పేరుకు విశ్వనగరం రోడ్లు మాత్రం విశ్వ నరకంగా మారిపోయాయి. మామూలు పరిస్థితి లో అంటే ఎలాగోలా తట్టుకోగలుగుతున్నాం కాని ఈ వర్షాకాలంలో మాత్రం భయంకరమైన కష్టం. ఒకపక్క ట్రాఫిక్, మరో పక్క గుంతలతో మినీ స్విమ్మింగ్ ఫూల్స్ తలపించే రోడ్లు. వీటి వల్ల మన సమయాన్ని మాత్రమే కాదు విలువైన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నాం. ఏం చేసిన, ఎంతని చెప్పినా గాని ఈ సమస్య సంవత్సరాల తరబడి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. రొటీన్ గా సమస్యను తెలియజేసే కన్నా ప్రజలకు, మీడియాకు ఆసక్తికరంగా చెబితే సమస్య పరిష్కారానికి ఇకనైనా వేగంగా అడుగులు పడతాయని "మర్రి ఆదిత్య రెడ్డి" గారు ఈ కాంటెస్ట్ స్టార్ట్ చేశారు.
మన హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి పరిధిలో ఎక్కడ గుంతలు ఉన్న గాని ఆ గుంతల ద్వారా సమస్య తీవ్రతను తెలియజేసే ఫోటోలను తీసి hydpothole@gmail.com కు మెయిల్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలా తీసి పంపించిన వాటిలో బెస్ట్ ఫోటోలను సెలెక్ట్ చేసి అందులో బేస్ట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ బెస్ట్ ఫొటోకు 5,000, సెకెండ్ బెస్ట్ ఫొటోకు 2,500 క్యాష్ ఇవ్వబోతున్నారు అనమాట.
నిజానికి ఇలాంటి కాంటెస్ట్ స్టార్ట్ చెయ్యడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం తనకు బాగా తెలిసిన వ్యక్తి హైదరాబాద్ గుంతలతో పడిపోయి గాయపడ్డారు. ఈ ఒక్క వ్యక్తి అని మాత్రమే కాదు ప్రతిరోజూ ప్రతిచోట ఎంతోమంది గాయపడుతున్నారు ఇక నైనా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వాలని ఈ Different Contest తో ముందుకువచ్చారు.