Contributed by Masthan Vali
జీవితం అంటే?
కష్టం లేనిది... సులభం కానిది భారం లేనిది... తేలిక కానిది ఎగసెగసి పడేది... పడిలేచి ఎగిరేది అలసట లేనిది... ఆయాసం ఉన్నది
విసుగెత్తించేది... వినోదాన్నీ పంచేది భయమంటూ లేనిది... తెగువసలే చూపనిది సమ్మోహన పరిచేది... జుగుప్సను కలిగించేది వ్యర్థం కానిది... వృధా పోయేది
ఓటమినెరుగనిది... గెలుపును చూడనిది నీతో ఆడుకునేది... నువ్వాడుకునేది నువ్వొదిలించుకోలేనిది... నిన్నొదిలేయనిది నరకం కానిది... స్వర్గం కాదిది
నిన్నేడిపించేది... నేడు నడిపించేది నీకు చేరువగా ఉండేది... నిన్ను దూరంగా నెట్టేది నువ్వెప్పుడూ లోబరుచుకోలేనిది… నిన్నెక్కడా లోబడనివ్వనిది నీలో తాను విలీనమైనది.... తనలో నిన్ను ఐక్యం చేసుకున్నది
నీ కలల్లోన మెదిలేది... నీ కళ్ళ ముందు మెరిసేది నిన్నందలం ఎక్కించేది...నువ్వలుసుగా చూసేది నీ పరుగును ఆపనివ్వనిది... ఏ గమ్యం చేరనివ్వనిది నువ్వడిగినదివ్వనిది... నిన్నడగకనే ఇచ్చేది
అవసరాన్ని కలిగించేది... అవకాశాన్ని సృష్టించేది అందరికీ సమానమైనది... కొందరికే అవగతమైనది అర్థం కానిది... పరమార్థం ఉన్నది అదృష్టం కాదిది... అక్షరాలా అద్భుతమైనది
రెండు ముఖాలు ఉన్నది... ఈ జీవితమన్నది..