Contributed By Raviteja Ayyagari
"రెండవ పోటీదారుడు, శత్రువుని చండాదే, శతధృవంశ యోధుడు, కాల భైరవ!" ఈ మాటలకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిజానికి ఈ వాక్యం మొదటి రెండు పదాలు చదివిన తర్వాత మీరు కూడా అంతే గంభిరంతో ఈ వాక్యం పూర్తి చేసి ఉంటారు. అప్పుడు ఆకాశంలో నుంచి నేలమీద చిన్న మడుగులో పడిపోయిన హర్ష, కాల భైరవగా 400 సంవత్సరాల క్రితం ఒక జలపాతంలో నుంచి దూసుకుని వస్తాడు.
ఇలా రోమాలు నిక్కపురుచుకునే అంశాలు, వొళ్ళు జలదరించే సన్నివేశాలు పుష్కలంగా నిండి మనందరికీ ఒక అద్భుతమైన అనుభూతి అందించి, రికార్డులన్నీ తిరగరాసి కొత్త శిఖరాలని అందుకుని, ఇండస్ట్రీ హిట్ అందుకుంది. "మగధీర"
1. రామ్ చరణ్: రెండో సినిమాకే ఇంత పెద్ద కథ ని కథానాయకుడిగా ముందు నుండి నడిపించడం చాలా పెద్ద పని. ఈ కథ లో ఉంటె ఎన్నో భావోద్వేగాలను రామ్ చరణ్ చక్కగా చూపించారు. గుర్రపు స్వారీ అయితే ఇంకో ఎత్తు.
2. రాజమౌళి: ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ సినిమా రాజమౌళి సినిమా. తన దర్శకత్వ నైపుణ్యం, ఆయన కథనం, అయన సినిమా కోసం పడిన శ్రమ, పడిన తపన, చూపించిన క్రమశిక్షణ, ఆయన చేసిన హోంవర్క్, ఆయన బలం, నమ్మే బలగం, ఆయనకి సినిమా అంటే ఎంత పిచ్చో అర్థం చేస్కోవచ్చు. తెలుగు సినిమా తెర పై, మళ్ళీ రాజులూ, రాజ్యాల కథలను పరిచయం చేసిన ఘనత రాజమౌళి గారికే చెందుతుంది.
3. కీరవాణి గారి సంగీతం, BGM: 30 - 40 శాతం, ఈ సినిమాకి ఆయన సంగీతం, BGM ముఖ్య కారణం. ధీర ధీర, పంచదార బొమ్మ, లాంటి మధుర గీతాలు, బంగారు కోడి పెట్ట, జోరుసెయ్ జోరుసెయ్ లాంటి మాస్ పాటలు వీటన్నినీ మించి ఆయన rerecording అద్భుతం. ఈ సినిమా లో ప్రతి సీన్ elevate అవ్వడానికి కారణం ఆయన BGM మాత్రమే. నాకు తీలిసి మగధీరకు ఆయన సంగీతం and especially his BGM One of his best works.
4. విజయేంద్రప్రసాద్ గారి కథ: ఒకప్పుడు రాజ్యాలు రాజుల ఆధారంగా వచ్చిన కథలు చాలా ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో అలాంటి కథలు కనుమరుగయిపోయాయి. అలాంటి కథని మళ్ళీ మనకి గుర్తు చేసారు విజయేంద్రప్రసాద్ గారు. పునర్జన్మ ఆధారంగా వచ్చిన కథలు చాలా ఉన్నప్పటికీ, ఆయన ఆ కథని అల్లిన శైలి ప్రశంసనీయమైనది.
5. కాజల్: యువరాణి మిత్రవింద దేవి పాత్రలో, చలాకి అమ్మాయి ఇందు పాత్రలో కాజల్ అందరికి మెప్పించి అప్పటి యువతకి కొత్త ఆకర్షణగా మారారు. కాజల్ కి ఒక మలుపు ఈ సినిమా.. మిత్రవింద చనిపోయే సన్నివేశం అయితే చాలా బాగుంటుంది.
6. సహాయ తారాగణం: శ్రీహరి గారు చేసిన షేర్ ఖాన్ పాత్ర, ఇంక ఎవరు చెయ్యలేరు అనే రీతిలో ఆయన చేసారు. షేర్ ఖాన్ పాత్రలో ఉన్న గర్వం, గాంభీర్యం, సాలొమోన్ పాత్రలో ఉండే చురుకుతనం, ఎటకారం, రెండు భాషల లోని యాసను ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా చాలా అద్భుతంగా ప్రదర్శించారు శ్రీహరి గారు. అఘోర గా రావురమేష్ గారి పాత్ర ఆయన నటన జీవితంలో ఒక మైలురాయి లాగా మిగిలిపోతుంది. ముఖ్యంగా ఆయన మాటలోని లోతు అసలు ఆయనేనా అనే రీతిలో ఉంటుంది. నూతన నటులు దేవ్ గిల్ కూడా, ప్రతినాయకుడి పాత్రను అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా ద్వేషాన్ని, ఈర్ష్యని పలికించడంలో చాలా సఫలమయ్యారు.
7. ఎలివేషన్ సీన్స్: ఒకటా? రెండా? మూడా? ఎన్నని చెప్పను ఎలేవేషన్ సీన్స్ ఈ సినిమా లో
The photos underneath are self explainatory and I believe you can even listen to these! * మొదటి 5 నిమిషాలలో హీరో హీరోయిన్ చనిపోవడం అనే కాన్సెప్ట్ టాలీవుడ్ కి కొత్త. రామ్ చరణ్ కొండా మీద నుంచి దూకేసాక శ్రీహరి గారి మాటలు, "మళ్ళీ పుడతావ్ రా భైరవ!" అన్నప్పుడు చితిమంట కాస్త భగ భగ మండే సూర్యుడి లాగ మారిపోయి, ఆ సూర్యుడు ని చీల్చుకుంటూ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతాడు రామ్ చరణ్.
* "వాడు మండే అగ్ని గోళం లా కనిపిస్తాడు" అని, రావు రమేష్ గారి ఇంటెన్సిటీ డైలాగ్ అక్కడ వచ్చే మ్యూజిక్ అయితే ultimate.
* పరుగు పెట్టుకుంటూ గుర్రం ఎక్కడం. మీకు bgm మొదలిపోయి ఉంటుంది. ఈ సీన్ కి సుదర్శన్ 35 థియేటర్ దద్దరిల్లిపోయింది. పోకిరి తర్వాత అలాంటి అరుపు నేను ఆ థియేటర్ లో మళ్ళీ వినలేదు.
* ఇంటర్వెల్ బాంగ్! probably one of the best interval bang of TFI! ఆ రెండు నిముషాలు నాకు అసలు ఏమి వినిపించలేదు. సినిమా ఆ ఒక్క బాంగ్ తో ఆడేసింది అని నేను చెప్పచ్చు.
* "కత్తి దించే మగడు పుట్టాలి కదా సాబ్!" షేర్ ఖాన్ తో మాన్ సింగ్ చెప్పే డైలాగ్ about కాల భైరవ!
* గుర్రం పందెం సీన్, బాద్షా కాల భైరవ jump సీన్, భైరవ గెలిచే సీన్.
100 మంది ఫైట్ సీన్: హీరో అంత మందిని చంపడం అనేది మాములు విషయం కాదు. కానీ, అది సాధ్యమే అన్నట్టు, మనల్ని నమ్మించే రీతిలో చిత్రీకరించారు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. ఆ ఫైట్ ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు సెంథిల్ కుమార్ గారు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి సుమారు ఏడు నిముషాలు పాటు సాగే ఈ ఫైట్ కూడా ఒకటి.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయ్ ఎలివేషన్ సీన్స్. మర్చిపోతే కామెంట్స్ సెక్షన్ లో పెట్టేసేయండి.
ఆగండి ఆగండి, ఇంకొక్క ముఖ్య విషయం. మన మెగాస్టార్ గారు ఉన్నారు కదండీ ఈ సినిమాలో. మరి ఆయన ఉండడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.
మగధీర సినిమా ఇప్పుడు తెలుగు సినిమా కి భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో వచ్చే సినిమాలు పట్ల గౌరవానికి నాంది పలికిన సినిమా అని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైన సినిమాని మనకి అందించిన ఆ చిత్ర బృందం అంతటికి దసవా వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా విశ్లేషణలో ఏమైనా తప్పులు ఉంటె, నేను ఏమైనా ముఖ్యమైన విషయాలు మర్చిపోయి ఉంటె నన్ను మన్నించగలరు. ఇలాంటి స్థాయి పెంచే సినిమాలు మరెన్నో రావాలి అని కోరుకుంటూ, సెలవు. జై హింద్!