These Musings Perfectly Explain How A Girl Will Be Treated In Different Stages Of Life

Updated on
These Musings Perfectly Explain How A Girl Will Be Treated In Different Stages Of Life

Contributed by Srinithya Dondula

నిత్య ఇదే తన పేరు.. తన అమ్మనాన్నలు ఇష్టంగా పెట్టుకున్న పేరు స్కూల్లో కాలేజీలో ఎక్కడ చూసినా అందరి నోర్లలో వినిపించే పేరు... ఇంత బహు బ్రహ్మాండమైన పేరు వెనకాల ఒక మనిషి దాగి ఉంది, ఆ మనిషి జీవితం దాగి ఉంది ,ఆ జీవిత రహస్యం ఎవరికీ అంతుపట్టని తెలియని విషయమై మిగిలి ఉంది, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? అంతే కదా మరి ఈ కాలంలో పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ కంటికి కనపడని ప్రపంచంతో కంటికి కనిపించే మనుషులను వదిలేసి బతుకుతున్నారు.... కానీ నిత్య కథ చిత్రమైనది..

తెలుసుకోవాలనే తపన పడి అలసి సొలసి మధనపడి అంతుచిక్కని తన ప్రపంచాన్ని అంతులేని నా ఆరాటానికి దారి చూపిన ఆ కాలానికి జోహార్...

నిత్య స్కూల్లో టాపర్ కాలేజీలో టాపర్ మంచి డాక్టర్ అంతులేని ప్రేమ నిచ్చే అమ్మ తల్లిదండ్రుల చిన్నారి పొన్నారి చిట్టెమ్మ అనుకోని సంఘటనలు అలుపెరగని పోరాటాలు దినదిన గండాలు శిధిలమైన మనసులు మొక్కిన మొక్కులు తీరని కోరికలు దూరంగా ఉన్న గమ్యం ఎప్పటికైనా చేర్చునో లేదో ఈ సమయం...

ఇలా గడిచిపోయిన తన జీవితం .. ఇప్పుడు వినాలని మనకున్న చెప్పడానికి తను లేదు చనిపోయింది మనిషిగా చనిపోయి మరబొమ్మలా మిగిలిపోయింది... తెలియని బాధ తెలుసుకున్న క్షణాన తీర్చడానికి మనుషులు చూసుకునే వ్యక్తులు కరువైపోయెను ఈ సమాజంలో... ఎందుకు ఏమిటి అంటారా సరే వినండి చెప్తాను....

బుడిబుడి అడుగుల చిన్నారి పట్టు తప్పింది కింద పడింది చుట్టూ ఎవరూ పట్టించుకోలే ఆ చిన్నారి మనసు చిన్నబోయే.. అడుగులో అడుగేసుకుంటూ స్కూల్ కి వెళ్ళింది లేట్ అయినందుకు టీచర్ కసిరింది పాపం చిన్నారి నిత్య బాధ చెప్పలేక లోపలికి వెళ్ళలేక ఏడుస్తూ నిలుచుంది తోటి స్నేహితులు దాన్ని చూసి నవ్వుతున్నారు ,వెక్కివెక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్లింది అమ్మ బాధని చూడలేదు అసలు పట్టించుకోలేదు.. గుండె భారం అయింది అలసిసొలసి పోయింది నిద్రలోకి జారుకుంది.. చిన్నారి తల్లి గుండె చినబోయేంతల జరిగిన పరిస్థితులను నిలదీయాలా? మనుషులైన ఇంకో మనిషిని పట్టించుకోని ఆ మనసులను నిలదీయాల? చివరికి బాధ చిన్నారి నిత్యదే..

అమ్మాయివే ఏంటి అలా ఉంటావు? సరిగ్గా నడుచుకో అని అమ్మ... బయట ఎవరితోనే అంత చనువుగా మాట్లాడుతున్నావ్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్లు విరగ కొడతా అని నాన్న... ఇంతకీ తను చేసింది ఏంటా అనేగా?... తన వయసున్న అబ్బాయితో చదువు విషయాల గురించి మాట్లాడింది.... అది నాన్న !!అని చెప్పే లోపే నోరు మూసుకుని కూర్చో ఏం మాట్లాడకు అని నాన్న గదమాయించాడు... మనిషికి మనసుందని దాంట్లో బాధ ఉందని గట్టిగా అరవాలని అందరికీ చెప్పాలని ఉన్న చెప్పలేని పరిస్థితి....

నన్ను నన్నుగా ప్రేమించే మనిషి దొరకడం స్నేహితులు చూసి ఆశ్చర్యపోవడం దానితో నామీద అసూయ పడడం చీటికిమాటికి వెటకారం చేయడం ఆడది అయినందుకు సమాజం ఆంక్షలు పెట్టడం పెద్దలు శిక్షించడం అన్నీ చకచకా జరిగిపోయాయి....

ప్రేమగా ప్రేమించిన ప్రేమ దూరం అయింది ఎన్నో ఆశల మధ్య అత్తారింట్లో అడుగుపెట్టింది... కొని తెచ్చుకునే దాన్నే కోడలు అంటారు అనే అత్త సిద్ధాంతాన్ని చూసి విస్తుబోయింది...

గడసరి అత్త సింగారాల సిరులు ముద్దుల కొడుకు ఎందుకు పనికిరాని ఒక కోడలు ( అది నిత్య) ఇది తను ఆడపిల్లగా "ఆడ" బతుకుతున్న జీవితం... ఇన్ని బాధలు ఒకే మనిషి ఇన్ని ఏళ్ళుగా బతుకుతు సమాజం లో చెరగని ముద్ర వేస్తూ తన సత్తా తాను చాటుతున్న సమయములో.... ఆడదానివి ఇంటిపట్టునే ఉండి మొగుడు పిల్లలని చూసుకోకుండా ఏంటి అని ప్రశ్నించింది? అయినా మొండి నిత్య మనసు భారమైంది గుండె అలవాటు పడింది బాధను మోయసాగింది అన్నింటికి సిద్ధపడింది... మనిషి మర బొమ్మ లా మారింది ముఖం లో వెలుగు అంతరించిపోయింది అంతరంగం లో దాగిన తన అంతర్గతాన్ని ఇవాళ వెలబుచ్చింది....

ఎందరు ఉన్న ఏకాకిని నేను... కొందరే ఉన్న చెప్పుకోను నేను... వినాలని ఉన్న వినలేని వాళ్ళు... గుండెల్లో గుచ్చేలా గుండె నే గుచుతున్న వాళ్ళు... నా గుండెలకి సంకెళ్లు వేసి బతుకుతున్నాను నేను... నాలో నేనే నాతో నేనే..... ఆది ఎవరో కాదు నేనే తన అంతరాత్మని.......