Contributed by Pranavanath margala
ఆ రోజు అందరూ వాళ్ళ మిత్రులతో , సోదరులతో , తోటివారితో వాళ్ళ పనిలో గజిబిజిగా ఉన్నవేళ ... నేను నాలా నాకై ఒంటరిగా , నాకే తెలియని ఏదో ఆలోచనలో పడినవేళ... నీటి గట్టు పై నడుచుకుంటూ , మనసులో ఏదో తెలియని వ్యధతో వెళ్తున్నవేళ... నీటిలో చేపలా కాకుండా , నీటిపై భూమిపై ఉండే కప్పలా కాకుండా , ఒక చిన్న చీమలా గట్టుపై కూర్చున్నవేళ... ముందు నీరు , పైన ఆకాశం , పక్కన అడవి ఇవన్నీ చూసిన ఆ ఒక్క క్షణం నాలో ఉన్న ఆ చిన్న వ్యధ ఎంత అని ఆలోచిస్తున్నవేళ... కనుమరుగైన ఆ వ్యధ , సంతోషంతో నిండిన నా ఎద , నాలో మార్పుతెచ్చిన ఆ క్షణం , ఎన్నడూ లేని ఉత్సాహాన్ని నింపినవేళ... యుద్ధంలో కత్తి పట్టిన ఒక సైనికునిలా , తరగతి గదిలో పుస్తకం పట్టిన ఒక విద్యార్థిలా , కలాన్ని పట్టిన ఒక కవిలా మారినవేళ... ఆరోజు నేను ఏరోజు మరువని రోజుగా మారిన వేళ...