అమ్మ : "నాన్నా ఎనిమిది అయ్యింది ఎప్పుడు లేస్తావ్, ఎప్పుడు కాలేజీ కి వెళ్తావ్...... త్వరగా లే స్నానానికి వేన్నీళ్ళు పెట్టా , మళ్ళీ చల్లారిపోయాయి అంటే వేడిచెయ్యను చెప్తున్నా"
టింగ్ ....... టింగ్ ....... టింగ్ ....... ( ఫోన్ లో వాట్సాప్ మోగింది )
సమయం : పొద్దున్న 08 : 12 గం||
ఆనంద్ : "అబ్బా విసిగించకు అమ్మ..... ఈరోజు సెకండ్ సాటర్డే సెలవు....!" (ఎప్పుడు చూడు ఏదొక నస, ప్రశాంతంగా పడుకోనివ్వరు ఎప్పుడూ... )
టింగ్ ..... టింగ్ ....... టింగ్ ........ ( ఫోన్ లో వాట్సాప్ మోగింది )
(ఆనంద్ నెమ్మదిగా ఒక కన్ను తెరిచి, వాట్సాప్ లో ఉన్న మెసేజ్ లు చదువుతూ ఉంటాడు)
అమ్మ : "లేచావా ! పొద్దున్నే ఫోన్ ఎందుకు రా నీకు.... ఇందాక లేపితే లేవకుండా ఆ పనికిమాలిన ఫోన్ చుస్తే కానీ పొద్దు గడవదా నీకు ?"
ఆనంద్ : "అబ్బా ఏంటమ్మా నేను ఎప్పుడూ ఫోన్ తో ఉండను, నేను ఫోన్ తీసినప్పుడే నువ్వు చూస్తావ్ అంతే !"
అమ్మ : "అది సరే ఇందాక ఏవో టింగ్ టింగ్ అని సౌండు వచ్చింది ఏంటది ?"
ఆనంద్ : "అది ఎదో మెసేజ్ అమ్మా.... వాట్సాప్ అని అందులో అలా వస్తాయ్ లే ...... !"
అమ్మ : "వాట్సాప్ అంటే ఏంటి నాన్న ?"
ఆనంద్ : "ఎహె ఇప్పుడే చెప్పా కదా , మెసేజ్ లు పంపుకునేది అని ........ "
అమ్మ : "ఏంటి అదేంటో తెలియదు, తెలుసుకుందాం అంటే విసుక్కుంటావా ?"
ఆనంద్ : "అబ్బా అలా ఏం లేదు లే ..... ఒక్క నిముషం ఆగు చెప్తా నన్ను నస పెట్టకు ....... "
అమ్మ ( లోపల ): ( పోన్లే రా ...... ఇన్నాళ్లు ఇన్ని సాకిరీలు చేసినందుకు బాగానే విసుక్కున్నావ్ )
అమ్మ : "సరేలే , లేచి స్నానం చెయ్యి తొమ్మిది అవుతుంది..."
(ఆనంద్ తనలో తాను నవ్వుకుంటూ ....... వాట్సాప్ లో రిప్లైలు ఇస్తుంటాడు )
అమ్మ : "వినిపించిందా ?"
ఆనంద్ : "అబ్బబ్బా వినిపించింది లే, నువ్వెళ్లు .... "
(ఆనంద్ టిఫిన్ తింటూ మళ్ళీ ఫోన్లో చూసి నవ్వుతుంటాడు )
అమ్మ : "తిండి దగ్గర కూడా అదే పని ఏంట్రా నీకు ? ప్రశాంతం గా తినవా నువ్వు ? ఫోన్ కొనివ్వడం మాదే తప్పు, 24 గంటలూ అదే ధ్యాసేనా ?"
( ఆనంద్ పట్టించుకోకుండా మళ్ళీ తన ఫోన్ ప్రపంచం లో తాను ఉంటాడు )
అమ్మ : "సరే ఎక్కడికి వెళ్తున్నావ్ తయారయ్యి ? సెలవు అన్నావ్ కదా ... "
ఆనంద్ : "అదేదో చిన్న పనిలే ..... ...... సరే తొమ్మిదిన్నర అయ్యింది , నాకు లేట్ అవుతుంది."
అమ్మ : "అరేయ్ నిమ్మకాయ నీళ్లు ఏనా తాగి వెళ్లరా ! అసలే ఎండగా ఉంది బయటా ."
( మళ్ళీ ఆ ఫోన్ నే చూసుకుంటూ ఆనంద్ నడుచుకుంటూ వెళ్తాడు బయటికి ... )
సమయం : ఉదయం 10 : 00 గం ||
( ఇంట్లో ల్యాండ్ ఫోన్ .. . . . . . . . ట్రింగ్ ట్రింగ్గ్ ట్రింగ్ టింగ్గ్ ....... )
అమ్మ : "హలో ఎవరండీ ?"
ఫోన్లో : "హలో మేడం మేము అపోలో హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము ...... "
అమ్మ : "హా అపోలో ఆ ?! హా చెప్పండి ..... "
ఫోన్లో : "మేడం మీ అబ్బాయి కి యాక్సిడెంట్ అయ్యింది మేడం ఇంద్రావతి జంక్షన్ లో .... దగ్గర్లోనివాళ్ళు హాస్పిటల్ లో చేర్చారు , ట్రీట్మెంట్ జరుగుతుంది , మీరు త్వరగా రండి ..... తన ఫోన్ లో కాంటాక్ట్స్ చూసి మీకే కాల్ చెయ్యాల్సొచ్చింది."
అమ్మ : ( బాధతో ) "అయ్యో భగవంతుడా ........ అయ్యో ...... వెళ్ళీ వెళ్లడం విసుక్కుంటూ వెళ్ళాడు , నేను మాట్లాడకుండా ఉండాల్సింది .... "
ఫోన్లో : "మేడం ......"
అమ్మ : "ఇప్పుడే వస్తా అమ్మ .... "
( అమ్మ హాస్పిటల్ లో తన కొడుక్కి ఆపరేషన్ జరుగుతున్న ఆపరేషన్ థియేటర్ దగ్గరకి చేరుకుంటుంది .... )
అమ్మ : (బాధపడుతూ ... ) "దేవుడా .... వీడికే ఎందుకు ఇలా జరగాలి .... నేనేం పాపం చేసాను ..."
డాక్టర్ : "మీ అబ్బాయి పేరూ ..... !!!"
అమ్మ : ( బాధపడుతూ ) "ఆనంద్ అండీ ..... మా వాడికి ఏం కాలేదు కదా అండీ ...చెప్పండి డాక్టర్ గారు, అసలే వాడికి నేను తప్ప ఎవరూ లేరు .... "
డాక్టర్ : "మీ వాడిని సమయానికి అక్కడున్న స్థానికులు తీసుకొచ్చారు, టిప్పర్ లారీ వచ్చి ఢీకొట్టడం తో మీ అబ్బాయికి వెన్నెముక విరిగింది..... సర్జరీ చెయ్యాలి అమ్మ, కాష్ వివరాలు అవి మా నర్స్ మీతో మాట్లాడతారు."
అమ్మ : "వాడు జాగ్రత్త గానే ఉంటాడు డాక్టర్..... అలా జరిగి ఉండదు డాక్టర్ .... "
డాక్టర్ : "మీ వాడి ఫోన్ చూస్తే మాకు అర్ధమయ్యింది ఏంటి అంటే, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫోన్లోనే నిమగ్నమయి ఉన్నాడు. అసలే జంక్షన్ అది..... "
అమ్మ : ( బాధపడుతూ ) "అయ్యో దేవుడా , ఇంట్లో కూడా ఉదయాన్నే చెప్పాను, దిక్కుమాలిన ఫోన్ ని పక్కన పడెయ్యరా అని .... వింటే గా . ఏం పని ఉంటది డాక్టర్ వీళ్ళకి ఫోన్లో అసలు ..... "
డాక్టర్ : "మీరు బాధపడకండి అమ్మ ...... మేము మా వంతు కృషి చేస్తాం .... ఈరోజుల్లో పిల్లలు అలాగే ఉన్నారు."
(టింగ్ ...... టింగ్ ....... టింగ్ ....... వాట్సాప్ మెసేజ్ వచ్చింది )
అమ్మ : "ఉదయం కూడా ఇలాగే సౌండ్ వచ్చింది డాక్టర్ ..... ఏమిటో ఒకసారి చూడండి."
డాక్టర్ : ( వాట్సాప్ మెసేజ్ లు చూడబోయి స్టేటస్ చుసిన డాక్టర్ కి ........ )"If you love your mom and want to show her that she means the world to you, put a picture of her as your profile photo. Then copy and paste this to your status."