నులతో అన్ని చూస్తూ అట్లా ఉంటారు బరువెక్కిన ఆ గుండెతో బాధ గా ఒంటరి ఐతారు కోపం, ఆవేశం ఆపుకొని నవ్వుతు మళ్ళీ మీ మందికి వస్తారు
మారింది సత్తి మారిందిరో ఈ లోకం చానా మారిందిరో