Don't Call Yourself A Biryani Lover If You Haven't Tasted Ravulapalem Kunda Biryani

Updated on
Don't Call Yourself A Biryani Lover If You Haven't Tasted Ravulapalem Kunda Biryani

"బిర్యాని" అనే పేరు వినగానే టక్కున హైదరాబాద్ పేరు గుర్తుకువస్తుంది దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ బిర్యానికి ఓ బ్రాండ్ ఉంది ఇది అందరికి తెలిసిన విషయమే. ఘనత వహించిన హైదరాబాద్ బిర్యానినే మైమరిపించే బిర్యాని మన తెలుగు రాష్ట్రాంలోనే ఉంది అదే "కుండ బిర్యాని". ఇది ఒక హోటల్ కి పరిమితం కాలేదండి రావులపాలెం ఊరిలో కొన్ని కుటుంబాలు చిన్న తరహా పరిశ్రమలా కుండ బిర్యానీని తయారు చేస్తున్నారు.

రాజమండ్రికి 38కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. మన భారతదేశానికి ఎలా ఐతే గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుందో అలా అందమైన కోనసీమకు ఈ రావులపాలమే గేట్ వే గా ఉంటుంది. రావులపాలెం అరటిపళ్ళ మార్కెట్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది మిగిలిన ప్రాంతాల కన్నా ఇక్కడ అరటి పళ్ళు తక్కువకే దొరుకుతాయి. ఫుడ్ విషయంలో ఏది కొత్తగా చేసినా గాని అది సక్సెస్ అవ్వదు అందులో టేస్ట్ ఉంటే తప్ప. రావులపాలెం కుండ బిర్యానీకి దశాబ్ధాల చరిత్ర లేదు 2005లో ఓ హోటల్ వారు కేవలం 10 కుండలతో మెయిన్ రోడ్ మీద వెళ్ళే ప్రయాణికుల కోసం అని చెప్పి ప్రారంభించారు కుండ బిర్యాని రుచి అద్భుతంగా ఉండడంతో భయంకరంగా సక్సెస్ ఐయ్యింది..

ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు కూడా రుచికరమైన కుండ బిర్యానీని తయారు చేసి అమ్మడం ప్రారంభించారు అలాగే ప్రత్యేకంగా రెస్టారెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఇంకేముంది అలా రావులపాలెం అంటేనే భోజన ప్రియుల మదిలో ఓ గొప్ప ప్రాంతంగా గుర్తిండిపోయింది. రావులపాలెం ప్రకృతి రమణీయతకు మాత్రమే కాదు పసందైన కుండ బిర్యానీకి ఫేమస్ అవ్వడంతో వేరే ప్రాంతాల వారు కేవలం కుండ బిర్యాని కోసమే చాలా మంది వస్తుంటారు.

ఇప్పుడు కుండ బిర్యాని ప్రతిచోట దొరుకుతుంది ప్రత్యేకంగా రావులపాలెంకు ఎందుకు వెళ్ళాలంటే.. కోనసీమ అంటేనే అందానికి పర్యాయ పదంగా పిలుస్తారు.. ఇంకొంతమందైతే భూతల స్వర్గంగా వర్ణిస్తారు.. అక్కడి పచ్చని పొలాలు, ఆప్యాతత నిండిన మనుషులు, కొబ్బరిచెట్లు, అరటి తోటల మధ్యలో కుండ బిర్యాని తినడానికి ఎంతోమంది భోజన ప్రియులు వస్తుంటారు వీలుంటే మీరు ఆ పసందైన రుచిని, అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.