You Must Read This Inspiring Journey Of Yesteryear Actress Radha Prashanthi & How She Fought All Odds In Her Life!

Updated on
You Must Read This Inspiring Journey Of Yesteryear Actress Radha Prashanthi & How She Fought All Odds In Her Life!

వీరనారి, యోధ లాంటి బిరుదులు మహారాణులకు మాత్రమే వర్తించదు తమ జీవితంలో సమస్యలు అనే శత్రుసైన్యంపై వీరోచితంగా పోరాడే ప్రతి వ్యక్తి ఓ గొప్ప వీరుడే, ఓ గొప్ప యోధురాలే. రాధ ప్రశాంతి గారు తన పేరు కన్నా తనే మనకు పరిచయమెక్కవ.. నిజానికి ఈ భూమి మీదకు వచ్చే ప్రతి ప్రాణి కూడా భీకర యుద్ధం చేసి తన ఉనికిని చాటడానికి అవతరిస్తారు కాకపోతే చాలామంది పుట్టుకే వారి చివరి పోరాటమవుతుంది, సమస్యలే వారిపై విజయం సాధిస్తుంటుంది.. విజయం సాధించిన వారికి గౌరవం లభిస్తుందో లేదో కాని పోరాడే వాడికి మాత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయుడే అవుతారు. తల్లి గర్భం నుండి మాత్రమే కాదు ఇప్పటికీ ఈ క్షణానికి సైతం నిత్యం తన ఆస్థిత్వాన్ని కాపాడుకుంటూనే ఈ సమాజం కోసం ఎంతో పోరాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎన్నో అవార్ఢులను అందుకన్న డా.రాధ ప్రశాంతి గారి గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం.

నాన్నగారి మరణం తర్వాత: సామాన్యులను కష్టాలు మరింత కృంగదీస్తే అసామాన్యులను కష్టాలు మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి.. రాధ ప్రశాంతి గారి తల్లిదండ్రులు తమటాల వెంకయ్య నాయుడు గారు, పగడాలమ్మ. నాన్నగారు ఆ రోజులలో ఎన్నో రకాల వ్యాపారాలు, వ్యవసాయం(కౌలుకి ఇచ్చి) చేస్తుండేవారు. ఆర్ధిక అవసరాలకు ఏ లోటూ లేకుంటే బంధువుల ప్రేమలో కూడా ఏ లోటూ ఉండదు. నాన్న గారు ఉన్నప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితులే రాధ ప్రశాంతి గారింట్లో ఉండేది కాని ఎప్పుడైతే నాన్న గారు అనారోగ్య కారణాలతో మరణించారో, నమ్ముకున్న సన్నిహితులు, తోటి వ్యాపారస్థులు, కౌలుకు తీసుకున్న వారు మోసం చేయడం మొదలుపెట్టారు. అమ్మ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కుటుంబ ఆస్థులను లాక్కున్నారు. ముగ్గురు ఆడపిల్లలు, బాబుతో ఆ తల్లి కలలో సైతం ఊహించిన భయంకరమైన కష్టాలను అనుభవించారు. వీరుడుకి నడి సముద్రంలో ఓ కర్ర ముక్క దొరికినా దానిని వజ్రాయుధంగా వాడుకుంటాడనన్నట్టుగా చిన్నప్పుడు రాధ ప్రశాంతి గారు నేర్చుకున్న కూచిపూడి నృత్యమే ఆ కుటుంబాన్ని ఆర్ధిక కష్టాల నుండి నెమ్మదిగా బయటకు లాగేసింది.

వేల నాటక ప్రదర్శనలు: వరదలు, భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు అవి మనల్ని ఒకచోటు నుండి మరో చోటుకు తీసుకువెళ్ళడం మాత్రమే కాదు మనకంటూ ఓ కొత్త జీవితాన్ని ప్రసాధిస్తాయి. కుటుంబ పోషణ కోసం నాట్య ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టిన తర్వాత రాధ ప్రశాంతి గారు కూచిపూడి నాట్యంలో మంచి ప్రావీణ్యురాలు అవ్వడం మూలంగా నటనలోనూ మంచి గుర్తింపును అందుకున్నారు. అలా ఒకటి కాదు రెండు దాదాపు 8 సంవత్సరాల కాలంలో వేల సంఖ్యలో నాటక ప్రదర్శనలిచ్చి "కళా సాగర్" తో పాటుగా వేల అవార్ఢులు అందుకున్నారు. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం, ఐదు భాషలలో 100కు పైగా సినిమాలలో వివిధ రకాల పాత్రలలో నటించడం, మంచి గుర్తింపు పొందడం మనందరికి తెలిసిన విషయమే.

సేవా ప్రస్థానం: మనం ఎందరో నాయకులను, వ్యక్తులను చూస్తుంటాం.. "జీవితంలో, ఆర్ధికంగా స్థిరపడ్డాక సేవా రంగంపై మమకారం పెంచుకుంటారు. రాధ ప్రశాంతి గారు ఈ మధ్య కాలంలో కాదు తన 6వ తరగతిలో తండ్రి చనిపోయాక కుటుంబ పోషణకై నాట్య ప్రదర్శన, నాటక ప్రదర్శన ఇస్తున్నప్పటి నుండే తన రెమ్యూనరేషన్ లో నుండి యూనివర్సిటీలకు, ఇనిస్ట్యూట్ లలో చదువుకునే పిల్లలకు అన్నిరకాల సహాయ సహకారాలను అందించి వారిని జీవితంలో దృఢంగా నిలదొక్కుకునేలా స్పూర్తిని రగిలించేవారు. భర్త వివిధ వ్యాపారాలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఐనా సరే ఈనాటికి కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించే ప్రతి రూపాయి తన కష్టార్జితమే. ఈనాటికి కూడా ఫండ్స్ కోసం ఏ ఒక్కరి దగ్గరి నుండి రూపాయి తీసుకోలేదు. "నేను సంపాదించిన డబ్బు నుండి సహాయం చేస్తేనే నాకు మనశ్శాంతి, తృప్తి ఉంటుంది అని వినమ్రంగా చెబుతుంటారు". ఎన్నో సంవత్సరాల నుండి ఏంతోమంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడం నుండి, వృద్ధులకు, వికాలంగులకు అండగా నిలబడడం, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా వృత్తి విద్యా శిక్షణలు అందించడం వరకు ఎన్నో బాధ్యతలు నెరవేర్చారు సమాజానికి. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించే "స్త్రీ శక్తి పురస్కార్" రాష్ట్రపతి గారి చేతుల మీదుగా స్వీకరించారు, త్వరలో అమెరికన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకోబొతున్నారు. >

వ్యక్తిగత పోరాటం: రాధా ప్రశాంతి గారు ఫిల్మ్ నగర్ లోని తన సొంత అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో ఇద్దరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ ఉండేవారు. స్వతహాగా ఇలాంటి వాటిపై వెంటనే స్పందించే రాధ ప్రశాంతి గారు వారిపై కూడా పోరాటం మొదలుపెట్టారు. దీనితో ఆ వ్యక్తులు రాధ గారిపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. రాధా గారి ప్రతి కదలికలను తెలుసుకోవడానికి వారి ఇంటికి కెమెరాలను అమర్చారు అది ఏ స్థాయికి వెళ్ళినదంటే వాష్ రూమ్ కూడా ఆ కెమెరాలు తెలుసుకునేంతలా. దీనిపై పోలీసు వారికి కంప్లైంట్ చేసినా కాని పట్టించికోకపోవడంతో తనే మీడియా వారి ముందు ఆ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇది రాధా ప్రశాంతి గారిలో ఉన్న మరో కోణం.

గంజాయి వనంలో తులసి మొక్క ఎలా ఐతే పెరుగుతుందో అలాగే తులసి వనంలోనూ గంజాయి మొక్క పెరుగుతుంది. మొక్కలకు ఇతర ప్రాణులకు తమ ఉనికిని మార్చుకోవడం దాదాపు అసాధ్యం. మనిషికి మాత్రం అలా కాదు. జన్మతహా ఎలాంటి పరిస్థితులలో పుట్టామో అదే మన భవిషత్తు అని భరిస్తూ ఉంటే రాధ ప్రశాంతి లాంటి యోధలను మనం చూడలేము. వారిలా ఎదగలేము.