ఇప్పుడంతా తారుమారైపోయింది!! ఒకప్పుడు ఎవరిని చూసి ద్వేషించుకున్నామో వారినే నెత్తిన పెట్టుకుంటున్నాము, దేన్ని చూసి గర్వపడేవారమో వాటినే చిన్న చూపు చూస్తున్నాము. ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చరే. డ్రెస్ లు మొబైల్స్, వెహికిల్స్ వాటి మీద లోగోలు, ఫుడ్ ఇంకా రకరకాల చెత్త, ఆఖరికి దేశ కోసం ప్రాణ త్యాగాలు చేసిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ స్థానంలో వేరే దేశస్థులను నెత్తిన పెట్టుకుంటున్నాము. ఈ పద్దతి ద్వారా "వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ" అనే ఒకరకమైన Interiority Complex పెంచుకుంటున్నాము.. ఇది మారాలి, చక్రం మళ్ళీ వెనక్కి తిరగాలి అని ఒక కుటుంబం తమ కుల వృత్తిని ఇందుకు మార్గంగా ఎంచుకుంది. ఇక నుండి మీ టీ షర్ట్ మీద అలెన్ వాకర్ లోగో స్థానంలో రమణీయమైన చేర్యాల నకాశి ఆర్ట్ ద్వారా మన సంస్కృతిని తెలియజేసే "డూ డూ బసవన్న లోగో" కు మార్చుకోవచ్చు, మీ మొబైల్ కవర్ మీద ఎప్పుడు కనిపించే ఏవో కార్టూన్ల స్థానంలో "మన రైతు పొలం దున్నుతున్న డిజైన్ ను పొందుపరుచుకోవచ్చు".
వందల సంవత్సరాల చరిత్ర: చేర్యాల ఆర్ట్ కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కళ అంతరించిపోతుందేమో అయ్యే ఎలా ఎలా అని బాధ పడకుండా "ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉన్నట్టుగానే ప్రతి ఐడియాలో, పనిలో గొప్పతనం ఉంటుంది దానిని సరిగ్గా తెలియజేయగలిగితే సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది". అని ప్రస్తుతం ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా చేర్యాల ఆర్ట్ ను యూత్ కు చేరువ చేయాలన్నదే సాయి కిరణ్ గారి ఆశయం. చేర్యాల కళను సాయి కిరణ్ గారి వంశం సుమారు 400 సంవత్సరాల నుండి పెంచి పోషిస్తున్నారు. పూర్వం రోజుల్లో నాటకాలు ఆడేవారికోసం, పటం కథలు, మాస్క్ లుగా, అలాగే చీరలు మొదలైన వాటికోసం ఈ కళను ఉపయోగించుకున్నారు.
కుటుంబమంతా కలిసి.. టెక్నాలజీ పెరిగిపోవడం, జనాలు సినిమాలకు, టీవీలకు అతుక్కుపోవడం మూలంగా ఈ కళను నమ్ముకున్న వారికి పని లేకుండా పోయింది. చాలామంది కళాకారులు ఇతర పనులు చూసుకుని వెళ్లిపోతున్నా కానీ సాయికిరణ్ గారి కుటుంబ సభ్యులు మాత్రం ఈ కళనే కాపాడుతూ వస్తున్నారు. సాయి కిరణ్ అమ్మ నాన్నలు నాగేశ్వర్, పద్మ గార్లు కూడా ఈ కళలో ఉన్నతులు, రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. సాయి కిరణ్ తో పాటుగా తమ్ముడు శ్రావణ్, సోదరి సౌజన్య అందరూ కలిసి ఈ కళను బ్రతికిస్తూ వారు బ్రతుకుతున్నారు..
ఇది మన ట్రెండ్: చేర్యాల ఆర్ట్ తో ఒక ట్రెండ్ సృష్టించాలన్న ఆలోచన సాయి కిరణ్ గారిది. BFA చేస్తున్నప్పుడు ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో కాకుండా మన చేర్యాల నకాశి కళతో ట్రెండ్ సృషించాలనే తపన పడ్డారు. ఈ ట్రెండ్ అమలు జరిగితే కనుక ఎక్కువ మందికి ఈ కళను నేర్పించవచ్చు, వారికి పని దొరుకుతుంది, మరీ ముఖ్యంగా విదేశస్థులను మోయాల్సిన అగత్యం భారతీయులకు ఉండదు. ప్రస్తుతం ఈ కళను హ్యాండ్ బ్యాగ్స్, చీరలు, కుర్తాలు, మొబైల్ కవర్, టీ షర్ట్స్ మొదలైన వాటి ద్వారా దీనికి ఇంటర్నేషనల్ లెవల్ మార్కెట్ తీసుకురావాలని లక్ష్యం నిర్ధేశించుకున్నారు.
మరిన్ని విషయాల కోసం ఇక్కడ తెలుసుకోవచ్చు: Website: https://cherial-paintings.business.site mobile number :8125284246