Remembering The Greatest Icon Of Telugu People Everywhere!

Updated on
Remembering The Greatest Icon Of Telugu People Everywhere!
అప్పటి వరకు తెలుగు వారంటే మద్రాసీయులుగానే గుర్తుంపు ఉండేది కానీ విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామ రావు ఆగమణం తర్వాత తెలుగువారంటే గుర్తింపు మాత్రమే కాదు తెలుగు వారంటే గౌరవం కూడా వచ్చింది. ఇప్పటికి ఎప్పటికి సినీ, రాజకీయ రంగంలో ఆయనే అగ్రగణ్యుడు ఆయనను చూసే నటనను నేర్చుకున్నారు ఆయనను చూసే పాలించడం నేర్చుకున్నారు ఆయనను చూసే తెలుగువాడంటే ఇలా ఉంటాడా అని ప్రపంచమంతటికి తెలిసింది. కళామతల్లి, తెలుగుతల్లి పెద్దకొడుకు ఆయనే..1923 కృష్ణ జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో రామారావు గారు జన్మించారు. చిన్నతనం నుండే చదువులతోపాటు వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు చదివేవారు. ఇంటర్మీడియట్ చదువుతుండగా 20ఏళ్ళ వయసులో తన మేనమామ కూతురు బసవతారకాన్ని పెళ్ళిచేసుకున్నారు. గుంటూరు ఏ.సి కాలేజిలో బి.ఏ పూర్తి చేసి మంగళగిరిలో సబ్-రిజస్టర్ గా గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కాని నటన మీద ఉన్న అమితాసక్తితో తర్వాతి కాలంలో ఉద్యోగం మానేశారు. మనదేశం అనే సినిమాతో 1949లో తెరంగ్రేటం చేశారు మొదట కాస్త తడబాటు పడినా పాతాళబైరవి, మల్లేశ్వరి సినిమాల హిట్ తో ఆయన స్థానం సుస్థిరమైంది మాయబజార్ కోసం అత్యధికంగా 7500రూపాయల పారితోషకం తీసుకొని ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించాడు. 6 11 5 ఇక ఆనాటి నుండి సినీ జగత్తులో ఆయన ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది. సంవత్సరానికి 8 సినిమాలు నటనకు ప్రాధాన్యమైన పాత్రలు చేస్తు ఎన్.టి.ఆర్ అంటే మకుటం లేని మహరాజుగా కీర్తింపబడ్డాడు. 40సంవత్సరాలకు పైగా సూదీర్ఘ సినీ కెరీర్లో దాదాపు తెలుగు, తమిళ, హిందీ భాషలలో 300పైగా చిత్రాలలో నటించారు. ఇందులో హిస్టారికల్, జనపద, సాంఘీక, పౌరాణికాలలో నటుడిగా తనదైన ముద్ర వేశారు. దర్శకునిగా 16 నిర్మాతగా 8 సినిమాలు రూపొందించారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, శివుడు లాంటి దేవతా మూర్తులు అంటే తెలుగువారందరికి ఆయనే గుర్తుకువస్తారు అప్పటివరకు ఏ హీరో సాహసించలేని నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలయిన రావణుడు, దుర్యోదనుడు లాంటి పాత్రలు చేసి అబ్బురపరిచాడు. డైలాగ్ డెలివరి, నటన, దర్శకత్వం, క్రమశిక్షణలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికి ఆయనను చూసే చాలామంది నటులు నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నారు. నటనలో ఆయన చేసిన సినిమాలే ఇప్పటికి ఎప్పటికి ఒక డిక్షనరీలా ఉంటు అందరికి స్పూర్తినిస్తున్నాయి. 13 1 12 8 1978 నుండి ఆంధ్రరాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. కేవలం 5సంవత్సరాలలోనే నలుగురు ముఖ్యమంత్రులను మార్చి రాష్ట్రంలో ప్రజల జీవితాలను పట్టించుకోకుండా ఢిల్లీకి నాయకులను పిలిపించుకొని అక్కడే ముఖ్యమంత్రులను నిర్ణయించేవారు.. మొదటినుండి కాంగ్రెస్ పార్టికి తెలుగువారంటే చులకన భావన ఉండేది ఇంకా రాష్ట్రంలో నెలకున్న ప్రజల విపత్కర పరిస్థితులను చూసి చలించి 60ఏళ్ళ వయసులో మన తెలుగు సింహం ఎన్.టి. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి 1983 జనవరి 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కేవలం 9 నెలలలోనే 100సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఓడించి అత్యధిక స్థానాలతొ ఘనవిజయాన్ని దక్కించుకున్నాడు. 4 7 ఆయన పాలనను రామరాజ్యంగా పరిగణిస్తుంటారు ఆయన అమలు చేసిన ముఖ్య పధకాలు.. 1. రెండు రూపాయలకే కిలో బియ్యం. 2. సగం ధరకే పేదలకు వస్త్రాలు. 3. వేల సంఖ్యలో పేదలకు ఇల్లు. 4. సంపూర్ణ మద్య నిషేదం. 5. స్ర్తీలకు కూడా ఆస్థిలో సమానహక్కు(ఈ పద్దతే ఇప్పుడు దేశమంతా ఆచరిస్తుంది). 6. రైతులకోసం ఎన్నో పధకాలు "తెలుగుగంగా" వంటి ప్రాజెక్టుల నిర్మాణం. 7. హైదరాబాద్ టాంక్ బాండ్ ప్రాంతంలో తెలుగుతేజాల విగ్రహాల ఏర్పాటు. 8. సామాన్య ప్రజనీకాన్ని రక్తంలా పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. 9. తాలూకా వ్యవస్థలను తీసేసి మండల వ్యవస్ధను ఏర్పాటు చేశారు. 10. తెలుగు భాషకు, సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. సచివాలయంతో సహా ప్రభుత్వ కార్యకలపాలన్నింటిని తెలుగులోనే కొనసాగించేవారు. 11. ఎన్.టి. రామారావు అంటేనే బలమైన తెలుగుతనానికి ప్రతీక ఆయనెప్పుడు అచ్చతెలుగు పంచెకట్టుతో, భుజాలమీద కండువాతో దర్శనమిచ్చెవారు. 12. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎంతటి కష్టమైన నిర్ణయమైన అమలు చేసేవారు మంచి చేయడానికి ఎవ్వరికి భయపడేవారు కాదు. 13. మావోయిస్టులు కూడ దేశభక్తులే అని సమర్ధించిన గొప్ప మంచి మనసున్న నాయకుడు. రాజకీయలలో కూడా ఆయనే అందరికి స్పూర్తి.. పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగాలు, పేదలతో సహపంక్తి భోజనాలు, ప్రజాకర్షక పధకాలు, వెండితెర దేవుడిలా కోలుస్తున్నా ఎన్నికల ప్రచరాలలో ఏ భేషజం లేకుండా రోడ్డు ప్రక్కనే స్నానం చేయడం, విరాలలకోసం తానే స్వయంగా ప్రజలను అడగడం ఇలా ఎన్నో ముఖ్య లక్షణాలు ఆయన సొంతం. 10 9 1996 జనవరి 18న 73 సంవత్సరాలలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. బతికున్నంత నీతికి ధర్మానికి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తెలుగువాడు ఎక్కడ ఉన్నా నందమురి తారక రామారావు ఉంటారు. "తెలుగు జాతి అంతటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్". నిజానికి ఎప్పుడో 1968లోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్ఢు ఇచ్చి సత్కరించింది కాని ఆయన భారతరత్న అర్హులు. తెలుగు వాడి ఆత్మగౌరవానికి ఆయనే ప్రతీక "పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయం" అంటు నినదించి నిజమైన నాయకునిగా అందరి మన్ననలు అందుకున్నారు. ఆయనకు రాజకీయలు తెలియవు మోసం చేయడం రాదు ఆయనకు కుళ్ళు కుతంత్రాలు చేయడం తెలియవు అందుకే ఆయనను ఎందరు మోసం చేసినా సామాన్య ప్రజానీకాన్నే చివరి వరకు నమ్ముకున్నారు. 3 2