Check Out Pranav Chaganty's New Telugu Rap 'Express Prema': The Fastest Telugu Rap

Updated on
Check Out Pranav Chaganty's New Telugu Rap 'Express Prema': The Fastest Telugu Rap

తెలుగు rappers లో ప్రణవ్ చాగంటి తీరే వేరు. నరనరాన తెలుగుభాష , నా భాషే నా పొగరు అన్న నినాదాలతో తెలుగు లో ఉండే గొప్పతనాన్ని ప్రత్యేకత ని తన రాప్ తో తను పాడే ప్రతి పదముతో తెలియజేస్తున్నారు. ఇటీవల తను చేసిన Express ప్రేమ రాప్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక మనిషి ఒక సెకను కి 4 నుండి 5 syllables పలుకుతారు. ఈ రాప్ లోని మొదటి చరణం లో ఒక సెకనుకి 8.86 syllables, రెండో చరణం లో ఒక సెకనుకి 9.26 syllables తో రాప్ ని పాడారు ప్రణవ్ చాగంటి. గొడవపడిన ప్రేమికుల మనస్సు ని అద్దం పడుతూ అచ్చమైన అర్ధమైన తేలికైన పదాలతో సాగుతుంది రాప్. ఆ రాప్ సాహిత్యం ఇది.

Rap verse 1: డ్రామాలు ఆపిక చిలకల పలుకులు పలుకుట చాలిక అరే మామా! ఈ ప్రేమిక తికమక మకతికల చెడు కలయిక గలగల పరుగుల జలపాతము కాదు, సుడిగుండమురా ప్రేమ! విలవిలమను తన బిగువున బతుకులు అవసరమా ఈ డ్రామా? మతిచెడిన బతుకులకు విరిగే మనసులకు ప్రేమేరా చిరునామా అనుదినము నరకములో నలిగే మనుషులకు ఇది మెలకువలో కోమా! నరకము నడుమన అడుగిడి, ప్రేమలో మనకనుదినమిక గజిబిజి చివరికి మనకిక కరువయ్యే కలివిడి , whatsapp, Facebook వలలో వెల్లకిల పడి పడి మన మతి చెడి చెడి ఎదురుగా నిలబడు నిమిషము తడబడి గణగణ మోగెను అలికిడి, పోయెను వినికిడి చివరికి, కదలికలిక విడి వదలదు జలగలా అడుగులు తడబడి ముగియును మన కల మదికలవడినది అనుదిన చెడు కల నరములు తెగు తనకెదురిక పడకలా, బిజీ బిజీ బతుకుల, జిలిబిలి పలుకుల పదములు కరువై, ఇక కనుమరుగై వలపుల తలపులు మనసుకి అరుదై తడబడి హృదయపు సడి ఇక బరువై కనులిక తడియై కలచెదిరే! కన్నులు తడపగా తను కన్న కల ఇక మన్నుగా మిగిలెను ఇరువురి కలయిక అన్నము ఎన్నడూ గొంతున దిగదిక చివరికి చెదిరిన మనసులు మిగిలెనుగా!!

Rap verse 2: ప్రేమలో తమపని సులువని తెలిపిన మనుషులు మరిగెరా, మగువలు అణచెరా! మనసున మనసై బతుకున బతుకై తిరిగితే బతుకిక చతికిలపడదా! గతుకుల బ్రతుకున పతనము మొదలు అబ్బబ్బబ్బా అదిరెను మగువల కథలు అరుపుల మెరుపులు మనసుని అణచు అతకనే అతకదు విరిగిన మనసు!! ఆ పరమపదసోపానపఠముని, ఆడదాము అరె పద పద పదమని తను కదలని నను వదలని మగువ! అడగా పాములా మింగును కదరా! పట్టదు నిద్దుర! నిచ్చెన ఎదురుగ మనకి కనబడగా, వెనక అడుగిడక ముందుకి పరిగెడగా, మగువ పిలిచెనుగా, వడిని అణచెనుగా, మనసు వణికెనుగా, దిశను మలిచెనుగా, Game is over! Shhhhh! అరే ఇనుకో బ్రదర్! పాపల పాపపు పాముల పఠమున పయనము మనకొక పాఠము కదరా! కనుకిక పదరా, గతమును విడరా! ప్రణయ ప్రళయము ప్రతోడి పతనము బతుకిక నరకము దినదిన జగడము కన్న కలలిక కలవరమున కనుమరుగై, బతుకలుసై జీవితపు అడుగులు తడబడి ఇక తరిగెను వడి చివరికి పెరిగెను మన మది అలజడి మనకిక మిగిలెను గతి చెదిరిన మతి ఓహో పడతి! ఇది కాదు పద్ధతి విరిగిన మనసిక అతకదు పోనీతీ!!

In English

Rap verse 1: Drama lu aapika chilakala palukulu palukuta chaalika Arey mama! Ee premika thikamaka makathika la chedu kalayika Gala Gala parugula jalapaathamu kaadu sudigundamu Ra Prema Vilavilamanu thana biguvuna bathukulu avasarama ee drama? Mathichedina bathukulaku virige manasulaku preme Ra chirunaama Anudinamu narakamulo nalige manushulaku Idi melakuvalo coma Narakamu nadumana adugidi premalo Manakanudinamika gajibiji Chivariki manakika karuvayye kalividi WhatsApp Facebook odilo velakila padi padi Mana mathi chedi chedi eduruga nilabadu nimishamu thadabadi Ganagana mogenu alikidi,poyenu vinikidi, chivariki Kadhalikalika vidi vadhaladhu jalagala Adugulu thadabadi mugiyunu mana Kala Madhikalavadinadhi anudina chedu Kala Naramulu thegu thanakedurika padakalaa Biji Biji bathukula jilibili palukula Padhamulu karuvai, ika kanumarugai Valapula thalapulu manasuku arudhai Thadabadi hrudayapu sadi ika baruvai Kanulika thadiyai kalachedire Kannulu thadapagaa thanuganna Kala ika mannuga migilenu iruvuri kalayika Annamu ennadu gonthuna dhigadika Chivariki chedirina manasulu migilenugaaa

Rap verse 2: Premalo thamapani suluvani thelipina manushulu marigera maguvalu anachera Manasuna manasai brathukuna brathukai thirigithe brathukika chathikilapadadhaa? Gathukula brathukuna pathanamu modhalu, Abababa adirenu maguvala kathalu Arupula merupulu manasuni anachu, Athakane athakadhu virigina manasu Aa paramapadasopaanapathamuni aadadhaamu arey pada pada padamani Thanu kadhalani, nannu vadhalani maguva, Aadagaa paamulaa mingunu kadharaa! Pattadhu niddura! Nicchena eduruga manaki kanabadaga, venaka adugidaka, munduki parigedaga, maguva pilichenuga, vadini anachenuga, manasu vanikenugaa, disanu malichenugaa GAME IS OVER! Shhhhhh! Arey inuko brother!! Paapala paapapu paamula pathamuna payanamu manakoka paathamu kadaraa! Kanukika padhara, gathamuni vidaraa! Pranaya pralayamu prathodi pathanamu, Brathukika narakamu, dina dina jagadamu. Kanna kalalika kalavaramuna kanumarugai, brathukalusai, jeevithapu Adugulu thadabadi ika tharigenu vadi, Chivariki perigenu mana madhi alajadi Manakika migilenu gathi chedirina mathi Oho padathi! Idi kaadu paddhathi! Virigina manasika athakadhu PONI THI!!

తెలుగు ఒక గొప్ప భాష. ఏ భాష కి లేని ప్రత్యేకత తెలుగు భాష సొంతం. ఈ రాప్ అందుకు ఒక ఉదాహరణ. ఈ రాప్ చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఈ పాటలోని రాప్ ని ప్రణవ్ చాగంటి పాడితే అన్నమాచార్య కీర్తన "ఒక పరి ఒక పరి వయ్యారమే" fusion ని దామిని చాలా బాగా పాడారు. ఒక సారి వినండి ఇంకోసారి తప్పకుండా వింటారు...