Contributed By Karthikeya Nandivelugu
ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా వెళ్లిందని మనం ఈరోజు అందరు సంతోష పడుతున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిన మాట నిజం. కానీ, ప్రపంచ స్థాయి సినిమాలు ఎన్నో దశాబ్దాలుగా మన దర్శకులు తీసిన సందర్భాలు కోకొల్లలు. వాటిలో "మాయాబజార్" ఒకటి. ఎంతసేపు విదేశీ చిత్రాలు భజన చేసే వాళ్లు కూడా, ఈ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి , మాట్లాడడానికి తమ శక్తి చాలదు అంటుంటారు. అలాంటి మన మాయాబజార్ సినిమా కు సంబంధించిన కొన్ని ఫ్రేముల కథ కాసేపు చెప్పి ఆనంద పడాలి అనిపించింది. అందుకే ఇది రాస్తున్నా.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ మార్కస్ బార్ట్లే గారు సమకూర్చారు. ఆయన ఈ సినిమాలో తీసిన కొన్ని కొన్ని షాట్లు ఇప్పటికీ ఎలా తీసారో మిస్టరీ అనుకునేంత అద్భుతంగా చిత్రీకరించారు..
కృష్ణుడి పరిచయ సన్నివేశంలో వచ్చే ఫ్రేమింగ్ కానీ ( ZOOM OUT PAN)
అభిమన్యుడు చిన్న వయసులో ద్వారకను వదిలి వెళ్లిపోయే సన్నివేశంలోకానీ (BENHUR లో చూస్తాం అలాంటి నిండైన ఫ్రేమ్ ని, ద్వారక మొత్తం ఆ కాస్త షాట్ లో కనిపించిందా అన్నట్టు ఉంటుంది)
బలరాముడు సుభద్రకు పిల్లని ఇవ్వను అని చెప్పే సన్నివేశంలో ( Speilberg , Hitchcock , Orson welles, లు తీసిన సినిమాల్లో ఏదైనా conflict ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇలాంటి షాట్స్ చూడొచ్చు - Size of subject in frame )
ముఖ్యంగా అభిమాన్య, ఘోటోత్కచ యుద్ధ సమయంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్ ఇవాళ్టికి కూడా ఊహించని అద్భుతమైన షాట్స్ లో ఒకటి
పెద్దదయిన శశిరేఖ పాత్రని ప్రతిబింబంలోంచి , అలలు అలలుగా చూపించిన తీరు చూస్తే నిజమైన పోయేటిక్ సినిమా అప్పట్లోనే వచ్చింది కదా అని అనుకోక తప్పదు.
ఇకపోతే, అభిమన్యుడు శశిరేఖను బయటకు తీసుకెళ్లడానికి వచ్చిన షాట్, రోమియో జూలియట్ స్టైల్ లో ఉంటుంది...
నర్మగర్భంగా హస్తినాపురంలోకి ప్రవేశించిన ఘటోత్కచుడు, అతని తాలూకు బృందం కోసం Frame inside Frame షాట్స్ చాలానే కనిపిస్తాయి...
వివాహ భోజనంబు లో ని షాట్స్ అయితే ప్రతిఫ్రేమ్ వాళ్ళ కష్టానికి, సినిమా అంటే వాళ్లకు ఉన్న ఇష్టానికి ప్రతీక
కావాలంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక్కో ఫ్రేమ్ ఆపి చూడండి... ప్రతీ ఫ్రేమ్ లో ఒక్కో ఆర్టిస్ట్ చూపు, కూడా ఒక్కో కథ చెప్తున్నట్టు ఉంటుంది...
అంతర్జాతీయ స్థాయి సినిమా మనకు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా... ఎప్పటికీ గర్వంగా చెప్పుకోదగ్గ ఈ సినిమా, ఇందులోని సినిమాటోగ్రఫీ మనకు వెలకట్టలేని ఆస్తి..