యూ ట్యూబ్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని సెర్చ్ చేస్తే పాపం. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి లక్షలు సంపాదిస్తున్నాను అనే వీడియోలే ఎక్కువ. నిజానికి ఫార్మింగ్ లో ఆదాయం చాలా తక్కువ. ఐన కానీ మీడియా జనాల్ని వ్యూస్ కోసం రాంగ్ గా గైడ్ చేస్తుంది. మీడియాలో చూసి ఏదో ఊహించుకుని జాబ్ కి రిజైన్ చేసి ఇందులోకి రావాలని సిద్ద పడితే జాబ్ పోయి, ఫైనాన్సిల్ గా కూడా చాలా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. వ్యవసాయం అంత లాభాసాటిగానే ఉంటే రైతులు భూములు అమ్మేసి హైదరాబాద్ కు వచ్చి వాచ్ మెన్ లుగా, పనిమనుషులుగా చెయ్యాల్సిన పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి.. జాబ్ కు రిజైన్ చేసి ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారా.? ఐతే నా మాటలు కూడా వినండి.. అంటూ అభినవ్ గారు వ్యవసాయం చేయాలనుకునే యువకుల కోసం విలువైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అభినవ్ గారు గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ ను కూడా అందుకున్నారు, అలాగే ఐఐటీ లో ఎమ్.టెక్ పూర్తిచేసి పది సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు.
పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు: