Contributed By Hari Atthaluri
రాత్రి వచ్చి పోయే కల వి కాదు నువ్వు... ప్రతి రోజు వచ్చే ఆ నిశి వే చెలియా నువ్వు... ఒక్కోసారి మంచి నిద్ర ఇస్తావ్... ఇంకోసారి ఆ నిద్రే లేకుండా చేస్తావ్...
ఒక రోజు నిండు పున్నమి ని.. ఇంకో రోజు కటిక చీకటి ని పరిచయం చేస్తావ్... నీలో నన్ను నేనే వెతుకున్నేలా చేస్తావ్... కాని నువ్వు మాత్రం నవ్వుతూ నా చుట్టూ ఉంటావ్...
చందమామ అంత చల్ల గా ఉంటావ్... దగ్గరకు వస్తే నక్షత్రం అంత దూరం గా వెళ్ళిపోతావ్... నిన్ను ఇష్ట పడని వాళ్ళని భయపెడతావ్... కానీ నిన్ను ఇష్టపడిన నన్ను బాధ పెడతా వ్...
నిన్ను ఆస్వాదించే లోపు నన్ను నిద్ర పుచ్చుతావ్... నువ్వే వెళ్ళేటప్పుడు నిద్ర లేపుతావ్.. నిన్ను చూద్దాం అనుకున్నా సరిగా కనిపించవ్.. చూడకూడదు అనుకున్నా మళ్లీ వస్తావ్..
ఇలాంటి రాత్రి లా ఉండే రాయి వే నువ్వు.... కానీ నన్ను వదిలి వెళ్లి పోకు.. నీ ఉనికి.. ఉన్నంత సేపు... నన్ను ఉత్సాహం గా ఉంచుతుంది.... ఉప్పెన లా ముంచుతుంది.....
నువ్వు నా సొంతం కాకపోయినా, ఆసాంతం ఇలా పక్కనే ఉండు..