Our Take On Hero Nithiin, Who Brilliantly Started His Career's Second Innings

Updated on
Our Take On Hero Nithiin, Who Brilliantly Started His Career's Second Innings

అరే... ఆ నితిన్ కి ఏం Acting వచ్చురా... పవన్ కళ్యాన్ పేరు చెప్పి ఆయనకు పెద్ద Fan అని చెప్పుకొని వాళ్ళ అభిమానులతో హిట్ కొట్టించుకుంటాడు... ఐనా నితిన్ వాళ్ళ నాన్న తెలంగాణాలో పెద్ద ఫిల్మ్ డిస్ర్టిబ్యూటర్ ఫుల్ క్యాష్ పార్టి వాళ్ళకు ఇండస్ర్టీలో పరిచయాలున్నాయి... ఇంకా పైసల్ బాగున్నయ్ అందుకే సినిమా హీరో అయిపోయినాడు...అందమైన హీరోయిన్లు, పెద్ద డైరక్టర్లతో చేస్తు హిట్టు కొడుతున్నాడ్రా... అరే నితిన్ కు అదృష్టం బాగుందిరా ... "ఇది హీరో నితిన్ గురుంచి తెలియని వాళ్ళు అనుకునే మాటలు, అపోహలు..."

హీరో పవన్ కళ్యాన్ గారి పేరు చెప్తే అభిమానులు ఇష్టంతో చూస్తారేమో కాని ఇక్కడ సినిమాను ఏ ఒక్క హీరో అభిమానులు హిట్ చేయలేరు... సినిమా ప్రేక్షకులందరికి సినిమా నచ్చితే తప్ప అది హిట్ నిజమైన హిట్ అనిపించుకోదు... ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే ఒకానొక దశలో సాక్షాత్తు పవన్ కళ్యాన్ గారికే 10 సంవత్సరాలకు పైగా హిట్ లేదు... ఇంకా ఆయన అభిమానులు నితిన్ సినిమాలను ఎలా హిట్ చేయగలరు? సినిమా బాలేదన్నప్పుడు ఏ హీరో అభిమాని కూడా దానిని హిట్ చేయలేడు... 'ఇకపోతే మనీ మ్యాటర్' అందరికి తెలుసు నితిన్ సంపన్న కుటుంబానికి చెందినవాడు అని... "టాలెంట్ ఉన్నోడు పాకిస్థాన్ లో ఉన్నాకూడా కోటీశ్వరుడు కాగలడు టాలెంట్ లేనోడు అమేరికా వైట్ హౌస్ లో ఉన్న కూడా ఏం పీకలేడు"... నితిన్ కు టాలెంట్ ఉంది కాబట్టే మంచిహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అందరు అతని సినిమాలకోసం వస్తున్నారు, డబ్బులుంటే సినిమా తీయొచ్చేమో కాని ప్రేక్షకులును థియేటర్ కు రప్పించలేము,పోని టికెట్ లేకుండా ఫ్రీగా అన్నా కాదు కాదాఎదురు డబ్బులిచ్చి చూడమన్న ఎవ్వరుచూడరు,హిట్ చేయలేరు... నితిన్ కు ఉన్న కష్టపడేతత్వమే అతనికున్న అతి పెద్ద ఆస్థి.

ఒక మంచి సినిమాకు జీవితాన్ని మార్చె శక్తి ఉంది అలా నితిన్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా "తొలిప్రేమ"... ఆ సినిమాతో సినిమాలు అంటే అతని లైఫ్ లో ఒక భాగమైపోయిందని చెప్పడం కంటే నితిన్ శరీరంలోనే ఒక భాగమైందని చెప్పొచ్చు... ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కన్నా నాకు యాక్టింగ్ అంటేనే ప్రాణమని డైరెక్టర్ తేజ డైరక్షన్ లో జయంతో తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నాడు....

రాజమౌళి, వినాయక్, కృష్ణవంశీ, త్రివిక్రమ్, రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకులతో మాత్రమే కాదు విక్రమ్, విజయ్ కుమార్ లాంటి కొత్తదర్శకులకు కూడా అవకాశం ఇచ్చాడు... ఒకానొక దశలో 2004లో రిలీజ్ అయినా "సై" చిత్రంతో విజయాన్ని దక్కించుకున్న నితిన్ ఆ తరువాత దాదాపు 8 సంవత్సరాలలో చేసిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా అతనికున్న సినిమా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఇష్క్ తో మళ్ళి ఘనవిజయాన్ని అందుకున్నాడు... ఇప్పుడుకున్న చాలమంది ఫ్లాప్ లను ఎదుర్కుంటున్న కొత్త హీరోలకు నితిన్ ఒక Inspiration గా మారాడు... స్వామి వివేకనందా చెప్పినట్టు ఒడిపోవడం అంటే పరీక్షలలో ఓడిపోవడం కాదు ఇక నా వల్ల కాదు నేను ఇక ఎప్పటికి పరీక్షలను రాయలేను అని నిర్ణయించుకున్నప్పుడే నిజమైన ఒటమి అని... ఆ రకంగా చూసుకుంటే నితిన్ ఎప్పుడు ఓడిపోలేదు ... అభిమాన హీరోను Inspiration గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఎంతో మందికి Inspiration ఇచ్చేంత ఎత్తుకు ఎదిగిన నితిన్ కు జన్మదిన శుభాకాంక్షలు!