Contributed by Sumanth Reddy Bagannagari
మనిషిగా మనం చేసే చేస్తున్న చాలా పనుల మధ్య మనం ఒకటి మర్చిపోతున్నాం అది మనిషిగా ఉండటం మనిషిలా బతకటం ఓ మనిషిగా నా చుట్టూ ఉండే మనుషులకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే? ఎవరికి వారే బతకాలనుకుంటే ఒక్కొక్కరికీ ఒక్కో ప్రపంచాన్ని ఇచ్చేవాడు. అందరినీ ఒకే భూమి పై పడేసాడంటే, కలిసి ఉండమని, పంచుకొని పెంచుకోమనీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం??
మనుషుల మధ్య కులాలు, మతాలు స్వార్థాలు, ద్వేషాలు అనే ఇటుకలతో కట్టిన పెద్ద పెద్ద గోడలు
ఏ నేలను తడిమినా రక్తపాతం ఏ గొంతును కదిపినా విషాదగీతం ఏ బాటలో చూసినా హింసా భూతం
కాశ్మీర్ నుండి సిరియా దాకా అడుగడుగునా మనుషులే పుట్టించిన మతం కోసం కులం కోసం మనుషులం అయి ఉండి మనుషులని చంపుకుంటున్నాం
నాకు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాని పదం “కులం” ఎందుకీ విభేదం అసలెందుకీ వివక్ష కొన్ని కొన్ని తేడాలతో ఇంచుమించు ఒకేలా ఉండే మనుషులని ఇలా ఎలా విడదీయగలం
ఏ పురాణాలు చెప్పలేదు ఈ కులం పెద్దది ఈ కులం చిన్నది అని ఏ మతంలోనూ చెప్పలేదు వేరే మతాన్ని ద్వేషించమని
మనిషిగా బతుకుదాం మనిషిగానే బతుకుదాం మనుషుల్ని బతకనిద్దాం
“సర్వేజనా సుఖినోభవంతుః” “సకల దేశాయ సుభిక్షంభవంతుః”