This Short Conversation Between Two Friends About Choosing A Life Partner Is An Eyeopener For All Of Us!

Updated on
This Short Conversation Between Two Friends About Choosing A Life Partner Is An Eyeopener For All Of Us!

Contributed By Vamshi Gajendra

శివ .. విశ్వ ..ఇద్దరు రోడ్డు కేసి చూస్తున్నారు .. ఒకడు ఆతృతగా .. ఇంకొకడు అలసట తో..

విశ్వ : రే .. ఇంకా ఎంత సేపు రా.. అసలు తను వస్తుందా .. రాదా.. ??

శివ : టైం అయ్యింది రా.. జస్ట్ వెయిట్ .. వచ్చేస్తుంది..

విశ్వ : తను వస్తుందో రాదో కానీ వెయిట్ చేసి చేసి నాకు మాత్రం విసుగ్గొచ్చింది ... నీ ఫోన్ ఇలా ఇవ్వు రా...

శివ : నువ్వు వెయిట్ చెయ్.. నేను చాట్ చేసుకుంటా..

శివ ఫోన్ ఇచ్చాడు .. వెంటనే ఫోన్ మోగింది .. " చిత్ర " పేరు స్క్రీన్ మీద కనపడింది..

విశ్వ : రే .. చిత్ర ఫోన్ చేస్తోంది రా..

శివ : పొద్దున్నుండి ఇది 24 సారి.. కట్ చెయ్ రా ..

విశ్వ : ఏరా గొడవైందా ?

శివ : గొడవా ? చిత్ర తో నా... నెవెర్ ..

విశ్వ : మాట్లాడడానికి ఎం మాయ రోగం ??

శివ : మాయ రోగం కాదు .. ప్రేమ విన్నపం ...

విశ్వ : ప్రేమ విన్నపమా ??

శివ : నేను ఫోన్ ఆన్సర్ చేస్తే .. తన ప్రపోసల్ కి కూడా ఆన్సర్ చెయ్యాలి..

విశ్వ : ఏంటి .. ?? చిత్ర నీకు ప్రపోస్ చేసిందా ?? ఎప్పుడు రా ?? చెప్పనేలేదు ?

శివ : వన్ వీక్ బ్యాక్ చేసింది రా ... నాకు ఎం చెప్పాలో తేలిక .. ఈరోజు చెప్తా అని టెంపోరరీ గా ఎస్కేప్ అయ్యా...

విశ్వ : మరి పార్టీ ఎపుడు బే ?

శివ : ముందు శ్వేతా నా ప్రపోసల్ కి యెస్ చెప్పని.. తరువాతా చూద్దాం ..

ఈ మధ్య లో చిత్ర మళ్ళి మళ్ళి కాల్ చేస్తోంది.. శివ కట్ చేస్తూనే ఉన్నాడు..

విశ్వ : మరి చిత్ర కి ఎం చెప్తావ్ ?

శివ : అది తెలియకే కాల్ ఆన్సర్ చేయట్లా ..

విశ్వ : కన్ఫ్యూషన్ దేనికి ?? తను చాలా డీసెంట్ అమ్మాయి అని నువ్వే చెప్పావ్ గా ?

శివ : అవును.. అది క్యారెక్టర్ లో topper అయినా .. బ్యూటీ అనే subject లో ఇంకా backlog ఉంది...అందుకే ..

విశ్వ : అందుకు ??

శివ : అందుకే నేను శ్వేతా ని సెలెక్ట్ చేసుకున్నా..

ఇంతలో.. దూరం గా వస్తున్న అమ్మాయిని చూపిస్తూ .. చాలా ఉత్సంహంగా ..

శివ : రే .. తనే రా శ్వేతా ...

విశ్వ ఆ అమ్మాయిని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు..

శివ : రే తప్పు రా.. తను నాకు సెట్ అయితే .. నీకు సిస్టర్ అవుతుంది... విశ్వ .. చిన్నగా నవ్వి .. శ్వేతా తో మాట్లాడమని ప్రాంప్ట్ చేసాడు ..

శివ : వద్దు రా ..

విశ్వ : ఎం రా ?

శివ : తనకి నేనేంటో నచ్చదో .. మొత్తం మొగ జాతే నచ్చదో తెలీదు... తను ఒక అబ్బాయితో మాట్లాడటం కూడా చూడలేదు నేను..

శ్వేతా వీళ్లిద్దరు ఉన్న బస్టాప్ ని క్రాస్ అయ్యిది.. చిరాగ్గా ఒక చూపు విసిరి..

విశ్వ : నెక్స్ట్ ఏంటి రా .. ఫాలోయింగ్ ఆ ?

శివ : కాదు షాపింగ్ .. రేపు తన బర్త్డే ... రేపే తనకి ప్రపోస్ చేస్తా... అందుకే షాపింగ్ ..

విశ్వ :ఎం కొనాలి... గిఫ్ట్ ఆ ?

శివ : కాదు షర్ట్ ..

బైక్ పార్క్ చేసి ఇద్దరు షాప్ లో కి ఎంటర్ అయ్యారు..

శివ : రే .. ఒక్క షర్ట్ సెలెక్ట్ చెయ్యటానికి ఎంత సేపు రా ??

విశ్వ : ఇదుగో ... పోయి ట్రయిల్ చూడు పో..

చిత్ర మళ్ళి మళ్ళి కాల్ చేస్తూనే ఉంది .. శివ కొత్త షర్ట్ లో బయటకి వచ్చి .. బాగోలేదు అని అర్ధం వచ్చేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు..

మళ్ళి కాసేపు selection ప్రాసెస్ నడిచింది..

విశ్వ : రే ఇది చూడు..

శివ : సూపర్ రా .. చాలా బావుంది..

విశ్వ : Then గో అండ్ ట్రై ..

శివ మళ్ళి బైటకు నిరాశ గా వచ్చాడు..

విశ్వ : ఎరా నచ్చలేదా ??

శివ : నచ్చింది రా ..

విశ్వ : మరేంది ?

శివ : బావుంది కానీ.. నాకు సూట్ అవ్వలేదు రా..

విశ్వ : సూట్ అయితే ఏంటి.. అవ్వకుంటే ఏంటి ? బావుంది గా..

శివ : అలా కాదు రా.. షర్ట్ వేసుకునేది నేను.. నాకు సూట్ అవ్వకుంటే ..ఎంత బావున్నా ఎలా వేసుకోమంటావ్ ?

చిత్ర ఫోన్ చేసింది.. శివ కట్ చేసాడు..

విశ్వ చిన్నగా నవ్వి..

విశ్వ :నీ లాజిక్ నాకు అర్ధం అయ్యింది లే.. కానీ నీ పాలసీ అది కాదు గా.. ??

శివ : ఏది కాదు రా ??

విశ్వ : సూట్ అయినా అవ్వకున్న బావుంటే చాలు గా నీకు ?

శివ : చెప్పేదేదో అర్ధం అయ్యేట్లు చెప్పురా అయ్యా ..

విశ్వ : చిత్ర గురించి రా.. తన గురించి మొత్తం తెలిసి.. తనని క్యారెక్టర్ లో టాప్ చేసి .. బ్యూటీ లో ఫెయిల్ చేసి .. ఇంకో అమ్మాయిని చేసుకున్నావ్ .. ఇక్కడ మాత్రం బావుంది .. నచ్చలేదు అని లాజిక్ మాట్లాడుతున్నావ్..

శివ : ఎం అంటున్నవ్ రా ?

విశ్వ : నీ షర్ట్ కి అప్లై చేసిన లాజిక్ .. చిత్ర విషయం లో చేయలేదేం ?

తను నీకు మంచి ఫ్రెండ్ ..నీ గురించి తనకి.. తన గురించి నీకు మొత్తం తెలుసు.. తర్వాతే తను నీకు ప్రపోస్ చేసింది.. నీ లోపాలతో సహా నిను ప్రేమించింది ..మరి నువ్వేం చేసావ్ ?

శివ : తను అందం గా లేదని రిజెక్ట్ చేస్తున్న.. ఏ తప్పా ??

విశ్వ : తప్పు కాదు మోసం.. నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం..

శివ : ఇందులో మోసం ఏముంది రా ?

విశ్వ : నిన్ను ప్రేమించిన అమ్మాయికి అందం లేదన్న కారణంతో.. ఇగ్నోర్ చేసి.. నీతో మాట్లాడానికి కూడా ఇష్టపడని అమ్మాయి అందం గ ఉందన్న ఒక్క కారణం తో అప్రోచ్ అయ్యావ్ .. మోసం కాక ఇంకేంటి ??

శివ : మరేం చేయమంటావ్ ? అందం గా లేని అమ్మాయిని లవ్ చేయమంటావా ?

విశ్వ : నిన్ను ఆనందం గా ఉంచగలిగే అమ్మాయిని ఎంచుకోమంటున్నా..అప్పుడు నీ జీవితం అందం గా ఉంటుంది.. అసలు ఎలాంటిదో .. ఏంటో .. ఏవి తెలుసుకోకుండా .. శ్వేతా కి ప్రొపోజ్ చేయటానికి రెడీ అయ్యావ్.. నీ గురించి అంతా తెలుసుకుని ఇష్టపడి .. ప్రేమను వ్యక్త పరిచిన అమ్మాయి కాల్ ఆన్సర్ చెయ్యటానికి కూడా సిద్ధం గా లెవ్...?

శివ మైండ్ తాలూకు కన్ఫ్యూషన్ .. ముఖం లో స్పష్టంగా తెలుస్తోంది.. విశ్వ చెప్పుకు పోతున్నాడు..

విశ్వ : అందానికి అదుపు లేదు.. చూస్తూ పోతే అందానికి మించిన అందం కనిపిస్తూనే ఉంటుంది.. నా దృష్టిలో అందం పడక గదికే పరిమితం ..షర్ట్ విషయం లో నచ్చినా.. నీకు నప్పుతుందో లేదో అని ఆలోచించిన నువ్వు.. శ్వేతా నీకు APT అని ఎలా ఫిక్స్ అయ్యావ్ రా ?

శివ అయోమయం గా విశ్వ ని చూసాడు...

విశ్వ : confuse అవ్వకు.. అందాన్ని ఆరాధించటం లో తప్పు లేదు.. కానీ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి .... ఆలోచన విధాన్నాన్ని ప్రేమించాలి..

శివ : అయితే ఫైనల్ గా నన్నేం చేయమంటావ్ రా ?

విశ్వ : నీకు ఫైనల్ చెప్పడానికి నీ లైఫ్ కి నేను third umpire కాదు నేను.. నువ్వే డిసైడ్ అవ్వాలి.. choice లు suggestion లు ఎన్నో ఉంటాయి maccha .. కానీ decision ఒకటే ఉంటది...అది నీదే అవ్వాలి..

కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది ... ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ .. చిత్ర ఫోన్ కాల్ అందం గా మోగింది

శివ ఫోన్ కాల్ ఆన్సర్ చేసాడు..

విశ్వ చిన్నగా నవ్వి .. షాప్ బైటున్న హోర్డింగ్ కేసి చూసాడు ..

" Beauty will fade out .. but behavior never " అని రాసుంది అక్కడ