Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part-2)

Updated on
Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part-2)
జరిగిన కథ: (Part - 1) కళ్ళు చాలా బరువుగా అనిపించాయి. తలంతా గిర్రున తిరుగుతోంది.మెల్లిగా కదలాలని చూశాను. ఏమవుతోందో ఒక నిమిషం అర్థమవ్వలేదు.శరీరం కిందిభాగానికి మెత్తగా తగలడాన్ని బట్టి పరుపు మీద పడుకున్నట్టు తెలుస్తోంది. మెడ కుడి వైపుకి తిప్పడానికి చూశాను. మళ్లీ ఎడమ వైపుకి తిప్పాను. నా శరీరాన్ని మొత్తం ఒకసారి చూసుకున్నాను.అక్కడక్కడ bandageలు నా చర్మాన్నికప్పేశాయి . ఎండిపోయిన చెట్టులాగా, జీవం లేని జంతువు లాగా నాకు నేను కనబడుతున్నాను. ఎడమ చేతికి పెద్ద కట్టు.కుడి చేత్తో తలని తడిమి చూసుకున్నాను. మెత్తగా, తల చుట్టూ కట్టు కట్టారు.మనసుకి అయిన గాయాల ముందు ఇవి ఎంత?అనిపించింది. నాకేం కాలేదు. చిన్న దెబ్బలే. మూర్చపోయుంటాను. నన్ను పడేసిన రూం ని ఒకసారి కళ్ళు చుట్టూ తిప్పుతూ చూడసాగాను. గోడల నిండా నీతి వాఖ్యాలు, గొప్పవాళ్ళ మాటలు. మాటలదేముంది, నేనైనా చెప్తాను ఒక లక్ష మాటలు. శరణ్య నేను స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే ఎంత బాగా వినేదో అనిపించింది.పాతవన్నీ అలా మదిలో మెదులుతున్నాయి . ఏంటో ఈ గతం, తలచుకుంటే బాధ, బూడిద తప్ప ఏమి లేదు.అయినా నేనిక్కడ ఏమి చేస్తున్నాను? రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది.ఆ వర్షం, కారు గుద్దటం, నేను రోడ్డుపై పడిపోవటం,ఒళ్ళు తెలికైపోవడం, అంతా ఒక మాయలాగా అనిపించింది. కంట్లో నుండి, ముక్కులో నుండి, నీరు కారుతున్నాయి.శరణ్య గోస్వామి, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి, పెదాలతో దూరం పెడుతూ, కళ్ళతో భావాలు పలికిస్తూ, స్వర్గపు టంచుల దాక తీసుకెళ్ళి,తాను స్వర్గానికి వెళ్ళిపోతూ, నన్నీ నరకంలోకి మళ్ళీ తోసేసింది. కాని నా ఊహల్లో మాత్రం ఎప్పుడు నవ్వుతూనే కనపడుతుంది. అలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న నాకు డోర్ తెరుచుకున్న శబ్దం వినపడింది. కళ్ళు తెరిచిచూశాను. తెల్ల గౌనులో ఉన్న Nurse చేతిలో pad పట్టుకుని లోపలికి వచ్చింది.“Hello sir, are you feeling better now?” అని అడిగింది.“ అసలు నేనెక్కడున్నాను?ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ?” అని ప్రశ్నించాను.“Don’t worry sir, డాక్టర్ గారొచ్చి మీకు explain చేస్తారు” అని సమాధానం ఇచ్చింది . నాకు అక్కడ ఉండాలి అనిపించలేదు.“చూడండి, నేను urgentగా వెళ్లిపోవాలి.నాకెక్కడా ఉండాలని లేదు.బిల్ ఎంతైందో చెప్పండి. కట్టేసి వెళతాను”అని లేవబోయాను.ఆ నర్స్ నన్ను ఆపింది.“ సర్, మీరలా వెళ్ళకూడదు. మీకు rest చాలా అవసరం. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి అని అన్నారు”అని చెప్పింది.నాకు మాట్లాడే ఓపిక కూడా లేకపోయింది. గాలి గట్టిగా పీల్చి, శక్తిని కూడదీసుకుని “చూడండి సిస్టర్,నేను వెళ్ళాలి. మీ డాక్టర్ గారు నాతో ఏమి మాట్లడనక్కర్లేదు. So let me go”అని కాళ్ళు బెడ్ మీద నుండి కిందికి దించాను. నర్స్ నా భుజం పట్టుకుని ఆపింది.“లేదు సర్, ప్లీజ్ డాక్టర్ గారికి తెలిస్తే నా మీద కోప్పడతారు. పోనీ మీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి. నేను రిసెప్షన్ నుండి కాల్ చేసి మీ గురించి inform చేస్తాను” అని అంది. నేను బాధగా నిట్టూర్చాను. నాకెవ్వరు లేరు, ప్లీజ్, చెప్తే అర్థం చేసుకోండి అని చెప్పాలి అనిపించింది.అది మనసులోనే అణుచుకుని “పేషెంట్ వెళ్లిపోయాడని మీ డాక్టర్ కి చెప్పండి. I have to go” అని లేవబోయాను.“సర్ ప్లీజ్, డాక్టర్ గారికి…” అని మళ్లీ మొదలుపెట్టడంతో నాకు ఇక సహనం నశించింది.” ఏంటి మీకు ఒక్కసారి చెబితే అర్థం అవ్వదా? ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి? అసలిది ఏ హాస్పిటల్?” అని ఆ పాడ్ కింది వైపు చూశాను. దాని మీద ఎర్రగా పెద్ద పెద్ద అక్షరాల్లో I.H.S అని రాసుంది. ఆ పేరు చూడగానే, మళ్లీ నాలో బాధ మొదలైంది.“సర్, ఇది I.H.S హాస్పిటల్, గచ్చిబౌలి.మీరు మీకు రెస్ట్ చాలా అవసరం. డాక్టర్ గారోస్తారు సర్, కాస్త wait చేయండి,”అని బ్రతిమాలింది. “శరణ్య చనిపోయిందిక్కడే, నేను ఇక్కడ ఉండలేను, అర్తంచేసుకోండి.. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి”అని భుజాన్ని గట్టిగా పట్టుకున్న ఆవిడను పక్కకు తోసి పైకి లేచాను.ఆవిడ పక్కకు పడిపోయింది. ముందుకు నడుద్దాము అని అడుగు వేసి కింద పడిపోయాను.“ఒంట్లో శక్తి లేదు, మనసులో బలంలేదు, నేను బ్రతికి లాభం లేదు”అని అనిపించింది. అలా నేలను చూస్తూ కూర్చుండిపోయాను. కళ్ళలో నుండి టపటపా నీరు మీద రాలుతున్నాయి.నా మనసులో బాధ కాస్త నా మీద నాకే జాలిగా మారిపోయింది.తలంతా పీక్కుపోతోంది .ఇంతలో డోర్ ఓపెన్ అయ్యింది. తెల్లని shoes వేసుకున్న కాళ్ళు లోపలికి వచ్చాయి. మోకాలి వరకు ఉన్న తెల్ల coat కనపడుతోంది. నేను తల పైకి ఎత్తే ప్రయత్నం చేయలేదు, ఏమైంది నర్స్? అని వచ్చినావిడ ఈమెను ప్రశ్నించింది.ఈవిడేనేమో ఆ డాక్టర్ అనుకున్నాను. నా భుజాన్ని పట్టుకుంది ఆవిడ. “డాక్టర్, ఈయన వెళిపోతానని గొడవ చేస్తున్నారు, ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు” అని నర్స్ నా మీద ఆవిడకి complaint చేసింది .“Mister, please try to understand, you cannot leave the hospital like this,you need to be under medical care for a while,” అని వారించింది.“ లేదు, నేనిక్కడ ఉండలేను. శరణ్య చనిపోయిన చోట నేను ఇంకొక్క క్షణం కూడా ఉండలేను.”అని కళ్ళ నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ ఆవిడ చేయి విదిలించుకునే ప్రయత్నం చేసాను.“లేదు,నువ్వుండాలి, You need rest” అని ఆవిడ గొంతు నాకు జాలిగా వినిపించింది. చెబితే అర్థంకాదా? నేను వెళ్తున్నాను అని కోపంగా అరిచి బలవంతంగా ముందుకు లేవబోయాను.“ నువ్వు ఇలా ఇక్కడి నుండి వెళ్ళిపోతే చనిపోయిన శరణ్య తిరిగి రాదు, నీకిప్పుడు rest అవసరం. Chris, నేను నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది." అని ఆ గద్గద స్వరంతో గట్టిగా మాట్లాడింది. అంతవరకు ఆవిడ మొహాన్ని చూడని నేను ఆ మాటలు విని ఒక్కసారిగా shock అయ్యాను.నా పేరు ఈవిడెకు ఎలా తెలుసు? శరణ్య గురించి నా గురించి ఈమెకు ఎవరు చెప్పారు? నా ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లబడి పోయింది. ఆవిడ మొహం వైపు నా తల ఎత్తి చూశాను. ఎర్రగా, కన్నీటి తో ఉన్న ఆ కళ్ళను చూసి ఒక్కసారి నా మనసంతా ఎలాంటి భావన లేకుండా అయిపోయింది. “Who are you? మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? శరణ్య మీకెలా తెలుసు?” అని అర్థంకాని ఆశ్చర్యంలో, ఎందుకో తెలియని భయంతో ప్రశ్నించాను.ఆవిడ కళ్ళు నాకు బాగా దగ్గరిగా, బాగా పరిచయం ఉన్న కళ్ళలాగా కనిపించాయి.“ఈ కళ్ళను ఇదివరకే చూశాను.. ఎవరు మీరు? శరణ్య మీకెలా తెలుసు” అని నిలదీశాను.ఆవిడ మౌనంగా నన్ను చూస్తూ నిలబడిపోయింది. ఏమి అర్థంకాక వెనకాలే ఉన్న నర్స్ వైపు చూశాను. ఆ నర్స్ కూడా ఏమి అర్థంకాలేదన్నట్టు మొహం పెట్టింది.“దయచేసి మీరు మౌనంగా ఉండకండి please. మీ మౌనం వల్ల నేను లోలోపలే కాలిపోయేలా ఉన్నాను. మీరెవరు?” అని నా భుజాన్ని పట్టుకున్న ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని ప్రాధేయపడ్డాను.“శరణ్య గోస్వామి నా కూతురు”అని ఆ డాక్టర్ జవాబిచ్చింది. గట్టిగా పట్టుకున్న ఆవిడ చేతిని నా వేళ్ళు వదిలేశాయి.