Dr Papineni Sivashankar's "Rajnigandha" Wins The Sahitya Akademi Award For The Year 2016!

Updated on
Dr Papineni Sivashankar's "Rajnigandha" Wins The Sahitya Akademi Award For The Year 2016!

ఒక్కో అక్షరం ఒక సైనికునిగా వీరోచితంగా పోరాడగలదు.. ఒక పుస్తకం అన్యాయంపై యుద్ధం చేయగలదు.. అక్షరానికి ప్రజలను కాపాడి, ఛైతన్య పరచగల అద్భుత శక్తి ఉంటుంది.. ఆ అక్షర భావాన్ని పుట్టించే ప్రతి ఒక్క మహాకవిని ఒక సైనికునిగానే పరిగనించవచ్చు. అలాంటి అక్షర భావాన్ని పుట్టించి, ఆ భావాన్ని ప్రజల హృదయాలలోకి ప్రవేశపెట్టి ఎంతోమంది జీవితాలను మార్చిన రచయిత పాపినేని శివశంకర్ గారు. ఆయన రచించిన "రజనీగంధ" అనే తెలుగు పుస్తకానికి ఈ సంవత్సరం(Dec21- 2016) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. (ఈ అవార్డును వచ్చే ఏడాది ఫిభ్రవరి 22న ఢిల్లీలో అందుకోనున్నారు.)

hqdefault

ఒక దేశానికి సైనికుడు, రైతు, ఉపాధ్యాయుడు, డాక్టర్, సైంటిస్ట్ మొదలైనవారు ఎంత అవసరమో ఒక రచయిత కూడా అంతే అవసరం.. నిద్రావస్థలో ఉన్న సమాజానికి ఛైతన్యం నింపడానికి ఒక రచయిత చేసే సేవ వెలకట్టలేనిది.. వీరిని గౌరవించుకోవడం మన కనీస బాధ్యత అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గొప్ప రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్ఢులను ప్రధానం చేస్తారు. భారతదేశ సాహిత్య పురస్కారాలలో జ్ఞానపీఠ్ అవార్ఢు తర్వాత అంతటి గొప్ప అవార్డును అందుకున్న మన పాపినేని శివశంకర్ గారు రచయితగా 35సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నారు.

10698541_792361770820442_1360493964382869285_n

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లు అనే చిన్న గ్రామంలో జన్మించిన మన శివశంకర్ గారు సాహిత్యంలో పీహెచ్.డి పూర్తిచేశారు.. 350 కవితలు, దాదాపు 60 చిన్నికథలు, మట్టిగుండే, సగం తెరిచిన తలుపు అనే రెండు కథ సంపుటలు, మరెన్నో వ్యాసాలు రాశారు. ఒకపక్క తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేస్తూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన రచనలు చేస్తూ వచ్చారు. తన 35సంవత్సరాల సుధీర్ఘ రచన జీవితంలో ఇప్పటికి 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నా కాని తన రచనల ద్వారా మారిన మనుషులంటేనే ఆయనకు ఆనందం. తను రచించిన మట్టిగుండె 100 సంవత్సరాల తెలుగు ఉత్తమ కథా సంపుటిలో స్థానం సంపాదించుకోవడం అయన ప్రతిభకు నిదర్శనం.

2016కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన "రజనీగంధ" కవితా సంపుటిలో వివిధ రకాలైన కవిత్వాలతో శివశంకర్ గారు తన ఆలోచనలను అందించారు. పిల్లల పెంపకాలపై "పెంపకం", వివేకనందుని స్పూర్తితో "వివేకవాక్యం", స్టీఫెన్ హాకింగ్ స్పూర్తితో "విశ్వనరుడు" ఇలా మొత్తం 50 కవిత్వాలతో నిండిన ఈ రజనీగంధ పుస్తకానికి ఇంతటి గొప్ప అవార్డు రావడం నిజంగా ఆయన సాహిత్య ప్రతిభకు అందిన సరైన గుర్తింపుగా భావించవచ్చు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.