Mahanati: A Film That's More Than A Perfect Tribute To The Legendary Savitri Garu!

Updated on
Mahanati: A Film That's More Than A Perfect Tribute To The Legendary Savitri Garu!

మహానటి, ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్న సావిత్రమ్మ దృశ్య కావ్యం. ఎలా ఉంటుంది అని అందరిలోనూ ఒక తెలియని కుతూహలం. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. సావిత్రమ్మ నటనలానే ఎంత చూస్తున్నా ఇంకా చూస్తూనే ఉండాలి అనిపించేంతలా ఉంది. ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించేలా ఉంది. వన్నె తరగని సావిత్రమ్మ నటనా వైభవానికి, మన తెలుగు సినిమా ఇచ్చిన ఒక గొప్ప బహుమతి ఈ "మహానటి".. తెలిసిన కథనే, మనసుకు హత్తుకునేలా వర్ణించిన ఈ దివ్య కావ్యం గురించి మా మాటల్లో .. అనగనగా ఓ మహానటి... ఆకాశ వీధిలొ అందాల జాబిలి....

1. Simple yet beautiful presentation- దర్శకుడు నాగ్ అశ్విన్, ఈ కావ్యానికి మలిచిన తీరు కచ్చితంగా ప్రశంసనీయం. కథ, కథనం, పాత్రలు ప్రతిదానిలో సావిత్రమ్మ పై ఆయనకున్న అభిమానం కనిపిస్తుంది. అందరికి తెలిసిన కథనే, చాలా చక్కగా అర్ధం అయ్యేట్టు ఒక గొప్ప కథని ఇంకా గొప్ప చెప్పారు, చూపించారు.

2. Phenomenal Keerthy Suresh : సావిత్రమ్మ పాత్రలో నటించారు అనటం కంటే జీవించారు అని చెప్పటం కూడా చాలా తక్కువే. ఆమె నటనా, హావాభావాలూ ప్రతిదీ సావిత్రమ్మను తలపించాయి. అమ్మ పాత్రని వెండి తెరపై చూస్తున్నప్పుడు మనసులో కలిగిన ఆనందాన్ని మాటల్లో పేర్చాలంటే పదాలు చాలట్లేదు.

3. Exciting Surprises : ఒకరు కాదు ఇద్దరు కాదు, తెలుగు ఇండస్ట్రీ నటులు, దర్శకులు అందరు ఎందరో ఈ కావ్యంలో తమ వంతు పాత్ర వహించారు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి, తరుణ్ భాస్కర్, శ్రీని అవసరాల, నటులు షాలిని పాండే,మాళవిక, తనికెళ్ళ భరణి, నాగ చైతన్య మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ సినిమాలో తలుక్కున్న మెరిసి అలరిస్తారు.

4. Splendid Performances : మధురవాణి - విజయ్ ఆంథోనీ పాత్రల్లో సమంత - విజయ్ దేవరకొండ కథను అద్భుతంగా నడిపిస్తారు. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ లా సావిత్రమ్మను అమితంగా ప్రేమించే ప్రేమికుడిలా, అమ్మ ఎదుగుదలను చూస్తూ ఈర్ష తో రగిలిపోతున్న భర్తలా ప్రేక్షకుడు ప్రేమిస్తూ, ద్వేషించేలా అద్భుతంగా ఒదిగిపోయారు.

5. Recreating old feels : విజయ వాహిని స్టూడియోస్ సెట్ నుండి, మాయాబజార్ సీక్వెన్స్ దాకా ప్రతిది చాలా చక్కగా మలిచారు. మళ్ళీ మనందరినీ ఒక తరం వెనక్కు తీసుకువెళ్లారు.

6. Soothing Music: మికీ.జె.మేయర్ సంగీతం వినసొంపుగా, సన్నివేశానికి తగ్గట్టుకు చక్కగా ఉంది. సదా నిన్ను పాట ఇంకా మెదడు లో తిరుగుతూనే ఉంది. చివరకు మిగిలేది పాట కచ్చితంగా అందరి కంట నీరు పెట్టిస్తుంది.

7. Perfect Costumes :సావిత్రమ్మను మళ్ళీ తెరపై చుస్తున్నామా అన్నట్టు అనిపించేలా మేకప్ నుండి మేడలో హారందాక ప్రతి దాని చాలా చక్కగా తీర్చిదిద్దారు.

8. Experience of life time:అమ్మ ఎలా బ్రతికిందో కాదు, ఎంత గొప్పగా బ్రతికిందో చూపించారు. నవ్వించారు, ఏడిపించారు, అమ్మ తో పాటు మనందరినీ మూడు గంటల పాటు నడిపించారు. నమ్మిన ప్రేమ అమ్మ ని చంపింది అని అనుకుంటున్న అందరికి, ఆ ప్రేమ ఎంత గొప్పది అని చూపించారు.