Contributed by Sai Ram Nedunuri
ఐదేళ్ల అధికారం కోసం .. ఐదేళ్ల అధికారం కోసం ..
టికెట్ కోసం కోట్లు ఖర్చు చేసేస్తాం రౌడీలు గుండాలకి కూడా టికెట్లు ఇచ్చేేస్తాం ప్రతి వోటుని వెల కట్టేేస్తాం ప్రభుత్వ ఉద్యోగులను కొనేసి .. ఆఖరికి ఎన్నికల ఫలితాలని కూడా మార్చేస్తాం
ఐదేళ్ల అధికారం కోసం ..
మీడియాని కొనేస్తాం కుదరకపోతే సొంత ఛానల్ పెట్టేస్తాం వార్తలకి, ప్రచార వార్తలకి తేడా లేకుండా చేసేస్తాం తప్పుడు వార్తలు సృష్టించి అయినా సరే .. అధికార కుర్చీ లాగేసుకుంటాం.
ఐదేళ్ల అధికారం కోసం ..
కులాల మధ్య చిచ్చు పెట్టేస్తాం మతాల మధ్య గొడవలు పెట్టేస్తాం ప్రజల మధ్య ద్వేషాన్ని సృష్టించేస్తాం ఉపన్యాసాలతో ప్రజలని రెచ్చగోట్టైనా .. రాజకీయ లబ్ధి పొందేస్తాం
ఐదేళ్ల అధికారం కోసం ..
వేరే పార్టీలని చీల్చేేేస్తాం కుదరకపోతే ఆ పార్టీ వాళ్ళని కొనేస్తాం అవతల వాళ్ళని పచ్చి బూతులైనా తిట్టేస్తాం వాళ్ళే మా పార్టీలోకి వస్తే .. వారి మీద ఉన్న కేసులు కూడా మాఫీ చేసేస్తాం
ఐదేళ్ల అధికారం కోసం ..
ప్రభుత్వ నిర్ణయాలని ఓటు బ్యాంకుతో ముడిపెడతాం మా కోసమే పథకాలు పెట్టుకుని ప్రజలని విస్మరిస్తాం ప్రతిపక్షం మంచి చెప్పినా పట్టించుకోం ప్రతిపక్షంలో ఉన్నాం అంటే .. ప్రభుత్వం మంచి చేసినా విమర్శించేస్తాం
ఐదేళ్ల అధికారం కోసం .. మానవత్వం మరచిపోతాం .. మృగాలుగా మారిపోతం ..