తెలుగు సినిమా బతుకు చిత్రాన్ని లిఖించిన మన రావూరి భరద్వాజ గారి పాకుడురాళ్ళు!

Updated on
తెలుగు సినిమా బతుకు చిత్రాన్ని లిఖించిన మన రావూరి భరద్వాజ గారి పాకుడురాళ్ళు!
(Article by Sree Harsha Nrusimha) జీవితం అనేది ఒక ‘snake and ladders’ అంటూ ఉంటారు మన తత్వవేత్తలు. అదేనండి ‘Philosophers’. Philosophy అనగానే ఏదో subtitles లేకుండా English సినిమా చూడమన్నట్టు అలా మొహాలు పెట్టకండి, please. మీకో దండం. మీకు జీవితం గురించి చెప్పేంత జీలకర్ర నాకు లేదని తెలుసు. కాని జీవితాన్ని, అది కూడా సినిమా జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు మనసుకు హత్తుకునేట్టు చెప్పిన ఒక అధ్బుతమైన Novel ఒకటి ఉందండోయ్. Novel అనగానే మళ్ళీ మీరు దాటి వెళ్లి వెతికేసినా వెతికేస్తారు, కాస్త ఆగండి. ఇది మన అచ్చ తెలుగు కథ. ఆ నవల పేరే ‘పాకుడు రాళ్ళు.’ Simple గా అంగ్రేజీ లో చెప్పాలంటే ఒక ‘Magnum opus’ అనేసేయచ్చు. ఈ గొప్ప కావ్యాన్ని మనకు అందించిన మన జాతి రత్నం, సాహిత్య అకాడమీ అవార్డు విజేత రావూరి భరద్వాజ గారు. సినిమా అంటే మోజు తో కానివ్వండి, లేకపోతే సినిమాల వ కలిగే ‘Status’ కోసం కానివ్వండి, అడుగు పెట్టి chanceలు లేక వెనక్కి వెళ్ళలేక ఏమి చేయాలో తెలియని పరిస్థితులను బుర్రల్లోకి చాలా పదునుగా దింపేసారు మన రావూరి గారు. ఎక్కడో గుంటూరు జిల్లాలోని వ్యభిచార కూపంలో కడుపు నింపుకోవడానికి గతిలేక పనిచేసే 'మంగమ్మ' అనే పదహారేళ్ళ పడుచు పిల్ల, సినిమా రంగాన్ని ఒక ఒక ఊపు ఊపేసి, శాసించగల స్థాయికి ఎలా ఎదిగిందో వివరించే కథ. కథ అని అనడం కన్నా జీవకావ్యం అంటే సరిగ్గా ఉంటుందేమో. ఒక Heroine oriented సినిమా అనుకోండి. ఈ మంజరి అనే character చుట్టూ ఆ characterizationలు ఆ realism, అబ్బబ్బ ఏమని చెప్పను ఎంతని చెప్పను. న భూతో న భవిష్యతి, అదేనండి beyond expressions. స్వర్గీయ రావూరి భరద్వాజ గారు రాసిన ఈ కళాఖండానికి మన కేంద్ర ప్రభుత్వం 2012 లో జ్ఞానపిత్ అవార్డు తో గౌరవించింది కూడాను. 1971 లో శ్రీ రామాయణ కల్పవృక్షం కి గాను మన విశ్వనాథ సత్యనారాయణ గారికి, 1988 లో విశ్వంభర కి గాను సి నారాయణ రెడ్డి (సి.నా.రే) గారికి జ్ఞానపిత్ అవార్డులు మన తెలుగు సాహిత్యాన్ని వరించాయి. కాని ఆ తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిన పాకుడు రాళ్లు ఈ రెండు దశాబ్దాల 'జ్ఞానపిత్' దాహాన్ని తీర్చింది. సినిమా అనగానే కళ్ళు జిగేలుమనిపించే lightలు, మరకలు లేని అందమైన మొహాలు, లెక్కలేనన్ని నోట్ల కట్టాలే కాదు, వాటి వెనక ఉండే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు,బరువులు, రాజకీయాలు, ఎత్తులు పై ఎత్తులు, దిగజారుడు వ్యవహారాలు, ఇలా ఇంద్ర ధనుస్సులా వెలిగిపోయే సినిమా లోకపు వాడిపోయిన, విరిగిపోయిన జీవితాలను చాలా అధ్బుతంగా చెప్పారు మన రావూరి గారు. దేశంలోని అప్పటి ప్రజా జీవితం, ఆర్ధిక స్థితిగతులను మన రచయిత చాలా బాగా పరిచయం చేసారు. ఎంత పైకి ఎక్కినా ఎప్పుడో ఒకసారి జారి పడిపోతాము, పరిస్థితులు పడేస్తాయి అని 'పాకుడు రాళ్లు'(stones that slip) టైటిల్ పెట్టి justify చేసారు మన రావూరి గారు. ఒక పూట గడవటం కోసం మనుషులు ఎంత నీచాలకు దిగాజారుతారో చాలా అధ్బుతంగా రాశారు. అప్పట్లో ఈ నవల ని publish చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ లోని కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత వచ్చిందట. కాని రంగుల లోకంగా పేరున్న సినిమా ప్రపంచంలోని చీకటి కోణాన్ని(dark side) పరిచయం చేయాలనే ధృడ సంకల్పంతో మన రావూరి గారు వెనక్కి తగ్గలేదు.ఒక సాహిత్య అకాడమీ అవార్డు విజేత రాసిన కథ అయ్యుండి, అది కూడా మన తెలుగు కథ అయ్యుండి, మన కంటే ముందు ఇటలీ జనాలు చదివేస్తే మనకెంత అవమానం! నేనింత చెప్పాక మీకు కూడా వెంటనే చదివేయాలి అని ఉంది కదూ, నాకు తెలుసు లెండి. అందుకే వెంటనే online లో అయినా సరే కోటి బుక్ stalls లో అయినా సరే, కొని, చదివి, మన స్వర్గీయ రావూరి భరద్వాజ గారికి salute చేసేయండి.