All You Need To Know About The Famous "Nannari Sharbath" From Rayalseema!

Updated on
All You Need To Know About The Famous "Nannari Sharbath" From Rayalseema!

రాయలసీమ వంటల గురించి ప్రస్తావించుకుంటే టక్కున రాగి సంగటి, లేదంటే నాన్ వెజ్ వంటలు గుర్తుకువస్తాయి.. ఇవన్నీ అక్కడ ఎంత ఇష్టంగా తీసుకుంటారో 'నన్నారి షరబత్' కూడా అంతే ఫేమస్, అంతే ఇష్టంగా తీసుకుంటారు. ఇది ఒక ఊరికో, జిల్లాకో పరిమితం కాదు రాయలసీమ ప్రాంతంలోని ప్రజలందరూ దీనిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుండి దీనిని తయారుచేస్తున్నారు. ఈ నన్నారి షరబత్ మొదట కడప జిల్లాలో ప్రారంభమయ్యింది రుచి అద్భుతంగా ఉండండంతో మిగిలిన జిల్లాలకు కూడా చేరిపోయాయి.

హెల్త్ బెనిఫిట్స్:

రాయలసీమ లో వేసవి కాలం వచ్చిందంటే కూల్ డ్రింక్ కన్నా, కొబ్బరిబొండం కన్నా ఎక్కువగా నన్నారి ఈ నన్నారి షరబత్ ను తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు. రాయలసీమ ప్రాంతాలలో సుగంధిపాల చెట్టు ఎక్కువగా దొరుకుతాయి. ఈ చెట్లలో శరీరంలో వేడిని తగ్గించే ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఈ చెట్టు వేర్లని తీసుకుని ఎండలో ఎండబెట్టి తర్వాత నీటిలో మరిగించి, పంచదార కాని బెల్లాన్ని కలిపి ఈ షరబత్ ను తయారుచేస్తారు.

దీని వల్ల ఎనర్జీ పెరుగుతుందని, పరోక్షంగా బీపీ, దురద వంటి మొదలైన వాటి నుండి ఇబ్బందులు తగ్గుతాయని అక్కడి ఆయుర్వేద డాక్టర్లు చెబుతుంటారు. మిగిలిన టైంలో కన్నా ఎండకాలంలో ఈ షరబత్ ను ఎక్కువ తయారుచేస్తారు. ఇళ్ళల్లో మాత్రమే కాదు చిన్న చిన్న షాప్ లలో కూడా ఎక్కువగా అమ్ముతారు. లీటర్ బాటిల్ రూ.150 నుండి 200వరకు అమ్ముతారు.