ఆయనే "సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా" అని అన్నారు.. ఆయనే "పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా? నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా" అని అన్నారు.. ఆయనే "ఈ పుణ్యభూమిలో పుట్టడం మనతప్పా అవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా" అని అన్నారు. ఆయనే "లే.. లే.. నా రాజా" అని అన్నారు. ఇక ప్రేమ విరహ, విషాద గీతాలకైతే లెక్కే లేదు. మొన్నటి బ్లాక్ అండ్ వైట్ నుండి నిన్నటి 1980 వరకు ఆత్రేయ గారు సాగించిన పాటల ప్రస్థానం అద్వితీయం అని చెప్పుకోవచ్చు.. మన జీవితంలో నవరసాలతో పాటు భక్తి దైవత్వం, ఒంటరితనం, భగవంతుని మీద కోపం ఇలా జీవితంలో ఎదురయ్యే దాదాపు ప్రతి భావాన్ని ఆత్రేయ గారు పాటలలో వర్ణించారు. ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది గొప్ప వ్యక్తులను కలిసినా గాని వారి పాట మన మనసుపై ప్రభావం చూపినంతగా మరేది చూపించలేదనిపిస్తుంది ఆత్రేయ గారి పాటలు, మాటలు వింటుంటే.. ఆత్రేయ గారి పాటలలో కొన్ని మాత్రమే పొందుపరచాలంటే చాలా కష్టతరం.. అందుకే ఇక్కడ నేను కొన్ని జత చేస్తున్నాను మరిన్ని కామెంట్ల ద్వారా మీరు కూడా నచ్చిన పాటను పంచుకోవచ్చు..
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కటినం.. (అభినందన)
ఈనాడే ఏదో అయ్యింది.. (ప్రేమ)
ప్రియతమా నా హృదయమా.. (ప్రేమ)
ఏ నావది ఏ తీరమో ఏ నేస్తమే జన్మరమో (సంకీర్తన)
చుక్కల్లే తోచావే.. (నిరీక్షణ)
తీగనై మల్లెలు పూచినా వేళా.. (ఆరాధనా)
నా గొంతు శృతిలోనా.. (జానకి రాముడు)
తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. (మనసే మందిరం)
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో.. (జీవన తరంగాలు)
పాడుతా తీయగా సల్లగా.. (మూగ మనసులు)
అదిరింది మామ అదిరిందిరో.. (జానకి రాముడు)
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో.. (మరోచరిత్ర)
మనసుగతి ఇంతే మనిషి బతుకింతే.. (ప్రేమనగర్)
ఇటు అటు కాని హృదయంతోని.. (ఇది కథ కాదు)
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో.. (దసరా బుల్లోడు)
ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు.. (మూగ మనసులు)
దేవుడే ఇచ్చాడు వీది ఒకటి.. (అంతులేని కథ)
లేలేలే - నా రాజా.. (ప్రేమనగర్)
కలసి ఉంటే కలదు సుఖము.. (మరో చరిత్ర)
రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. (సీతారామ కళ్యాణం)
పల్లవించవా నా గొంతులో పల్లవికావా నా పాటలో.. (కోకిలమ్మ)
జానకి కలగనలేదు రాముని సతికాగలనని.. (రాజకుమార్)
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్.. (ఆకలి రాజ్యం)
నేను పుట్టాను లోకం మెచ్చింది.. (ప్రేమనగర్)
కుర్రాళ్ళోయ్ - కుర్రాళ్ళోయ్ వెర్రెక్కి వున్నోళ్ళు.. (అందమైన అనుభవం)
మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. (గుప్పెడు మనసు)
కన్నె పిల్లవని కన్నులున్నవని.. (ఆకలి రాజ్యం)