Contributed By Hari Atthaluri
మెట్రో లో ఓ ఉదయం..... జనాలు పరిగెత్తే సమయం.. ట్రైన్ వచ్చేసింది... as usual తోసుకుంటూ.. తొక్కుకుంటూ ఏక్కేసాం... ట్రైన్ పరిగెడుతుంది..ఆగుతూ ఉంది... కాని ఇందులో ఒక్కొకరి ఆలోచనలు ఈ ట్రైన్ కన్నా ముందే పరిగెడుతునట్టు ఉన్నాయి...
కాని ఆగటం లేదు... చూడటానికి ప్రతి ఒక్కరూ రిలాక్స్ గానే ఉన్నా..వెళ్లే నిమిషాలు , నిమిషం కి నాలుగు సార్లు టైం వైపు చూస్తూ... ఎంత లేట్ అవుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు ఏమో, ఒక్కరి మొహం లో నవ్వు లేదు...పక్కన వాడితో మాట కలిపే తీరిక లేదు.... అందరూ almost tension feel అవుతున్నారా లేదా worry feel అవుతున్నారా అన్నట్టు ఉన్నారు...
పొద్దున్నే పాటలు వినకపోతే పాపం అన్నట్టు... అదేదో ఆసనం అన్నట్టు...అవసరం ఉన్నా లేకపోయినా.. ఇయర్ ఫోన్స్ ని మెడ లో వేసుకుని.. దేవుడి లా ఈ ప్రపంచం నుంచి disappear ఐపోతున్నారు... దీర్ఘం గా ఆలోచిస్తున్నారు...
Body present mind absent ఇదేనేమో... పోనిలే అని పలకరింపు గా ఓ నవ్వు నవ్వితే, ఎక్కడ డేటా హాట్ స్పాట్ అడుగుతా ఏమో అన్నట్టు అనుమానం గా ఓ లుక్ ఇస్తున్నారు... సర్లే ఈ గోల మన కెందుకు లే అని ఎదురు గా ఉన్న అద్దం లో నుంచి అప్పుడే అలా నిద్ర మత్తు లో నుంచి లేస్తున్న సిటీ ని చూస్తూ ఉంటే.. కొంచెం సేపటికి.. ఎదో సడన్ గా బల్బ్ వెలిగినట్టు అనిపించింది...
"పొద్దున్న అంత గజి బిజీ గా ఉన్న సిటీ కూడా రాత్రి కి కొంచెం రిలాక్స్ అవుతుంది...
మళ్లీ ఇంకో రోజు కోసం వెయిట్ చేస్తోంది... కింద నుంచి వెళ్తే ఎప్పుడూ congested గానే కనిపిస్తుంది...విసుగు పుట్టిస్తుంది...ఆ ట్రాఫిక్ కి ఛీ ఏం సిటీ రా బాబు అనిపిస్తుంది... కానీ ఇలా ఎత్తు లో నుంచి వెళ్తూ చూస్తే.. ఎంత విశాలం గా ఉంది..ఇంత పెద్దదా ఈ సిటీ అనిపిస్తుంది....
ఇంత మందిని తన లో దాచుకున్న ఈ సిటీ ఎన్ని బాధలు చూసి ఉంటుంది ?? ఎంత మందిని ఓదార్చి ఉంటుంది... పట్టా ఉన్నోడు భవిష్యత్తు కోసం... పట్టా లేనొడు పొట్ట కూటి కోసం ఈ city ని వెతుక్కుంటూ వచ్చారు...
అందరినీ అక్కున చేర్చుకుని కాస్తో కూస్తో settle చేసింది... చేస్తుంది..." ఇక్కడ బాధ పడకుండా బాగుపడిన వాడు ఎవడూ ఉండడు.. ఇలా అందరూ పడిన.. పడుతున్న.. భాధలు తో compare చేస్తే మన బాధల సైజ్ ఎంత ??? ఇక్కడ అందరూ పోరాడుతున్నారు... బతుకుతున్నారు... అందులోనే ఆనందం వెతుక్కుంటున్నారు....
మనం మాత్రం ఏవేవో ఆలోచించి...ఎన్ని బాధలో అని ఏడుస్తూనే ఉంటున్నాం, ఛీ ఈ జీవితం అనుకుంటున్నాం... ఇరుకు రోడ్డు లో నుంచి చూసే city కి... ఇలా ఎత్తు లో నుంచి చూసే city కి చాలా తేడా ఉంది... So, ముందు మన Way మారితే , problem ని చూసే మన view కూడా మారుతుంది... Thinking మారి Solution దొరుకుతుంది...
ఇలా అనుకోగానే నేనేదో కనిపెట్టినట్టు నాకు నేనే నవ్వుకున్నా... ఇంతలో నా పక్కనొడు నా వైపు ఓ రకం గా చూస్తున్నాడు... అపుడు అర్దం ఐయ్యింది... ఇయర్ బడ్స్ కూడా లేకుండా ఈ మెట్రో లో నేను నవ్వితే.... నాకు ఖచ్చితంగా ఏదో మెంటల్ ప్రాబ్లం అని ఫిక్స్ ఐనట్టు ఉన్నాడు... ఆ ఆలోచన రాగానే ఇంకా ఎక్కువ నవ్వా.. అలా చూస్తూ ఉన్న తనకే.. అలాగే నవ్వుతూ ఓ బై చెప్పి... నా స్టేషన్ లో నేను దిగిపోయా...