డైలాగ్స్, మ్యూజిక్, లొకేషన్స్.. ఇలా ప్రతి ఒక్క అంశం అర్జున్ రెడ్డి సినిమాకు పూర్తిగా ఉపయోగపడింది. అలా ఉపయోగపడిన అంశాలలో ముఖ్యమైనది సినిమాటోగ్రఫి. ఒక సినిమా సక్సెస్ ఐతే అందులో పనిచేసిన వారందరి జీవితాలు మారిపోతాయి, అది మాత్రమే కాదు సంవత్సరాల తరబడి వారు చేసిన పోరాటానికి ఒక బలమైన సమధానం దొరుకుతుంది. అలాగే రాజ్ తోట గారికి కూడా సమదానం అందింది. ఇంతకి రాజ్ తోట గారు ఎవరు.?
నాన్న మేకప్ మెన్: ఒక వేళ తండ్రి పనిచేస్తున్న ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటే తన కొడుకు కూడా అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కాని నాన్నగారికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆశించిన సక్సెస్ లేకపోయినా గాని (హీరో మోహన్ బాబు గారి దగ్గర 18 సంవత్సరాల పాటు మేకప్ మెన్ గా నాన్న పనిచేశారు) రాజ్ తోట మంచి కెమరామెన్ అవ్వాలని డైరెక్టర్ సురెందర్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. చాలా సినిమాలకు పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.
నాన్న గారు చనిపోయిన రోజే: రాజ్ పనితనం గురించి ముందుగానే ఒక ఐడియా ఉన్న విజయ్ దేవరకొండ రాజ్ కు కాల్ చేశారు. కాని అదేరోజు ఆరోగ్యం బాగోలేక నాన్న గారు చనిపోయారని తెలిసింది. అంతిమ సంస్కారాలు పూర్తైన తర్వాత మళ్ళి కాల్ చేయడం డైరెక్టర్ ను కలవడం, కథ నచ్చడంతో ఈ సినిమాకు పనిచేశారు.
కొత్త పద్దతులు: మిగిలిన వారికి మనకు తేడా కనిపించాలంటే మనం కొత్తపద్దతులు అనుసరించాల్సి ఉంటుంది. ఫుట్ బాల్ మ్యాచ్ సీన్లను లెన్స్ వాడకుండా చేయడం, కాస్ట్యూమ్స్, లోకేషన్స్ విషయంలో కుడా జాగ్రత్తలు తీసుకుని అర్జున్ రెడ్డి కి Natural Look రావడం కోసం చాలా శ్రమపడ్డారు.
విజయ్, షాలిని: విజయ్, షాలిని కూడా థియేటర్ ఆర్టిస్ట్ లే. మంచి ఆర్టిస్టులు దొరికితే టెక్నీషియన్స్ పని సులభం అవుతుంది, ఇంకా Improvements మీద Concentration చేయచ్చు. ప్రేమను చూపించే కొన్ని రొమాంటిక్ సీన్లలో కూడా ఒకటి, రెండు టేక్స్ లో చేసేవారట. వీరిద్దరి టాలెంట్ వల్ల కూడా రాజ్ కు తన పని సులభం అయ్యింది.
ప్రయోగాలు: కేవలం టెక్నాలజీ ని ఎలా వాడాలో మాత్రమే కాదు ఎంత వరకు వాడాలి అనే విషయం తెలిసుండాలి. అర్జున్ రెడ్డి కోసం అనే కాకుండా "నీది నాది ఒకే ప్రేమ కథ" అనే సినిమా కోసం కూడా ఇలాంటి ప్రయోగాలు సినిమాటోగ్రఫీ విషయంలో చేశారట. సినిమాటోగ్రఫీ తర్వాత Direction చేసే ఆలోచనల్లో ఉన్నారు.