(హాస్పిటల్ )
వరుణ్ : ఎం కాదు అత్త ! బయపడకు , డాక్టర్ సేఫ్ అని చెప్పారు
(10th క్లాస్ Farewell Day )
ఆఖరి రోజు , ఈరోజు చెప్పలేకపోతే , మళ్ళీ కలుస్తానో లెదో తెలీదు , మాట్లాడగలనో లెదో కూడా తెలీదు. 1.5 సంవత్సరాలు మౌనం లోనే మాట్లాడుకున్నాం . కానీ మౌనానికి మాటలు తోడైతేనే ప్రేమని నిర్దారిస్తారంట కదా. ఫేర్వెల్ అవ్వడం తో ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు , వెళ్లి మాట్లాడితే ఎవరన్నా ఎమన్నా అనుకుంటారన్న భయం కూడా లేదు.
చిన్న గొడవతో మొదలైన బంధం , తన కళ్ళు చూసాక ఆరోజు నుండి మదిలో ఉండిపోయింది. ఆ గొడవ తర్వాత 9th క్లాస్ సమ్మర్ హాలిడేస్ చాలా మెల్లిగా , భారంగా కదిలాయి. ఎపుడెప్పుడు స్కూల్ కి వెళ్దామా ? ఆ కళ్ళని ఎప్పుడు చూస్తానా అన్న ద్యాస లోనే గడిచిపోయాయి. మొత్తానికి జూన్ 6న ప్రతిసారి , వెళ్ళను వెళ్ళను అని మారాం చేసే నేను , త్వరత్వరగా తయారవడం చూసి అమ్మ కూడా ఆశ్చర్య పోయింది.
మొత్తానికి బస్సు దిగి క్లాస్ రూమ్ లో కూర్చున్న. నమ్మరు .... తాను వచ్చి కూర్చున్న ఆ క్షణం ఎప్పటి నుండో మోస్తున్న బరువంతా మాయమైంది. మధ్యానమంతా ఎండలో ఆడుకుని ఇంటికి వెళ్లే ముందు తాగిన సోడా ఇచ్చే ఆ సంతోషం గుర్తొచ్చింది. పోలిక అంత అందంగా ఉండక పోవచ్చు , కానీ ఆ నిమిషం అలానే అనిపించింది .
(హాస్పిటల్ )
డాక్టర్ : వరుణ్ కొంచెం సీరియస్ అయ్యేలా ఉంది , కంగారు పడకు , మా ప్రయత్నం మేము చేస్తాము.
(10th క్లాస్ Farewell Day )
అంత బానే ఉంది కానీ వెళ్లి మాట్లాదామంటే ధైర్యం సరిపోవట్లేదు.
10th క్లాస్ మొదటిలో తనని ఎక్కడ చుసిన చూడక పోయిన , లంచ్ బ్రేక్ తర్వాత మాత్రం వాటర్ నింపుకోడం కోసం , ప్రిన్సిపల్ రూమ్ పక్కనున్న వాటర్ టిన్స్ దగ్గరికి ఒకేసారి వెళ్ళేవాళ్ళం. తనకు దగ్గరగా నిలబడింది ఆ 5 నిమిషాలే , బయటికి కనపడకపోయిన మనసు ఎగిరి గెంతేసింది. గంట క్లాస్ లో 2-3 సార్లు , 4-5 సెకన్లు కళ్ళు కళ్ళు కలిసేవి , 6వ సెకండ్ తెలికుండా తల పక్కకి వెళ్లిపోయేది , ఏమో ఏదో తెలియని భయం. ఇంకా అలా చూసుకున్న 4-5 సెకన్లలో పొరపాటున తను చూస్తూ నవ్వితే అంతే , ఆ రోజు మొహంలో కళ,ఆనందం నిండిపోయేది . ఇంట్లో ఆ మురిసిపోడం చూసి ఎక్కడ ఎం అనుకుంటారో అని బలవంతంగా బాలెను , నిద్రపోతా అని కవర్ చేసే వాడ్ని .నా 10th క్లాస్ జ్ఞాపకాలు ఇప్పటికి ఒక చిరునవ్వు తెప్పిస్తున్నాయి అంటే తనే కారణం. మేము మాట్లాడుకోము కానీ తన ఫ్రెండ్స్ కి మా ఒళ్ళకి ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ తన స్లాం బుక్ లో 1st పేజీ నన్నే రాయమన్నారు.
"మౌనం లో విహరిస్తున్న ప్రేమ , మాటల సహాయం కోసం ఎదురు చూస్తుందంతే"
మొత్తానికి ధైర్యం తెచ్చుకుని వెళ్లి మాట్లాదం అనే లోపు వాళ్ళ నాన్నగారు వచ్చి , ఇద్దరు కలిసి ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లారు. వెళ్లే ఒక్క నిమిషం ముందు తను చుసిన చూపు ఇప్పటికి మర్చిపోను, చెంప మీద కొట్టింది కానీ కళ్ళతో. అరగంట తర్వాత బయటికి వచ్చి ఆయన వెళ్లిపోయారు. కోపం నిండిన కళ్ళతో వాటర్ బాటిల్ పట్టుకుని , " ఇప్పుడన్నా ఒస్తారా? " అనే లుక్ ఇచ్చింది.ఎన్నో జ్ఞాపకాలున్న ఆ ప్లేస్ లో తాను నాతో మాట్లాడిన మొదటి పదం -- "సిగ్గుందా ? అసలా? "
"నాకు ఎక్కువ టైం కూడా లేదు. ఇంటర్ నన్ను హాస్టల్ లో వేస్తారంట ! మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు , మాట్లాడుకున్న మొదటి రోజే దూరం అవుతాం అనుకోలే. ఏదైతే ఏంటిలే , నువ్వంటే నాకు ఇష్టం నాన్నా , ఎందుకని అడగకు , ఇష్టం అంతే , ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకునే వయసు కూడా కాదని తెలుసు, మళ్ళీ చెప్పే అవకాశం రాదేమో అనే భయం తో చెప్తున్నా అంతే. ఎం మాట్లాడవేంటి ?"
వరుణ్ - నా .. నాకు.... నువ్వంటే చాలా చా.. చాలా ఇష్టం
తెలీకుండానే కోపంతోనో , ప్రేమతోనో గట్టిగ కౌగలించుకుని వెళ్ళదు అని అడిగా .....చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది.
(హాస్పిటల్ )
డాక్టర్ - వరుణ్ వెళ్లి చూడచ్చు
వరుణ్ - అంత ఒకే నా డాక్టర్ ?
డాక్టర్ - వెళ్లి చూడవయ్యా
నర్స్ - తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యాంగా ఉన్నారు , లక్కీ సార్ మీరు ఆడపిల్ల.
కంట్లో నీళ్లు ఆగట్లేదు , నా కూతురు , మన కూతురు నిత్యా , మన కూతురు . Thank you
(నవ్వుతు)
వరుణ్ - నాకు ఎం మాట్లాడాలో అర్ధం కాట్లేదు
నిత్యా - సిగ్గుందా అసలు ?
We are parents Nitya
10th నుండి ఇప్పటివరకు చాలా కష్టాలే పడి ఉంటాము , స్లాం బుక్ దాచుకుని తను కాల్ చేయకపోయినా , ఇంకా రాదు అని నేను నమ్మడం మానేసిన ఈరోజు ఇంత హ్యాపీ గా ఉండేవాడిని కాదు. అసంభవం అనుకుంటే ఆశ కూడా ఆవిరి అయిపోతుంది , కొంచెం నమ్మితే ఇది గోండి ఇంత నిండు కుటుంబం దరికి చేరుతుంది.
From 10th class till date , They were always there for each other.