Contributed by Sri Harsha Pulipaka మే, మిట్ట మధ్యాన్నం, ఒక మనిషి నడుచుకుంటూ ఒక చెట్టు కింద ఆగాడు. చేతిలొ ఉన్న మజ్జిగ పాకెట్ తాగటం అయిపోయింది. అటు ఇటు చూసి ఆ చెట్టు కిందె పడేసాడు. మరుక్షణం ఒక గొంతు వినిపించింది. "రేయ్.. ఆ పాకెట్ తీయరా." దాంతో ఎవరా అని ఉలిక్కిపడి చూసాడు. ఆ మాటలు అన్నది చెట్టు. " ఓహ్.. నువ్వా.. ఏంటి సంగతులూ.." " నీ చెత్త తీసి నా మొహం మీద కొట్టి మళ్ళీ పలకరింపులొకటి. ముందు తీయి అది." "ఎక్కడేస్తే ఏంటీ. అయినా అక్కడ already చెత్త ఉందిగా. అందులోనే వేసా." "నిన్నొక్కటి లాగి గూబ మీద పీకీ మళ్ళీ కొడితే ఎమౌతుంది." "ఆ.. అర్థమైంది లే." "హ్మ్" "ఏంటి భయ్యా మాంచి హీటు మీదున్నావ్." " నా కింద నీకు హాయిగానే ఉందిగా" "మస్త్. ఇంత ఎండ లోకుడా నీ చల్లగాలి.. స్.. ఏ AC పనికిరాదు అంతే." "...." "ఏంటి బ్రో మాట్లాడట్లేదు?" "నేను వివరం తెలిసిన వేధవలతో మాట్లాడను." "అంత మాట అనేసావెంటి భయ్య...!" "నిజంగా నా విలువ తెలిస్తే AC ఎందుకు వాడుతున్నారు రా. నా సావుకొస్తుంది." "నీకేమైంది.?" "నేనంటే చెట్టుని మాత్రమే కాదు ప్రకృతి ని కూడా." " అంటే అది..."
"నేనే మీ ఇంటి వెనకాల మొలిచేసి.. మీ అమ్మ నా కింద కూర్చున్నప్పుడు నా కొమ్మ విరిచేసి మీ అమ్మ మీద పడేస్తే ఎం చేస్తావ్?. నిర్దాక్షిణ్యంగా నన్ను నరికేస్తావ్" " గత 500 ఏళ్ల నుంచి నువ్ మా అమ్మ ని ఎన్ని పొట్లు పొడిచావ్. నేను నిన్నేం చేయాలి రా". " చూడు brother. Devolepment లో ఇవన్నీ తప్పదు." " వాడుకో.. నీ ఇష్టం. అందుకే గా నెనున్నది. కాని అన్నిటికి limit ఉంటది. ముడ్డి కిందకి 20 ఏళ్ళు వచ్చాక కూడా ఇంట్లో మేస్తూ నాన్నా iphone కొనివ్వవా అని అడగగలవా? నీ సంపాదన తో కొంటె గర్వంగా వాడుకోవచ్చు. నేనూ అంతే. నాలుగు చెట్లు పెంచు, నాలుగు నరుకు. అంతే గాని నే ఇష్టమొచ్చినట్టు నా మీద పడి మేస్తా అంటే ఎలా?" " Helloo.... హరితహారం అనీ nature day అనీ ఎన్నో మొక్కలు నాటుతూనే ఉన్నాం గా. " " ఆ పీకావు లే నా ఆకు.. old age home లో పడేసిన ముసలిదాన్ని birthday రోజు phone లో wish చేసిన అమెరికా కొడుకు లా yearly once june6th ఒకటి తగలేశారు 'world environmenral day అని. ప్రతివాడు ఆ రోజు మాత్రం తెగ నాటుతాడు మొక్కలు. ఆ తర్వాత ఉన్ననా తిన్ననా చచ్ఛాన అని చూసిన వాడు లేడు. అమెరికా కొడుకు లాగా." " కొన్ని ఎండిపోవచ్చు but రోడ్డు కి రెండు వైపులా సిటీలో చెట్లు బా maintain చేస్తున్నాం గా. చాలా nursery లు , santury లు కూడా సంరక్షిస్తున్నాం. మాలో చాలా మంది ఎకరాలు ఎకరాలు భూమి కొని చెట్లు పెంచుతున్నారు." " ఒరేయి.. నువ్వు నరికేది 100000.. నాటేది 100... పెంచేది 50. ఇదేనా సంరక్షణ.. నా మొక్కలో లెక్కలు చెప్పకు. మీరు పుట్టాక కొన్ని వేల ఏళ్ల నుంచి జంతువులు నాలో బతుకుతున్నాయి రా. ఏ రోజు ఒక్క హాని చేయలేదు. నిన్ను కోతి లా వదిలేసున్నా బావుండేది. రేయ్.. నీకు మొదట తిండి పెట్టింది నేను రా. నాలుగు కాళ్ల మీద నువ్వు నడుస్తుంటే నా కోమ్మల సాయం చేశా. అవ్వి పట్టుకునే నడవటం నేర్చుకున్నావ్. " "నేనా?"
" నువ్వంటే నీ తాత కి తాత కి ఇంకో 1000 తాతలనెస్కో.. వాడు లేకపోతే నువ్వు లేవు. నేను లేకపోతే వాడు లేడు." "మరీ అంత ఎం వచ్చింది ఇప్పుడు. అంతా బానే ఉన్నాం గా." "నువ్వు నీ జనాలు బావుంటే అంతా బావున్నట్టు కాదు. మీ తాత టైం లో రోహిణి కార్తి కి రొళ్లు బ్రద్దలౌతాయి అనే వాళ్ళు అంటే ఎర్రటి ఎండ. అది 35° కొన్ని వేల ఏళ్ల నుంచి అదే maintain చేస్తున్న. ఇప్పుడు mid summer అంటే 47°. ఒక్క generation లో ఇంత మార్పు. " " మరి జనాభా పెరిగిపోతుంటే , automatic గా సిటీలు spread అవుతాయి. అడవులు నరకాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మరి." "నువ్వు దేని కోసం దేన్ని వదులుకుంటున్నావో నీకు తెలియట్లేదు. అయిన ఎంత సేపటికి నువ్వు బాగుంటే చాలు. నీకు తేలిగ్గా పనులు అవ్వాలని ప్లాస్టిక్ తయారు చేశావ్ వాడుకుని నా గొంతులో కుక్కుతున్నావ్ ఆ చెత్తని నేను మింగాలా. ఎన్ని ఎన్ని ఎన్ని రా... నా గుండెల్లో గుణపాలు దించి గుంతలు తవ్వి ఆయిల్ అని పెట్రోల్ అని నా ప్రాణాలు తొడుతున్నారు. ఉన్న తల్లి పాలు అన్నీ నువ్వే తాగి తాగి అయిపోతే... నీ తర్వాత తరాలకు నేను నెత్తురు పంచాలా?." "మరిప్పుడు ఎం చెయాలి?" "ఇంకా చేసేదేముంది నీ బొంద. ఆ Stage నువ్వెప్పుడో దాటిపోయావ్. నా కోపం నషాలానికి అంటే వరకు ఆగు. అప్పుడు నువ్వు కాదు నేను చేస్తా" "ప్రళయం 2012ఆ... అయిన అది ఇంకా చాలా టైం పడుతుందంట గా. ఇంకొన్ని 100ల ఏళ్ళ తర్వాత లే. అప్పటికి నేనుండనుగా." " ఈ దరిద్రపు బుద్దే ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఎంత సేపు నువ్వు , నీ చుట్టూ ఉన్నవాళ్లు అంతేనా? ముందు తరాలకు ఎం ఇవ్వరా. రేయ్... కొడుకులకు మనవడ్లకు ఆస్తులు కాదు రా నువ్వు ఇన్నాళ్లు హాయిగా బ్రతికిన నన్ను ఇవ్వు. డబ్బు నువ్వు ఇవ్వకపోతే వాడు సంపాదించుకుంటాడు. కానీ మీకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ నేను. అందుకే నన్ను తల్లి తో పోల్చారు. " " అసలు అడిగేవాళ్ళు లేరనేగా నీ తోటి జంతువులని , పక్షులను, సమస్త జీవన్నీ సర్వనాశనం చేస్తున్నావ్. ఇప్పుడు కనీసం నీ జాతి మీద కూడా జాలి లేదు నీకు. అసలు నన్నడిగితే.. పంచభూతాల మీద ప్రకృతి మీద ప్రేమ లేని ఏ ఒక్కడికి పిల్లల్ని కనే అర్హత లేదు. మీరు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించాలా.." "మరి ఇంత జరుగుతున్నప్పుడు మాకు చెప్పలీగా నువ్వు." " ఎప్పటికప్పుడు భూకంపాలననీ సునామీలననీ హెచ్చరిస్తూనే ఉన్న. సిగ్గు లజ్జా ఎడిస్తేగా మనకి. Luxury మత్తులో ఏ company AC కొనాలో అని ఆలోచించుకుంటు busy గా ఉన్న మీకు ఇవ్వేం కనిపిస్తాయి." ఆ మనిషి చెట్టు వైపు నోరెళ్ల బెట్టి చూస్తూ ఉన్నాడు...
" ఏంటి చేస్తున్నావ్. బయల్దేరు... ముందు మీ పూర్వికులు చెట్లను జంతువులను దేవుడిగా చూసి ఎందుకు పూజించాడో తెలుసుకోండి. కనీసం మీ ముందు తరాలకైనా నేర్పండి." "అలాగే" అని బయల్దేరాడు మనిషి . కాస్త ముందుకి వెళ్లి వెనక్కి తిరిగి చుసాడు. ఆ చెట్టు తన వైపు చూడకపోవటం గమనించాడు. చేతిలో ఉన్న ప్లాస్టిక్ మజ్జిగ ప్యాకెట్ మరో చెట్టు కింద విసిరి చేతులు దులుపుకుని వెళ్ళిపోయాడు.