“ఇదే మన ప్రేమ కి అంతం అయితే ఈ అంతాన్ని ఓ అందమైన అనుభూతి చేద్దాం ఇదే మన ప్రేమ కి అంతం అయితే ఈ క్షణాన్ని ఓ మధురమైన జ్ఞాపకంలా మారుద్దాం ఇదే మన ప్రేమ కి అంతం అయితే చివరిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోదాం”
"అర్జున్ , మరికొన్ని గంటల్లో సూర్యుడు ఉదయిస్తాడు. ఆ తర్వాత నీవెవరో నేనెవరో. పదేళ్ల మన ప్రేమ , ఎవరో తెలియని ఎప్పుడు కనపడని ఒక నమ్మకం విడతీసింది. ఇప్పటివరకు నువ్వే నా జీవితం అనుకున్న, కానీ ఇపుడు నువ్వు ఆ జీవితం లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయావు. ఇదే మన ప్రేమ కి అంతం అయితే , నా జీవితానికి కూడా ఇదే అంతం”
మీరా రాసిన ఈ చివరి మాటలు ఆయేషాను తన జీవితానికి ఇంకా దగ్గరగా చేసాయి. అయేషా గమ్యాన్ని నమ్ముతుంది. జీవితం లో మనం ఎంచుకున్న గమ్యాన్ని బట్టి కొంత మంది గొప్పవాళ్ళు అవుతారు కొంత మంది దిగజారి పోతారు. కానీ మీరాకి ఏదైతే జరిగిందో అది ఆయేషాను ఎప్పుడు బాధపెడుతూనే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉండే మీరాకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండకూడదు. ఎప్పుడు అందరితో కలిసి తిరిగే మీరా తన బాధ ని పంచుకునే వారు లేరని ఇలాంటి నిర్ణయం తీసుకునే స్థితికి వచ్చి ఉండకూడదు.
ఆ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది కానీ ఇప్పటికి ఆ జ్ఞాపకాలు ఆయేషా కళ్ళ ముందు తెలియాడుతున్నాయి. ఎపుడు ఖాళీగా ఉండే వారి ఫ్లాట్ ఆ రోజు మొత్తం జనాలతో నిండిపోయింది. ఏమి జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపు మీరా తన తుది శ్వాస విడిచింది. తాను నమ్మిన వాడు తనని నమ్మలేదని బాధ, తను ఎంతగానో ప్రేమించే తన అమ్మ నాన్నలు తన ప్రేమని ఒప్పుకోరు అని భయం, మతం అనే మూఢ నమ్మకం ప్రేమ అనే ఒక నమ్మకాన్ని ఎక్కడ చంపేస్తుందో అని తన బాధని ఎవరికి పంచుకోవాలో తెలియక, తన జీవితంలో అర్జున్ ని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేక బాధ,దుఃఖం, కోపం, భయం మధ్య విలవిల లాడుతూ తన ప్రాణాన్ని వదిలేసింది.
ఎప్పుడు నవ్వుతు ఉండే మీరా, ఎందుకు బాధలో ఉందొ తెలుసుకోలేని ఆయేషా లాంటి స్నేహితులు, మతం పేరుతో ప్రేమ ను బలిచేసే తల్లితండ్రులు ఇపుడు ఏమి చేయాలో తెలియక అలా నిజాన్ని నమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాణం తీసుకోవాలంటే ఒక క్షణం, ఒక కారణం చాలదు. దానికి చాల ధైర్యం భరించలేని దుఃఖం ఉండాలి. ఎప్పుడు మీరా తో ఉండే అయేషాకి మీరా జీవితం లో ఇన్ని జరుగుతున్నాయి అని గుర్తించలేనంత దగ్గరగా ఉంది.
మీరా అలా ఎందుకు చేసుకుందో ఎవరికీ తెలియదు కానీ ఇందుకు అని రకరకాల కబుర్లు పుకార్లు. ఎప్పుడు చిరునవ్వు తో ఉండే ఆ ముఖం వెనుక ఒక తెలియని బాధ ఉందని తను రాసిన డైరీ చెప్తుంది. ఎప్పుడు కాటుకతో అందంగా ఉండే కళ్లు కన్నీటితో నిండటానికి గల కారణం తన రాసిన ప్రతి అక్షరం చెప్తుంది. మనం అందరికి అన్ని తెలుసు అనుకుంటాం ఆ భ్రమలోనే బ్రతికేస్తాం. ఆ భ్రమ నుంచి బైటికి వచ్చేలోపు మీరా లాంటి ప్రాణాలు ఎన్నో ఆరిపోతున్నాయి .
మీరా , ఎప్పుడు తన పక్కనే ఉండే ఈ ఆయేషాకి తన జీవితం లో జరుగుతున్నా విషయాలు ఎందుకు చెప్పలేదు అన్ని చాల మంది చాల సార్లు అనుకుని వుంటారు. దానికి సమాధానం మీరా రాసిన ఆ డైరీ లో దొరికింది. తన పరిస్థితికి దారి తీసిన ఆ కారణం తన స్నేహితురాలు అని . అవును! అర్జున్ మీరాలను విడతీసిన ఆ నమ్మకం “స్నేహం”. అయేషాతో స్నేహం. అర్జున్ అయేషాల పరిణయం.
“ఎప్పుడూ లేనిది ఏంటో ఈరోజు , ఏం చేయాలో తెలీదు , ఏం చేస్తున్నారో అర్ధం కాదు .. కలిసి ఉన్నాం అంటే ఉన్నాం .. నేను వేరు నా ప్రపంచం వేరు .. ఏదో ఆలోచనలు,ఏదో బాధ,ఏదో వెలితి .. ఇన్నాళ్లు కలిసి తిరిగిన వాళ్ళు ఒక్కరన్న భుజం తట్టి ఓదార్చుతారు అని ఎదురు చూసే కళ్ళకి సమాధానం లేదు .. బాధ మరిచేలా ఏడవటానికి ఒకరి కౌగిలి లేదు .. ధైర్యం చెప్పే మాటలు లేవు, ధైర్యం ఇచ్చే చిరునవ్వులు లేవు.దూరం అవుతున్నానా దూరం చేస్తున్నారా. తెలియని అనుమానం నన్ను కబళించింది .. నిద్ర లేని రాత్రులు , కన్నీటి ధారలు , భయపెట్టే ఆలోచనలు ప్రతి రాత్రి కాళరాత్రి అవుతూ , ఏదో తెలియని సందిగ్ధంలో ఉంటూ., నాతో నేనే యుద్ధం చేస్తూ, బాధపడుతూ, బరువు గుండెతో నీ తలుపు తట్టానే నేస్తం ..
ఓ అక్షరమా!! భుజం తట్టి ధైర్యం మిస్తావ్ పద కౌగిలి లో ఓదారుస్తావ్ పదం పదం తో మరో ఊపిరి పోస్తావ్ చిరునవ్వులకు దారి చూపిస్తావ్ ఓ అక్షరమా నీకు నమస్కారం!! బలం అనుకున్న వారే బరువనుకుంటున్నారే పక్కనున్న వారే ప్రేమకు అడ్డు అయ్యారే మారే పరిస్థితులని మారిపోయే మనుషులని ఎదురుకొనేందుకు నాకు ఉన్న ఆయుధం ఈ ఊపిరి ఆగే ముందు నాకు దొరికిన ఒక ఉపశమనం”
ప్రాణం తీసుకోటానికి ఒక క్షణిక కాలం సరిపోతుంది . కానీ క్షణికావేశానికి దారితీసే చాలా సంఘటనలు చిన్నవి గా కనిపించిన కానీ వాటి ఖరీదు ఒక ప్రాణం . మన చుట్టూనే ఉన్న , మనతోనే ఉన్న, వారిలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. Their bright faces are hiding the dark truths. As a friend మనం దానిని గుర్తించి we have to support them. In case మీరు ఆ depression లో ఉంటే just share with someone. Writing is one of the best way to get out depression. మీ బాధని , కోపాన్ని , ఆనందాన్ని అయినా సరే అక్షరం తో పంచుకోండి . మనం మరిచినా కలం మనల్ని మరువదు. Suicide is never an option!!