These Words About Life By Superstar Rajinikanth Will Leave You Awestruck And Inspired!

Updated on
These Words About Life By Superstar Rajinikanth Will Leave You Awestruck And Inspired!

మనందరికి తెలుసు రజినీకాంత్ ఏమి కమల్ హసన్, ఎం.జి.ర్, ఎన్.టి.రామారావు లాంటి గొప్ప నటుడు కాదు.. ఆయన చేసిన డాన్స్ ఫైట్స్ ఒక మాములు హీరోలు కూడా చేయగలరు, కాని మిగితా వారికి రజినీకున్న తేడా ఆయన స్టైల్ ఇంకా అంతకు మించిన మంచితనం.

SSH-3

ఆ మంచితనం, సేవ గుణానికి కారణమైన ఆధ్యాత్మిక(Spiritual) భావన గురుంచి ఓ సంధర్భంలో రజినీ కాంత్ చెప్పిన మాటలు ఇవి...

నాకు(రజినీకాంత్) తెలుసు నేను గురువుగా భావిస్తున్న బాబాజి అత్యంత శక్తివంతుడు.. కాని ఇదే విషయంలో బాబాజీని గురువుగా, దేవుడుగా నాలా మీరు కూడా స్వీకరించాలని మిమ్మల్ని ఒత్తిడి చేయట్లేదు. మీరు నమ్ముతున్న జీసస్, అల్హాః, శివుడు కూడా శక్తివంతులే కాని ఆ శక్తి అంతా మీరు వారిని నమ్మే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేను నా దైవాన్ని పూర్తిగా నమ్ముతాను మీరు కూడా మీ భగవంతుడిని పూర్తిగా నమ్మండి. మంచి మనుషులు ఖచ్చితంగా లక్ష్యాలను చేరుకోగలరు కాని కాస్త సమయం పడుతుంది. ముందు మీకు ఎదురయ్యే సమస్యలపై విజయం సాధించండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానాన్ని పొందగలరు. ఒక తాత తన మనవడికి ఒక కథ చెబుతున్నాడు "నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి భార్యగా మీ నాయనమ్మ వచ్చింది, మీ నాన్న కూడా బాగా చదువుకున్నాడు..." ఇలాంటి కథ చెబుతుంటే ఆ పిల్లవాడికి ఎలా Interest వస్తుంది అలాగే జీవితమంతా ఆనందమే ఉంటే ఇక అది జీవితమెలా అవుతుంది. జీవితంలో తప్పకుండా కష్టాలుంటాయి లేకుంటే అది జీవితమవ్వదు. మీరు వాటి కోసం ఎదురు చూడకూడదు, అవ్వి వస్తే భయపడి పారిపోకుడదు!

SSH-1

నేను 20లో ఉన్నప్పుడే నా జుట్టు తెల్లబడటం మొదలైంది నాకు చాల భయం వేసేది అప్పుడు నేను అన్ని కంపెనీల హేయిర్ డై వేసుకునేవాడిని కాని దాని వల్ల నా జుట్టు రాలిపోయి మెల్లిగ బట్టతల రావడం మొదలయ్యింది. నా 90% జుట్టు రాలిపోయాక నాకు అప్పుడు అర్ధం అయ్యింది నాకు హేయిర్ డై పడదని దాని వల్లనే నా జుట్టంతా రాలిపోతుందని.. కాని ఈ ఆలోచన నాకు ముందుగానే వచ్చేదుంటే బాగుండేది నా జుట్టును కాపాడుకునే వాడిని. అలాగే మీ జీవితం చేజారక ముందే మీరు ముసలివాళ్ళు కాకముందే మీరు అనుకున్నవన్నీ చేసేయండి.

SSH-4

కేవలం అలా మంచి మాటలు చెప్పటానికి మాత్రమే పరిమితం అవ్వలేదు ఆచరించి మరి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచారు. తోటి అగ్ర హీరోలు అమితాబ్ బచ్చ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ Ads రూపంలో ఎంతో సంపాదిస్తున్నా రజినీ ఏనాడు బ్రాండ్స్ వెనుక వెళ్ళలేదు. 2006లో కోలా కంపెనీ రజనీ వద్దకు తన ఆఫర్ తీసుకువెళ్లింది. 2 కోట్లకు పైగా ఇస్తామనే ప్రపోజల్ పెట్టింది. రజనీ మాత్రం తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో ఆ కంపెనీ మరి కొంత మొత్తం పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా రజనీ ఏమాత్రం లొంగలేదు. అభిమానులను సినిమాలతో సంతోషపెట్టాలన్నదే తన అభిమతమని, ఫలానా వస్తువులను కొనమని వారికి సిఫారసు చేయడం సరికాదని రజనీ ఉద్దేశం. తను కనుసైగ చేస్తే కోట్లు కుమ్మరిస్తాయి కాని తను ఒక సిద్దంతం మీద నిలబడ్డాడు.. ఇప్పటికి అంత పెద్ద హీరో ఐనా ఏ మేకప్ లేకుండా ఒక సాధారణ మనిషిలా బతికే ఆయన వ్యక్తిత్వం, జీవితం అందరికి ఆదర్శం..

SSH-2
Design by: Siva Narisetty