The Real Reason Why This Helpless Police Officer Committed Suicide Will Shock You!

Updated on
The Real Reason Why This Helpless Police Officer Committed Suicide Will Shock You!

ఒకప్పుడు పోలీసులంటే చాలా గౌరవముండేది పోలీస్ అనే పదం వినగానే గుండెల నిండా ధైర్యం వచ్చేది కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. పోలీసులంటే భయపెట్టో, బ్లాక్ మేయిల్ చేసో లేదా మానసికంగా శారీరకంగా హింసించి అందినకాడికి డబ్బులు వసూలు చేసే దోపిడిదారులుగా ప్రజలలో ఒకరకమైన వెగటు భావన వచ్చేసింది..! నిజమే ఖచ్చితంగా ప్రతి రంగంలో అవినీతి ఉంది, నీచులున్నారు. అలాగే కాస్తయినా మంచి ఉంది కాని ఆ మంచి ఏ స్థాయిలో ఉంది ? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వేలమంది పోలీసులలో ఎంతమంది ఇప్పటివరకు లంచం తీసుకోలేదు..? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ సంఖ్య కనీసం 100 కూడా మించదు, ఆ స్థాయిలో ఉంది మంచి తనం..! చిరంజీవి ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు.. తప్పు చేసిన కొడుకును దండించే స్థాయిలో పోలీస్ ఉంటారు. ఈ దేశ రాష్ట్రపతి కూడా ఏ పౌరుడిని కొట్టడానికి అర్హతలేదు కాని రాజ్యంగం కల్పించిన ఈ గొప్ప అర్హతను పోలీసులు తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారు.. ఇలా అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరించి, భయపెట్టి ఎన్నో దారుణాలు చేస్తున్నారు. కాని ఇప్పుడు మీరు చదివే దారుణం మాత్రం కన్న తల్లే తమ పిల్లలను చంపుకుని తినడం లాంటి దారుణం..!

మన ముఖ్యమంత్రి నియోజక వర్గం జిల్లా మెదక్ లోని కుకునూర్ పల్లిలో ఎస్.ఐ గా రామకృష్ణా రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణా రెడ్డి ఇంతకు ముందు ఆర్మీలో దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేసి ఆ తర్వాత డిగ్రీ పూర్తిచేసి 1996 నుండి డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. అసలు ఒక ధైర్యం గల ఎస్.ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? రౌడీలు, మంత్రులు బెదిరించడం వల్లనా? కాదు.. !మరి ఇంకేంటి? సాక్షాత్తు ఆ స్టేషన్ సి.ఐ, డిఎస్పి ల వల్ల..! అవును నెలకు ఇన్ని లక్షలలో వారికి డబ్బులు చెల్లించాలి లేదంటే ఆ కేసులో ఈ కేసులో ఇరికిస్తామని అని బెదిరించి డబ్బులు వసూలు చేయించేవారు. ఇందుకోసం మండల పరిధిలోని చిన్న వ్యాపారాలు నిర్వహించే వారిని బెదిరించాలని సూచించారు. స్వతహాగా ఎస్.ఐ రామాకృష్ణా రెడ్డికి ఇలాంటివి అంతగా నచ్చదు అందుకే వ్యాపారస్తులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. డబ్బులు అందడం లేదని సిఐ, డిఎస్పి లు వేదించేవారు.. రామకృష్ణా రెడ్డి రెండు నెలలలో 15 లక్షలు చెల్లించాడని తన సుసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.. అలా నెలకు ఇంతా అని చెల్లించడంలో అప్పులు కూడా చేశారట ఇక ఈ వేదింపులు భరించలేక తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కనీసం అతని చావుతో ఐనా డిపార్ట్మెంట్ లొ మార్పు వస్తుందని ఊహించారు అందరు కాని అలా జరగలేదు.. రామకృష్ణా రెడ్డి మరణం తరువాత ఈ కేస్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఎసిపి కూడా మాట మార్చారు.. "అతను సైన్యంలో చేసి అదే మనస్తత్వంలో ఉన్నాడు ఇక్కడి పరిస్తితులు వేరు, ఇంకా అంతగా చదువుకోలెదు, కుటుంబ సమస్యలతో ఇబ్బందిపడ్డాడు, ఇక్కడి పరిస్థితులకు సరిగ్గా ఇమడలేక పోయాడు అందుకే చనిపోయాడు అని తీసిపారేశారు." ఎసిపి గారి మాటలతో మనకో విషయం అర్ధం అయ్యింది "రామకృష్ణా రెడ్డి ఇక్కడ సరిగ్గా ఇమడలేకపోయాడు"... పోలీస్ వృత్తిలోకి రావాలంటే వసూళ్ళు ఎలా చేయాలో నేర్చుకోవాలి, బెదిరించడం, హింసించడం, తప్పుడు కేసులతో భయపెట్టడం ఇవన్నీ నేర్చుకోవాలి..! పై అధికారులు అడిగినంతా ఇవ్వకుంటే కేసులు కాదు కదా ఆకరికి సుసైడ్ చేసుకున్నా మీకు న్యాయం జరగదు అని ఎంత సులువుగా తెలిసిందో కదా..! ఉన్న కొంతమందిని ఐనా నిజాయితీగా బ్రతకనివ్వకపోతే ఈ రాజ్యాంగం ఎందుకు?