నిజానికి మన భారతదేశంలో అన్ని వనరులున్నాయి.. ప్రతి అవసరాన్ని తీర్చే విలువైన ఖనిజాలు, మంచి తెలివి తేటలతో కష్టపడి పనిచేసే మనుషులు ఇలా మనకేం లోటు లేదు కాని ఉన్నదంతా ఒక్కటే "ప్రోత్సాహం".. నిజంగా మనకు లేనిదే ప్రోత్సాహం. ఈరోజు యువకులు గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకొస్తున్నారు కాని వారికి సరైన విధంగా అవకాశాలు, ఆర్ధికసహాయం అందడం లేదు. విదేశాల నుండి కంపెనీల కోసం వెంపర్లాడుతుంటాం కాని మన దగ్గరున్న యువతకు ప్రోత్సాహం ఇచ్చి సరిగ్గా ఉపయోగించుకుంటే స్థానిక యువతే ఆదాయం పొందవచ్చు ఇంకా ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఇదే పద్దతి అవలంభిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా అధికారులు.
ఒక సంస్థను ప్రారంభిస్తున్నామంటే కేవలం లాభాల కోసం మాత్రమే కాదు అక్కడ స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించాలి ఇదే లక్ష్యంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో "రంప గిరిజన మహిళ సమాఖ్య" పేరుతో కొంతమంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి ఎంతో అవసరమయ్యే ఎల్ఇడి లైట్స్ తయారుచేస్తూ మరెంతోమందికి స్పూర్తినందిస్తున్నారు. "Twilite LED" (Trained Women in LED) ఈ పేరుతో ఎల్ఇడి లైట్ లను ఉత్పత్తి చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సి ఏరియా పరిధిలో గల సుమారు 50 మంది యువతులు.. ఏజెన్సి పరిధిలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన మహిళలను గుర్తించి వీటి మీద ప్రత్యేకంగా కొన్ని నెలలు శిక్షణ అందించి ఎల్ఇడి లైట్స్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ సంస్థ స్థాపనకు ప్రభుత్వ అధికారుల ప్రాత్సాహం మరువలేనిది.
అధికారుల అంచనా ప్రకారం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కొన్ని కోట్లల్లో ఎల్ఇడి లైట్స్ అవసరం ఉంది ఒక్క జిల్లాకే ఇంత అవసరం ఉంటే ఒక రాష్ట్రానికి, దేశానికి ఇంకెంత అవసరం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంస్థలో ఎల్ఇడి లైట్స్ తో పాటు స్ట్రీట్ లైట్స్, ఎమెర్జెన్సీ లైట్స్, ట్యూబ్ లైట్స్ లను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో గర్వపడాల్సిన మరో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొట్టమొదటి ఎల్ఇడి యూనిట్ కావడం. ప్రభుత్వం మరింత మంది యువతకు ఇలానే గొప్ప ప్రోత్సాహం అందిస్తే దేశానికి అవసరం అయ్యే అన్ని అవసరాలను మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు.
video link:
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.