మగువ - This Perspective On Woman Makes Us Realise Her Eternal Greatness

Maguva - A Short Story on Woman which makes us realise her real power
Updated on
మగువ - This Perspective On Woman Makes Us Realise Her Eternal Greatness

ఎన్నో ఆశలు , ఇంకెన్నో ఊహలతో ఆకాశాన్ని అందుకోవాలనే కోరిక మీ మా మనందరి ఇంట్లో ప్రతీ కూతురి కో , అక్క కో , చెల్లి కో , అమ్మ కో కచ్చితంగా ఉంటుంది. కానీ దురదృష్టపు శాత్తు సమాజం గీసిన గీతాలలో బ్రతకాలి కాబట్టి , ఎవర్ని బాధ పెట్టె మనస్థత్వం ఉండదు కాబట్టి మౌనంగా చాలా కలల్ని త్యాగం చేసేసి ఉంటారు. కానీ ఎవరు ఎం అనుకుంటారనె ఆలోచన వదిలేస్తే ? ఒక్కసారి స్త్రీ స్వార్దంగా ఆలోచిస్తే ?

ఆడదానికి అపరశక్తి రూపానికి దూరం కేవలం ఒక నిర్ణయం. తను తలుచుకుంటే తాకలేని స్థానం లేదు. నీ అహాన్ని పోషిస్తూ , నువ్వొక గొప్పోడివి అనె నీ భావనకు ఊపిరి పోసుకుంటు బ్రతుకుతుంది. తింగరిది అని నువ్వు పూర్తి చేసే లోపు అసలు నువ్వు ఊహించలేని శిఖరాలకు వెళ్లగలిగే శక్తి తనది.

తన త్యాగంతో నడుస్తున్న ధరతిరా ఇది.సీతాదేవి అయినా , మేరీమాత అయినా నిందలు మోసారు కానీ రాముడిని , యేసుని విడిచిపెట్టలేదు. పురాణాల్లో , పుస్తకాలలో ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయి అని అల , అలవోకగా అనె ఓ మిత్రమా , ఆ యుద్ధాల ముగింపు లో ధర్మం గెలిచిందని మర్చిపోయావా లేదా ఆ యుద్ధం అంచుకి ఒక అధర్మపు సామ్రాజ్యం మట్టి కలిసిందని గ్రహించలేకపోయావా .

తనకి సహాయం పక్కన పెడితే ముందు గౌరవం ఇద్దాం. సమాన హక్కు ఇవ్వడం అన్న ఆలోచన తీసేసి వాళ్ళు సామానులు , అన్ని హక్కులు గల వారు అని నమ్మడం మొదలుపెడదాం .నువ్విచ్చే నిర్ధారణ కన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేసేయ్ , అంత కన్నా పెద్ద బహుమానం ఏమి లేదు .

నువ్వు నమ్మే ప్రేమ పచ్చని పొలం అయిఉండచు , అది సస్యశ్యామలంగా పెరగాలి అంటే గౌరవం అనె నీరు అతి ప్రాముఖ్యం .

గౌరవం లేని ప్రేమ , ప్రాణం లేని దేహం తో సమానం .

నీ జుట్టు నీ ఇష్టం అయితే వాళ్ళ బట్ట వాళ్ళ ఇష్టం .

నీ పరువు నీకెంత ముఖ్యమో, వాళ్ళ పెళ్లి మీద హక్కు వాళ్ళకి అంతే ముఖ్యం

వాళ్ళ బాటలో ఇక్కట్లు తొలగించాలనుకో , కానీ బెదిరించి బాటలో పెట్టాలనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం ఏమి ఉండదు.

నీ రూపం , నువ్వు పీల్చే ఊపిరి ఒక స్త్రీ పెట్టిన భిక్ష అని మర్చిపోకు.

అమ్మ లేనిదే నువ్వు లేవు , అసలు నువ్వే లేనప్పుడు నీ పెత్తనం ఎంత? అమ్మ కడుపులో నుండి వచ్చిన ఒక పిండపు ముద్దవని మర్చిపోకు , దాన్ని ప్రేమతో పెంచి ఒక అర్ధవంతమైన జీవితం ఇచ్చింది ఆసిడ్లు పోయడానికి , మానభంగాలు చేసి ఆ స్త్రీ కి , మీ అమ్మకి ఈ సృష్టికి వెన్నుపోటు పొడవడానికి కాదు . నీది కండ బలం , వయసుతో ఆవిరి అయిపోతుంది.తనది గుండె బలం నిలబడితే నా కొడకా ! సృష్టిని సైతం అంతం చేసే సామర్థ్యం,క్రోధం తనది.

నిన్ను నమ్మి వచ్చిన స్త్రీ నీ పక్కన ఉండగా ఈ లోకమంతా ఎదురు వచ్చిన , ఢీ కొట్టి మరి ఆ యుద్ధం గెలవగలవు.

తన ప్రేమ జీవితపు కొన ఊపిరి అంచు వరకు గుర్తుంటది.అమ్మ వడిలో ప్రేమ , తోబుట్టువు ఇచ్చిన ధైర్యం , అమ్మమ్మ ఇచ్చిన ఆప్యాయత, భార్య ఇచ్చె నమ్మకం , మగువ అంటేనే భావాలు , అవే ఈ బ్రతుకుని ముందుకి నడిపేవి. ప్రపంచంలోఉన్న ప్రతి మహిళకి, నమస్కరిస్తూ ధన్యవాదాలు. మీరే ఈ లోకానికి బలం , మీరే ప్రేమ , మీరే ధైర్యం.

అపరిపక్వతలో ఎమన్నా తప్పులు చేసిన , ఎప్పుడన్నా అరిచినా దయచేసి క్షమించేసి మళ్ళీ ప్రేమతో దగ్గర తీసుకోండి.

"ఓ స్త్రీ , నువ్వే నా గర్వం , భావం , ధైర్యం , ప్రపంచం ".