జన గణ మన అధినాయక జయహే భారతభాగ్య విధాతా..
ప్రతి ఒక్క భారతీయుడికి మన జాతీయగీతం వినగానే చేయి దానంతట అదే సెల్యూట్ చేయడానికి సిద్ధ పడుతుంది.. రక్తం మరిగి రోమాలు నిక్కబొడుచుకొని దేశభక్తి తో మనకు స్పూర్తి నింపుతుంది.. అలాంటి గొప్ప గీతాన్ని రచించిన వ్యక్తి మన రవీంద్రనాథ్ ఠాగుర్.. నిజానికి మొదట దీనికి పదాలను మాత్రమే రాశారు కాని దాని బాణి (ట్యూన్) మన తెలుగువారే ఇచ్చారు..
దక్షిణ భారత పర్యటనకు విచ్చేసిన ఠాగుర్ బాగా అలసిపోయిరు అప్పుడు విశ్రాంతి కోసం థియోసాఫికల్ కాలేజి హాస్టల్‌లో బస చేశారు.. ఈ సమయంలో ‘జనగణమన’ గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ పేరిట అనువదించి ఆ కళాశాలకు బహూకరించాడు. ‘డాక్టర్ బె.హెచ్.కజిన్స్ భార్య ‘మార్గరెట్ కజిన్స్‘ మన జనగణమన గీతానికి స్వరకల్పన చేయగా, కళాశాల బృందం గానం చేశారు.. దానికి ఠాగూర్ ఆనందించి మార్గరెట్ కజిన్స్ ను అభినందించి ఆ Tune ఎంతో బాగా ఉందని ప్రశంచించారు. తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో పాడినా కుడా తర్వాత ‘మార్గరెట్' స్వరంలో ఆలపించబడిన ఆ బాణీలోనే నేటికీ ఆలపించబడుతున్నది. ఇది తెలుగువారికి అత్యంత గర్వకారణం. 1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో నాటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ గారు ‘జనగణమన’ను జాతీయగీతంగా అధికార ప్రకటన చేసి, ‘వందేమాతరం’ గీతానికి సమాన ప్రతిపత్తినిచ్చారు.
ఇక ఠాగుర్ జీవితం గురుంచి పరిశీలిస్తే
1861 మే 7న రవీంద్రుడు పశ్ఛిమ బెంగాల్ లోని కలకత్తా మహానగరంలో జన్మించారు.. తన చిన్ననాడే కన్నతల్లిని కోల్పోయారు.. తండ్రి వ్యాపారాల నిమిత్తం ప్రయణాలు చేయడం వల్ల సోదరి, సోదరులు, పనిమనుషులే తనకు తల్లిదండ్రులుగా అన్ని వారే అయి పోషించారు.. చిన్ననాటి నుండే ఠాగూర్ చాల క్రమ శిక్షణతో పద్దతిగా మెలిగేవారు.. ఉలి దెబ్బలను ఓర్చుకుంటేనే అందరూ మెచ్ఛే శిల్పంలా మారుతారు అన్నట్టూ.. తన సోదరడు కొన్ని కఠినమైన Physical Activities అయినా స్విమ్మింగ్, జూడో, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి నేర్పించేవారు.. అంతేకాకుండా ఇంగ్లీష్, మాథ్స్, హిస్టరీ, జియోగ్రఫి, సంస్కృతం లాంటి సబ్జెక్ట్ లలో కూడా ప్రావీణ్యం సాధించారు. తన 8 వ యేట నుండే రచనలు మొదలు పెట్టినా 16 నుండి పూర్తిస్థాయిలో తన రచనలు కొనసాగించారు. భారతీయ సాంప్రదాయాల మూలం నుండి ఇప్పటి ఆధునిక కాలం నాటి పరిస్తుతులపై కూడా తనదైన శైలీలో రచనలు ఉంటాయి.. అతని రచనలకు దేశంలోనే కాదు ప్రపంచంమంతా అభిమానులున్నారు. ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ రవీంద్రుని పుస్తకాలు చదివి పర్సనల్ గా కలవాలని ఎవ్వరికి గుర్తుపడకుండా, ఎవ్వరికి చెప్పకుండా మారువేషంలో భారత్ కు వచ్చారు తీరా ఇక్కడికి వచ్చాక రవీంద్రుడు స్వర్గస్థులయ్యారు అని తెలుసుకొని భాదపడి వెళ్ళిపోయారు.
గాంధీ పేరు ముందు "మహాత్మ" అని ఉపయోగిస్తేనే జాతిపిత మహాత్మ గాంధీ అని గుర్తిస్తాం.. గాంధీకి మహాత్మ(Great Soul) అని బిరుదు ఇచ్చింది రవీంద్రుడే. ఠాగుర్ రచనలో గీతాంజలి, ఘోరా, రవీంద్ర సంగీత్, అమర్ షోనర్ బంగ్లా ప్రసిద్ధి చెందినవి.. మన దేశానికి మాత్రమే కాదు బంగ్లాదేశ్ దేశానికి కూడా జాతీయగీతాన్ని అందించారు. సుధీర్ఘ కాలంగా రచించిన అత్యుత్తమ రచనలకు గాను సాహిత్యంలో "నోబెల్" అవార్ఢునిచ్చి గౌరవించారు. నోబెల్ అవార్ఢు వచ్చిన వారిలో ఠాగూర్ మెదటి భారతీయుడు.