(article contributed by Vikram Bollam)
ఏం సాధించలేవ్ నువ్వు? ఏం ఆవిష్కరించలేవ్ నువ్వు? ఏం సృష్టించలేవ్ నువ్వు?
చందమామ రావే రావే అని పిలిచీ పిలిచీ అలసిపోయి, ఎంత పిలిచినా అతను రావట్లేదని, నీ అంతట నువ్వే కదా అతని దగ్గరకి వెళ్లి పలకరించి వచ్చావ్.
సూర్యుడు అని ఒకరికి నామకరణం చేసి, అతని దగ్గరకి వెళ్తే కాల్చేస్తాడని గుర్తించి, భయపడకుండా అతని సామర్ధ్యాన్ని కొలిచింది నువ్వే కదా.
అసాధ్యం అనుకున్న ఇతర గ్రహ ప్రయాణం కూడా ఇల్లరికం వెళ్ళినంత సుసాధ్యం చేసిన ఘనత నీకే దక్కింది కదా. మరి ఎందుకు ఇలా అయిపోతున్నావ్?
నువ్వు సాధించిన గెలుపులు అన్నీ మర్చిపోయావా? కష్టం అనుకోవాల్సిన పనులని అసాధ్యం అని ఎందుకు అనుకుంటున్నావ్?
ఒక్కసారి నీకు నువ్వు వేసుకున్న కంచె దాటి బయటకిరా.
పెనుతుఫానుకు సైతం వంగని చెట్లు ఉన్నాయ్, సింహం పంజాకి సైతం చితకని కుంబస్థలాలు ఉన్నాయ్, నిశీదిని సైతం నియంత్రించే కీటకాలు ఉన్నాయ్.
క్రుంగిపోవాల్సిన సమయం పోయింది, కృషించి సాధించే సమయం ఇది. మారిపో! నీకే చెప్తున్నా, సమయం వచ్చింది ఇప్పటికైనా నీ పరిధిలో ఉన్నది ఏదైనా సాధించొచ్చు అని గుర్తించి, మారిపో!