All the Interesting Incidents in the Life Time of MS Narayana Garu!

Updated on
All the Interesting Incidents in the Life Time of MS Narayana Garu!

ఎం.యస్. నారాయణ... ఈ పేరు తెలియని తెలుగుసినిమా అభిమాని ఎవ్వరు ఉండరు... అంతలా మన అభిమానాన్ని అందుకున్న ఎం.యస్ మన నుండి దూరమైనా.. ఇప్పటికి ఆయన నటించిన సినిమాల ద్వారా హాస్యాన్ని పంచుతున్నారు... ఈరోజు ఎం.యస్. నారాయణ జీవితం గురుంచి కొంత తెలుసుకొని స్మరిద్దాం...మైలవరపు సూర్య నారాయణ ఇది మన ఎం.యస్ పూర్తి పేరు.. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు గానే తెలుగు సినిమా రంగంలో అగ్ర కమేడియన్స్ లో ఒకడిగా ఉన్న ఎం.యస్. నారాయణ చిన్నతనం నుండే తనతో పాటు చదువుకునే తోటి స్నేహితులతో చనువుగా ఉంటూ అప్పటినుండే తనలోని హాస్య ఛలోక్తులతో తన చుట్టూ ఉన్న అందరిని నవ్వించేవారు....

బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు ప్రపంచ హాస్య గురువైన చార్లి చాప్లిన్ పుట్టిన రోజు నాడే ఏప్రిల్ 16 1951న పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో ఎం.యస్ జన్మించారు..

పిల్ల జమిందార్ లోని తెలుగు మాష్టారు లానే నిజజీవితంలో కూడా ఆయన MA తెలుగు పూర్తిచేసి తెలుగు లెక్చరర్ గా పిల్లలకు తెలుగు భోదించేవారు..

తన భార్య కళాప్రపూర్ణను ప్రేమించి తన జీవిత భాగస్వామిని చేసుకున్నారు..

తెలుగుసినిమా మీద మక్కువతో మద్రాసు కొచ్చి.. సినిమా కష్టాలు అనుభవించాకా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన "పెదరాయుడు" తో మొదటి అవకాశాన్ని అందుకున్నారు..

8 సినిమాలకు రచయితగా తన కలానికున్న కన్ను శక్తిని చూపించారు... రచయితగా కన్నా నటన పరంగానే ఎక్కువ అవకాశాలు రావటం, తన సన్నిహితుల ప్రోత్సాహంతో పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడ్డారు..

మా నాన్నకు పెళ్ళి, రామ సక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు.. ఈ ఐదు చిత్రాలకు గాను రాష్ట్రప్రభుత్వం నుండి నంది పురస్కరాన్ని అందుకున్నారు... తన వారసుడిని(విక్రం) హీరోగా నిలబెట్టడం కోసం తనలోని దర్శకత్వ పటిమను కొడుకు, భజంత్రీలు సినిమాల ద్వారా చూపించారు..

బి.గోపాల్ దర్శకత్వంలో బాలక్రిష్ణ నటించిన లారి డ్రైవర్ సినిమాలోని రోల్ ఇప్పటికి తనకు చాల ఇష్టం..

1995(పెదరాయుడు) నుండి తన నట జీవితం నుండి బతికున్నంత వరుకు దాదాపు 800(విడుదల అయినవి,ఇంకా కావాల్సినవి) చిత్రాలలో నటించారు... బ్రహ్మానందం పేరు మీదున్న గిన్నీస్ రికార్ఢు 20 ఏళ్ళల్లో 700 చిత్రాల రికార్ఢును ఎం.యస్ దాటేశారు.. కేవలం 17 సంవత్సరాలలోనే బ్రహ్మానందం పేరు మీదున్న రికార్ఢును ఎం.యస్ అందుకున్నారు... (తన స్నేహితులు ఈ మధ్యనే గిన్నీస్ బుక్ ఆథారిటీని సంప్రదించారు).

ఎన్నో రకాల క్యారెక్టర్లను చేసిన తనకు విలన్ రోల్ లో నటించడమే డ్రీమ్ రోల్ అని చాలా ఇంటర్వూలలో చెప్పారు... నిజానికి ఎం.యస్ ఇప్పుడు మనమధ్య ఉండేదుంటే తన నటనతో తనలోని విలన్ ని మనకు పరిచయం చేసి మెప్పించేవారు..

నవ్వులతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎం.యస్ ఏడిపించడం మొదలు పెడితే వారిలా ఎవ్వరూ అంతలా ఏడిపించలేరేమో... బుజ్జిగాడు, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రచ్చ, పిల్ల జమిందార్ లాంటి చాలా సినిమాలలో నవ్విస్తూనే మనల్ని ఏడిపించారు... ఇండ్రస్టీలో స్నేహానికి తక్కువ ప్రాధన్యత ఇస్తుంటారు చాలమంది నటులు... కాని మన నారాయణ మాత్రం చిన్నతనం నుండి ఇప్పటి మిత్రులకు అన్నిరకాల ఆర్ధిక సహాయాలను అందించేవారు...

"లో బడ్జెట్" సినిమాలకు కొన్ని సంధర్భాలలో ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసేవారు..చివరి రోజుల్లొ హస్పిటల్ బెడ్ మీదున్న కూడా తన ప్రాణ స్నేహితులను పిలించుకున్నారు... ఎప్పుడు నవ్వుతు నవ్వించే బ్రహ్మానందం వంటి వారు కుడా ఎం.యస్ పరిస్తితిని చుసి కన్నీటి పర్యంతం అయ్యారంటే ఎం.యస్ ఎంతటి మంచివారో స్నేహానికి ఎంతటి విలువ ఇచే వారో అర్దమవుతుంది.. ఎం.యస్ గారు మీరు మా నుండి భౌతికంగా దూరమైన మీరు అందించిన నవ్వులు ఎప్పటికి మాతోనే ఉంటాయి..

అర్ధాంగితో అభినందన..

1

తెలుగు లెక్చరర్ గా..

2

దూకుడు చిత్రానికి నంది అవార్ఢును అమితాబ్ మరియు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ల చేతుల మీదుగా అందుకుంటు..

3

స్వచ్ఛ భారత్ ..

4

మెదటి ఫోటోషూట్..

5

తన కేరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే రోల్ "ఉద్దండం.."

6

రచయితగా తొలి రోజుల్లో ..

7

తన జీవిత భాగస్వామి "కళా ప్రపూర్ణతో"..

8

తాళికట్టు శుభవేళ..

9

నారాయణ దంపతులతో Grand Daughters ..

10