10 Vintage Classics From Vijaya Productions That Are Pure Gold To Revisit

Updated on
10 Vintage Classics From Vijaya Productions That Are Pure Gold To Revisit

మంచి సినిమా తీయాలి అని కలలు కనే ప్రతి ఒక్క నిర్మాత కి మార్గదర్శకులు బి.నాగిరెడ్డి, చక్రపాణి ద్వయం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెదిరిపోని చెరిగిపోని మరుపురాని చిత్రాలను మనకందించారు. పేరుకి పాత సినిమాలు అయినా ఈ తరం వాళ్ళని కూడా అలరిస్తాయి అవి. వారిద్దరూ కలిసి స్థాపించిన విజయ ప్రొడక్షన్స్ మనకందించిన కొన్ని చిత్రరాజాలను గుర్తుచేసుకుంటూ.. వాళ్ళని గుర్తుచేసుకుందాం.

1. షావుకారు సోలో హీరో గా ఎన్.టి.ఆర్ గారి మొదటి చిత్రం.

2. పాతాళ భైరవి సాహసం చేయరా డింభకా...

3. పెళ్లి చేసి చూడు కట్నం అనే దురాచారం పై చక్కటి వ్యంగాస్త్రం.

4. మిస్సమ్మ "అమ్మాయి తీసుకునే నిర్ణయాల పై సినిమా కథ నడుస్తున్నప్పుడు, అంతకంటే మించిన టైటిల్ ఉంటుందా అండి. ఒక సినిమా కు ఒక అమ్మాయి పేరు పెట్టటం కంటే శుభప్రదం ఉందంటారా?.." (మన Tollywood Heroines Through Ages వీడియో లో ని డైలాగ్)

5. మాయాబజార్ తెలుగు సినిమా అంటే ఇది అని గర్వాంగా చెప్పుకునే సినిమాలలో మొదటి వరుసలో ఉండే సినిమా..

6. అప్పు చేసి పప్పు కూడు సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం నేర్పేది, అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేది. అలాంటి సినిమాలు తీశారు కనుకే విజయ ప్రొడక్షన్స్ గురించి ఇప్పటికి చెప్పుకుంటున్నాం.

7. గుండమ్మ కథ ఈ సినిమా గురించి నేను కొత్తగా చెప్పేది ఏముండదు. కానీ చుసిన ప్రతిసారి ఒక కొత్త సినిమా చూసిన అనుభూతే వస్తుంది.. అదేమిటో.. (సూర్యకాంతం గారిలా ఎడమ చేతిని గడ్డం మీద పెట్టుకుని చెప్తున్నా..)

8. చంద్రహారం జానపద చిత్రాల కి ఒక మంచి reference లాంటి సినిమా.

9. గంగ మంగ కథానాయిక కి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఎన్నో సినిమాలు తీశారు విజయ ప్రొడక్షన్స్. ఈ సినిమాలో అయితే సాహసాలు కూడా చేయించారు..

10. Julie (Hindi) ఈ సినిమా గురించి మీ తాతయ్య గారిని అడిగితే ఇంకా బాగా అప్పటి ఆ గుర్తులని నెమరు వేసుకుంటూ చెప్తారు...

Quality, Quantity ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేశారు కాబట్టే ఇప్పటికి వాటి గురించి చెప్పుకుంటున్నాం. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాలని తీశారు కాబట్టే ఇప్పటికిప్పుడు "ఈ సినిమా లో ఈ సీన్ చూద్దాం బాగుంటుంది" అనే ఆలోచన వచ్చేసుంటుంది మన లో చాలామందికి. విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు. ఎన్నో మంచి సినిమాలు అందించిన ఆయనకీ ఈ సందర్బంగా "హే హే నాయక ఓయ్ ఓయ్ నాయక"(మాయాబజార్ style lo).