Everything You Need To Know About The Ancient Ganesha Temple At Medak!

Updated on
Everything You Need To Know About The Ancient Ganesha Temple At Medak!

హైందవ సంప్రదాయంలో వినాయకుడుని అన్ని విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వరుడుగా పుజిస్తారు, అన్ని కార్యాలకు, పూజలకూ ప్రధమంగా కొలుస్తారు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడుగా భక్తులు గౌరవిస్తారు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములో వినాయకునికే ప్రధమపూజ. అలాంటి దేవునికి అత్యంత పవిత్రమైన దేవాలయం మెదక్ జిల్లా రేజింతల్ గ్రామంలో కలదు.

హైదరాబాద్ నుండి దాదాపు 90కిలోమీటర్ల దూరంలోని మెదక్ జిల్లాలోని జహిరాబాద్‌కు 15కిలోమీటర్ల దూరంలో ఈ "శ్రీ సిద్ది వినాయక దేవస్తానం ఉంది". ఇక్కడ మరో ప్రధాన విషయం ఏమంటే జహీరాబాద్ ఆర్‌టిసి డిపో వారు నడిపించే ఎక్సప్రెస్‌ బస్‌లలో కొన్నిటికి సిద్ది వినాయక ఎక్స్‌ప్రెస్‌ అని నామకరణం చేయటం. కర్ణాటక రాష్ట్రానికి దగ్గరిగా ఉండటం వల్ల ఈ దేవాలయాన్ని తెలుగు రాష్ట్రాలవారితోపాటు కర్ణాటక వారు కూడా దర్శించుకుంటారు.

20141018_123645

మెదక్ జిల్లా రేజింతల్ లోని ఈ వినాయక మందిరానికి ఒక చరిత్ర ఉంది. 200సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది.. కాలనడక ద్వారా వివిధ దేవాలయాలను దర్శించుకుంటున్న శివారాం అనే యోగి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో చేరుకోగానే అప్పటివరకు మనసులో ఉన్న దిగులు అంతా తొలిగిపోయి శాంతి ఆనందం ఒకేసారి గుండెలోకి చేరినట్టుగా అనిపించేసింది ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అక్కడే కొన్నాళ్ళపాటు ఉండాలని అనుకున్నారు.

అలా అక్కడే భగవంతున్ని స్మరణచేస్తు తపస్సు చేశారట తన భక్తికి మెచ్చి ఆ యోగి అంతరాత్మకు వినాయకుడు దర్శనమిచ్చి తన ఆచూకి తెలిపి తనకోసం కోవెల నిర్మించాలని సూచించారట.. ఆరోజు స్వయంభూ గా వెలసిన గణేషుని ప్రతిమ ఒక్క అడుగు ఉండేదట క్రమంగా అది పెరుగుతు వస్తుందని స్థలపురాణం చెబుతుంది. సంకష్టహర చతుర్ధి వేడుకలకు వినాయక చవితి పండుగలకు మాత్రం ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు సంకష్టహర చతుర్ధి సిద్ధివినాయక వేడుకల రోజున ఆలయం చుట్టు తిరిగితే అనుకున్నవన్నీ జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

rejinthal-ganesh-temple-4-no-watermark

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.