సింగీతం శ్రీనివాసరావు గారు - మన తెలుగు చిత్రసీమ లో ఆయన లాంటి దర్శకుడు ఉండడం మన అదృష్టం. ఎప్పుడూ ఒకే పంధాలో కాకుండా,ఒక్కో సినిమాతో ఒక్కో వైవిధ్యాన్ని చూపుతూ, తనని తాను సరికొత్తగా ఎప్పటికప్పుడు ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు. ఓసారి సెంటిమెంటల్ కథ తో ఏడిపిస్తే ,మరోసారి కామెడీ కథతో నవ్విస్తారు . వెంటనే సైంటిఫిక్ థ్రిల్లర్ తో Out of the box ఆలోచనలతో ప్రయోగం చేస్తారు,మళ్ళీ జానపదాలతో అలరిస్తారు. కళకి భాషా భేదాలు లేవని నిరూపించారు సింగీతం గారు , తెలుగు , తమిళం, కన్నడం,మలయాళం,హిందీ,ఇంగ్లీష్ ఇలా అన్ని చిత్రసీమల్లో తనదైన చిత్రాలతో చెరగని ముద్ర వేశారు . ఆయన చిత్రాలు దర్శకులుగా సినీరంగంలోకి రావాలనుకునే వారికి పాఠాలు . ఆయన సినీ ప్రయాణం లో ఎన్నో ప్రయోగాలు చేసారు,వాటిల్లోంచి ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పది అద్భుతమైన చిత్రాలని పేర్కొనడం జరిగింది, ఓసారి ఆ చిత్రాలేమిటో ఓసారి చూద్దాం.
1. పంతులమ్మ - ఫ్యామిలీ డ్రామా తో చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కూడిన కథ. ఈ చిత్రం ఏకంగా మూడు నంది అవార్డులను (ఉత్తమనటి,ఉత్తమ సంగీత దర్శకుడు ,ఉత్తమ సాహిత్యం) సొంతం చేసుకుంది .
2. మయూరి - నాట్యమయూరి సుధాచంద్రన్ జీవితకథని వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు
3. పుష్పక విమానం – భారత చలన చిత్ర చరిత్రలో ఇదో సంచలనం ,సినిమా ఆసాంతం ఎలాంటి సంభాషణలు లేకుండా రూపొందిన చిత్రం. విడుదలైన ప్రతీ చోట ఘన విజయం సాధించింది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది
4. విచిత్ర సోదరులు - కమలహాసన్ లోని నట తృష్ణ తీర్చుకోడానికి సింగీతంవారు సృష్టించిన ఓ అద్భుతం
5. అమావాస్య చంద్రుడు - ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించే కమలహాసన్, ఎటువంటి కథనైనా ఛాలెంజ్ గా తీసుకొని తన సృజనాత్మకతతో ప్రేక్షకులని అబ్బురపరిచే సింగీతం గారు - ఈ ఇద్దరు కలిస్తే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలే వస్తాయి
6. మేడమ్ - కామెడీ సినిమా అనుకుంటే కామెడీ సినిమా,సందేశాత్మక చిత్రం అనుకుంటే సందేసాత్మకమే . తెలుగు తెర పై ఇది కేవలం ప్రయోగమే కాదు,పెను సాహసం కూడా .
7. ఆదిత్య 369 - ఇవాళ్టికే కాదు ఇంకో ఐదు దశాబ్దాల తరువాత కూడా ఇది Ahead of the time మూవీనే
8. భైరవద్వీపం - మనం చందమామ కథలని పుస్తకాలోనే చదివాం .చందమామ కథకి ఏమాత్రం తీసిపోని కథని సింగీతంగారు వెండితెరపై ఆవిష్కరించారు
9. బృందావనం - గుండమ్మ కథ, మిస్సమ్మ, లాంటి మరుపురాని చిత్రాలను అందించిన నిర్మాతలతో కలిసి, సింగీతం గారు తీసిన చక్కని కుటుంబ
10. ఆడవాళ్లకు మాత్రమే - మహిళా హక్కులు,స్త్రీ పోరాటాల గురించి సామజిక స్థితిగతులు, అసమానతల గురించి సింగీతం గారు సంధించిన అస్త్రం , అలాగని ఈ సినిమా సీరియస్ గా ఉండదు.. చాలా సరద గా ఉంటుంది..
ఇవే కాదు,కన్ఫ్యూషన్ కామెడీ genre లో ఆయన తీసిన మైఖేల్ మదన కామరాజు, నవ్వండి లవ్వండి,ముంబై ఎక్సప్రెస్ . అనిమేషన్ లో చేసిన సన్ అఫ్ అలాడిన్ , లిటిల్ జాన్ . ఇంకా ఎన్నో చిత్రాలు ఆయనలోని సృజనాత్మక కోణాన్ని మనకి చూపుతాయి . ఆయన మళ్ళీ మరో అద్భుతమైన సినిమాతో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేయాలని కోరుకుందాం .