చాలామందికి ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప మనసు ఉంటుంది కాని వారు వర్క్ లో బిజీగా ఉండడం వల్లనో, లేదంటే మిగిలిన వారి అవసరం తెలియక పోవడం వల్లనో, మరే ఇతర కారణం వల్లనే గాని సహాయం చేయలేక పోతున్నామని బాధ పడుతుంటారు. ఫ్రెండ్షిప్, కొన్ని రకాల సమస్యల కోసం సోషల్ మీడియా ఉన్నట్టు, పుస్తకాల కోసం లైబ్రరీ ఉన్నట్టు సహాయం చేయడానికి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ వాల్ ఆఫ్ కైండ్ నెస్ స్టార్ట్ అయ్యింది. మొదట ఈ రకమైన పద్దతి మన దేశంతో పాటు చాలా దేశాలలో ఉంది. ఈ మధ్యనే నిజమాబాద్, మంచిర్యాలలో ప్రారంభమవ్వడం, అది బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయ్యింది.
బట్టలు, దుప్పట్లు, నోట్ బుక్స్, స్టోరి బుక్స్ ఇలా రకరకాల వస్తువులు ఆ చోట వదిలేవారు. వాటిని తీసుకోవడానికి కూడా లోయర్ మిడిల్ క్లాస్, పేదవారు ఎంతోమంది వచ్చేవారు. 1000కి పైగా నోట్ బుక్స్, 10,000 వరకు బట్టలు ఆ వేదిక ద్వారా అందించారు. డాక్టర్ శ్రావణి, శ్రీను నాయక్ గారి ఆద్వర్యంలో నిజమాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గరిలో కూడా ఇదే రకమైన పద్దతిలో అక్కడి ప్రజలు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు అది కూడా మంచి సక్సెస్ సాధించింది.
ఇప్పుడు మన హైదరాబాద్ లో.. ఇది ఒక వ్యక్తి, ఒక ఎన్.జి.ఓ అని కాకుండా ఈసారి ఈ వేదిక కోసం మన గవర్నమెంట్ వారే ముందుకు రావడం విశేషం. మున్సిపల్ కమీషనర్ జనార్ధన్ రెడ్డి గారు రాజేంద్రనగర్ లో మొదటిసారి Wall Of Kindness ను స్టార్ట్ చేశారు. మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా మన హైదరాబాద్ లో ఏ బిజినెస్ ఐనా, మరే దానికైనా కాని మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్ కూడా మంచి సక్సెస్ కాబోతుంది.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఈ పద్దతి ఎంతోమందికి ఉపయోగపడడమే కాదు ఒక మనిషికి మరో మనిషిపై ఆత్మీయత పెరగడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది.