హిందూ సంస్కృతిలో సృష్టిలో అత్యంత శక్తివంతునిగా పరమశివుడిని కొలుస్తారు. భగవంతుడు సర్వాంతర్యామి ప్రతి చోట, ప్రతి వస్తువు, ప్రతి ప్రాణిలోను ఉన్నాడు. తాను ప్రతిచోట ఉన్నాడని తెలుపడానికి భౌతికంగా ఆధారం చూపడానికి స్వయంభూ గా వెలిశారు. అలా సాక్షాత్తూ పరమశివుడు గుంటూరు జిల్లా పెదకాకాని ఊరిలోను ప్రతిమ రూపంలో కొలువై ఉన్నారని చరిత్ర. ఈ దేవాలయం గుంటూరు జిల్లాకు ఏడు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నది.
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. పూర్వం ఒక మునీశ్వరుడు శంకరుని దర్శనం కోసం తీవ్రంగా తపస్సు చేశారు. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యక "మీ దర్శనం కోసం ఇక్కడే తపస్సు చేశాను ఈ ప్రదేశంలోనే, ఇక్కడే మీరు కొలువై ఉండి భక్తుల కోరికలు తీర్చాలని" వేడుకున్నాడట. అతని కోరిక మేరకు పరమశివుడు ప్రతిమ రూపంలో వెలిశారని ఆలయ పూజారులు చెబుతారు. అలాగే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం భరద్వాజ మహర్షి శివుని దర్శనం చేసుకుని ఇక్కడి రమనీయ ప్రకృతిలో యజ్ఞం చేయడం ప్రారంభించారట.. ఐతే దేవతలకు సమర్పించే హవిస్సుని ఓ కాకి తినడం ప్రారంభించిందట.
భరద్వాజ మహర్షి కాకిని ఇదేంటని ప్రశ్నించగ "నా వల్ల మీకే ఆటంకం ఉండదు నిర్విఘ్నంగా పూర్తిచేయండి. ఇంతకు పదింతలు యజ్ఞఫలం రావాలంటే పుణ్య నదిజలంతో నన్ను అభిషేకించు దాని వల్ల నా శాపం తొలగడంతో పాటు మీకూ ఎంతో మేలు జరుగుతుంది" అని చెప్పిందింట. భరద్వాజ మహర్షి కాకి మీద జలం అభిషేకించగానే శాపం తొలగి మామూలుగా మారిపోయిందట. అంతకు ముందు ఆ కాకి "కాకా" అని ఈ క్షేత్రంలో అరవడం వల్ల దీనికి పెదకాకాని అనే పేరు వచ్చింది. ఇదే గుడిలో వీరభద్ర స్వామి వారి ఆలయం, భ్రమరాంబ మొదలైన ఆలయాలు కూడా ఉన్నాయి.. దసర, మహాశివరాత్రి పర్వదినాలలో కేవలం గుంటూరు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండి నుండి మాత్రమే కాదు తెలంగాణ ప్రాంతం నుండి భక్తులు దర్శనానికి వస్తుంటారు.
&nbs;