ఫణీంద్ర నర్సెట్టి 'మధురం' నుండి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన సంభాషణలు!

Updated on
ఫణీంద్ర నర్సెట్టి 'మధురం' నుండి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన సంభాషణలు!
గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఔత్సాహిక దర్శకులు లఘు చిత్రాలు తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. వందల సంఖ్యలో ఉండే లఘు చిత్రాల్లో గుర్తుపెట్టుకునేలా, మరొక్కసారి చూసేలా, ఓ జ్ఞాపకంలా నిలిచిపోయె చిత్రాల సంఖ్య వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. ఒక ఉద్దేశంతో తనేం చెప్పాలనుకున్నాడో దానికి కట్టుబడి, ప్రేక్షకుడికి దగ్గరయ్యేలా అద్భుతమైన నిర్మాణ విలువలతో తీసిన చిత్రాల్లో ఒకటి ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన "మధురం". లఘు చిత్రం అంటే పది నుండి పాతిక నిమిషాల మధ్యలో ఉంటుంది. కొన్ని లఘు చిత్రాలు ఐదు నిమిషాలే ఉన్నా చూడలేకపోతాం కాని మధురం గంటపైన ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా విసిగించకుండా వినోదాన్ని పంచుతుంది. ఛాయాగ్రహణం, సంభాషణలు, కళ, కళాకారులు, దర్శకత్వం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా సంభాషణలు గురించి మాట్లాడుకోవాలి, అర్ధవంతమైన, ఆలోచన కలిగించే, సందర్భానుసారంగా ఉండే సంభాషణలు మీ మస్తిష్కంలో చోటు సంపాదిస్తాయిఅనటం లో సందేహం లేదు. ఇంత మంచి లఘు చిత్రం ఇంకా ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో మధురంలో గుర్తుండిపోయే సంభాషణలు అందిస్తున్నాం. ఈ సంభాషణలు చదువుతుంటే చూసినవారికి మధురమైన జ్ఞాపకాన్ని తలుచుకుంటే ముఖంపై కదిలే చిరునవ్వు పలకరిస్తుంది చూడనివారికి అతి మధురమైన ఈ మధురాన్ని చూడాలనే ఆరాటం పెరుగుతుంది అని ఆశిస్తూ. 1 copy 2 copy 3 copy 4 copy 5 copy 6 copy 7 copy 8 copy 9 copy 10 copy