Make This Summer Much Sweeter With These Tasty And Healthy Organic Mangoes!

Updated on
Make This Summer Much Sweeter With These Tasty And Healthy Organic Mangoes!

"ఎండాకాలం ఉష్ణోగ్రతతో బాధపెడుతున్నానని చెప్పి ఈ ప్రకృతి మనకోసం కమ్మని మామిడి పండ్లను అందిస్తుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రకృతి ప్రేమకు మందులు అద్ది చాలామంది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు".

"సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్న ఆరిఫా(MA English), రఫీ(MBA, MCom) గారి 40 ఎకరాల ఫామ్ లో మొత్తం 8 ఆవులున్నాయి. ఇవన్నీ కూడా ఎరువుల కోసం పెంచుతున్నవి. ఇవి సుమారు ఆరు సంవత్సరాల నుండి వారి దగ్గరే ఉన్నాయి. మీకో విషయం తెలుసా ఆవులకు పుట్టిన దూడల కోసమే తప్ప 6 సంవత్సరాల కాలంలో వీరు ఒక్కసారి కూడా వాటి పాలను తాగలేదు. ఎందుకంటే "మేము వాటిని కేవలం ఎరువుల కోసమే పెంచుతున్నాము, ప్రేమగా వాటి పిల్లల కోసం ఇస్తున్న పాలను వాటినే తాగనిస్తున్నాం. అందుకే మా ఫామ్ లో ఉన్న ప్రతి లేగ దూడ మెడకు తాడు వేసి కట్టెయ్యకుండా అదిగో(చూపిస్తూ) అలా స్వేచ్ఛగా ఎదగనిస్తున్నాము". ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలంటే డబ్బు సంపాదించాలి అనే బలమైన కాంక్ష కన్నా సమాజం మీద ప్రేమ మిన్నగా ఉండాలి. 11 సంవత్సరాల నుండి ఒక్క పెస్టిసైడ్ చుక్క కూడా భూమి, చెట్టు మీద వేయకుండా మామిడి పండ్లను పండిస్తున్న ఆరిఫా, రఫీ గారి వ్యక్తిత్వం గురుంచి మాటల కన్నా మరింత క్షుణ్ణంగా అర్ధం చేసుకొనేందుకు వారు అవలంబిస్తున్న ఈ ఒక్క పద్దతి చాలదా..

మనమే పండించి, మనమే అమ్మాలి: ఆరిఫా, రఫీ గారు ప్రారంభంలో వాటర్ మిలన్ పండించారు. మంచి సాంప్రదాయ ఎరువులతో పాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో మామూలు బరువు కన్నా కాయలు పెద్దగా వచ్చాయి. ఒక దళారీకి ఒక్కో కాయను 30రూపాయలకు అమ్మారు. వారు అమ్మిన నిమిషానికే అక్కడికి కస్టమర్స్ వచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 30రూపాయలకు కొన్న కాయను వారి ముందే 80 రూపాయలకు అమ్మారు. "ఎంత మోసం ఇతనేమైన విత్తనాలు నాటి, కలుపు తీసి, నీటిని పెట్టి, ఏ తెగుళ్లు ఆశించకుండా పంటను కాపాడాడా.? ఇలాంటి దళారీ వ్యవస్థ వల్ల అటు కస్టమర్స్ నష్టపోతున్నారు. ఇటు మాలాంటి రైతులు మోసపోతున్నారు. పండించిన పంటను వినియోగదారునికి నేరుగా మనమే అమ్మాలి" అని అప్పుడే బలమైన నిర్ణయం తీసుకున్నారు.

అసలైన మామిడి: యాదగిరిగుట్ట, చేవెళ్లలోని భూమి కొనడం, వ్యవసాయానికి అనువుగా చెయ్యడం దగ్గరి నుండి ఈ దంపతులు అన్ని రకాల ఇబ్బందులను చవిచూశారు. సైంటిస్టులు ఐతే ఈ భూమి వ్యవసాయానికి పనికిరాదన్నారు. 11 సంవత్సరాల క్రితం ఆరిఫా, రఫీ గారు మామిడి పండ్లను అది కూడా ఆర్గానిక్ పండ్లను పండించి, నేరుగా ప్రజలకే అమ్ముతామంటే రైతు కూలీల దగ్గరి నుండి ప్రభుత్వ అధికారుల వరకు కూడా హేళనగా నవ్వారు. "ఆవు పేడ, మూత్రంతో తయారుచేసిన ఎరువులను చల్లడానికి రావాలని అడిగితే రైతుకూలీలు యూరియాను ముట్టుకుంటాం కాని ఈ పేడను ముట్టుకోము అని ఖరాకండిగా చెప్పేశారు. ప్రభుత్వ ఆధికారుల దగ్గరికి సబ్సిడీ కోసం వెళితే నీ మంచి కోసమే చెబుతున్నాం అంత ఖర్చు పెట్టి ఆర్గానిక్ మామిడి ఎవరు తింటారు.? రిస్క్ తో కూడుకున్నది వదిలేయండమ్మ అని సలహాలిచ్చారు కూడా. కాని వారి తపన తీవ్రత ముందు ఇబ్బందులన్ని ఒక్కటొక్కటిగా ఒడిపోతూ వచ్చాయి. బయోడైనమిక్‌ వ్యవసాయ పద్ధతితో వ్యవసాయనికి అనుకూల భూమిగా మార్చారు, రైతు కూలీలకు సాంప్రదాయ వ్యవసాయ గొప్పతనం ఓపికతో వివరించి పనులలో భాగం చేశారు. ఇక ఏ అధికారులయితే నిరుత్సాహ పరిచారో వారే "మాకు తెలిసిన వారే, వారి తోటలోని పండు మహారుచిగా ఉంటుందని" గర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకువచ్చారు.

సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్: 5 సంవత్సరాల పాటు పెస్టిసైడ్స్ వాడకుండా పండించినప్పుడే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని సర్టిఫికెట్ జారిచేస్తారు. 11 సంవత్సరాల నుండి చేస్తుండంతో పబ్లిసిటీ లో బ్రహ్మాస్త్రం లాంటి మౌత్ పబ్లిసిటీ ద్వారా వీరి పేరు, పండ్లు దేశ విదేశాల్లోకి చేరిపోయింది. మన భారతదేశం సుమారు 1784 రకాల మామిడి పండ్లు పండించడానికి అనుకూలం. ఆరిఫా, రఫీ గారు వారి 40 ఎకరాల సువిశాల ఫామ్ లో శ్రేష్ఠమైన, రుచికరమైన 21 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు.

జీవామృతం, కషాయం: ఎదుటివారికి ఏమి ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఇది భూమి విషయంలోనూ.. భూమి కన్నతల్లి లాంటిది, దానిని కాపాడుకుంటేనే మనకు భవిషత్తు ఉంటుంది. సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నప్పుడు మొదట్లో రకరకాల తెగుళ్లు వచ్చేవి. వీటికోసం చాలామంది రసాయనాలు వాడండి త్వరగా రిజల్ట్స్ వస్తాయి అని సలహా ఇచ్చినా వారు ఎంతమాత్రం అంగీకరించలేదు. ఆరిఫా, రఫీ గార్లు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎంతో రీసెర్చ్ చేశారు. కషయాలు, వర్మీ కంపోస్ట్, జీవామృతం లాంటి ఎన్నో ఎరువుల గురించి తెలుసుకుని, నేర్చుకుని 11 సంవత్సరాల నుండి భూమిని, చెట్లను సొంత బిడ్డల్లా కాపాడుకుంటున్నారు.

నెమళ్ళు, పక్షులతో తో: కాజల్, హానీ, హరిణి, రోషిణి, రోషన్, మైత్రి, కబాలి, చాందిని.. వీళ్ళంతా ఎవరని అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా వీరి ఫామ్ లో జీవిస్తున్న ఆవులు, దూడలు. ఇవి కూడా వీరి కుటుంబంలో భాగం కనుక వాటికీ పేర్లు పెట్టేశారు. ఆరిఫా, రాఫీ గార్లు ఫామ్ లోకి వస్తున్నారు అని తెలియగానే అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వాశంతో ముద్దాడుతాయి. ఇక ఇక్కడి ప్రశాంతత మూలంగా నెమళ్ళు, కొన్ని రకాల పక్షులు నివాసముంటున్నాయి కూడా. ప్రకృతితో మమేకమవ్వడం, జీవులతో కలిసి బ్రతకడం లాంటి ప్రేమ నిండిన పద్దతులు ఇక్కడ సర్వసాధారణం.

ఆన్ లైన్ లో: రఫీ గారు మొదట ఆన్ లైన్ లో మామిడి అమ్మకాలు చేద్దామని ప్రపోజల్ పెట్టినప్పుడు ఆరిఫా తో పాటు అందరూ అనుమాన పడ్డారు. మామిడి పళ్ళను చేతితో పరిశీలించి, వాసన చూసి, అవసరమైతే ఒక ముక్కను కొరికితిని మరి కొనరు.. ఇదే వారికి అలవాటు. ఐతే కొత్త పద్దతి ఎప్పుడు అనుమానంగానే ఉంటుంది, కాని ప్రయత్నించి ఓడిపోతే మేలు అని ప్రారంభించారు. మొదట అతి కష్టం మీద ఎవరో, ఒకరో ఇద్దరో ఆర్డర్ పెట్టారు. అది క్రమంగా పెరుగుతూ వచ్చి వేల ఆర్డర్లకు పెరిగింది. "మమ్మల్ని నమ్మండి మీకు కావాల్సిన పండును ఏరి కోరి మేము సెలెక్ట్ చేసి పంపుతాం. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది". అని స్వయంగా వారే ప్యాకింగ్ చేసి అందిస్తున్నారు. అసలైన మామిడి పండు రుచిని చూడాలంటే "Ar4 Mangoes" అనే స్థాయికి వీరి కృషి చేర్చింది. "అక్కడ పండ్లు ఎలా ఉంటాయో ఏమో, అమెరికాలో ఉంటున్న మా బాబుకు పండ్లను పంపించగలరా అని తల్లిదండ్రులు అడగడంతో ప్రస్తుతం అమెరికాకు కూడా ఈ ఫామ్ లో పండించిన పండ్లు చేరుతున్నాయి.

ఏ వ్యాపారంలో ఐనా కావాల్సింది నమ్మకం. ఒక్కసారి ఆరిఫా, రఫీ గార్లను కలిసినా, లేదంటే వారి ఫామ్ కు వెళ్ళినా ఒక విషయం మాత్రం ప్రస్పుటంగా కనిపిస్తుంది. వారు కస్టమర్స్ కి నమ్మకం మాత్రమే కాదు, ప్రేమను కూడా అందిస్తున్నారని.

మరింత Information కొరకు https://www.ar4mangoes.com/ Contact For India - 9912340404

For USA bookings usa.ar4mangoes.com Contact For USA 7730040404