Lyricopedia - The Youtube Channel Discusses The Beauty Of Lyrics With Amazing Illustrations and Analysis

Updated on
Lyricopedia - The Youtube Channel Discusses The Beauty Of Lyrics With Amazing Illustrations and Analysis

ఒక మంచి పాటకి, అందులోని సాహిత్యానికి, ఒకరిని ఉల్లాస పరిచే నైజం ఉంది, నిద్దరపుచ్చే మాధుర్యం ఉంది, ఆలోచింపచేసే శక్తీ ఉంది. సంగీతం చెవులకి హాయినిస్తే, అందులో ని సాహిత్యం మన మనసుకి హాయినిస్తుంది. పని చేస్కుంటున్నప్పుడో, ఏదో ఆలోచిస్తున్నప్పుడో, అలా చల్లగాలికి నడుస్తున్నప్పుడో ఉన్నపాటుగా ఒక పాట ఆ పాట లోని సాహిత్యం గుర్తొచ్చి కాసేపు ఆ పాట పల్లకి మీద ఊరేగి రావడం మనలో చాలా మంది ఎన్నో చేసే ఉంటారు. సాహిత్యం ఎంతలా మనలో ఇమిడిపోయి ఉంటుందంటే, ఎవరో గుర్తుచేయకపోయిన సందర్భానుచితంగా ఆ సాహిత్యం గుర్తొచ్చి మనం పాడేసుకునేంతగా. కొన్ని పాటల లోని సాహిత్యాన్నీ పరికించి చూస్తేనే ఆ పాటలోని లోతు తెలుస్తుంది.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక ఆలోచనని వెలిగిస్తుంది, కానీ ఆ ఆలోచనని వెలిగించిన రవి లాంటి ఆ కవి మాత్రం తాను పొందాల్సిన వెలుగు ని చాలా సార్లు పొందలేక ఆలా నిశి లో ఉంటున్నారు. అలాంటి కొన్ని పాటల, అర్థాన్ని అంతరంగాన్ని, తెలిసినంతలో పంచుకోవాలి అని , ఎన్నో పాటలతో ఎన్నో సార్లు దారులు చూపించిన సాహితివేత్తలకు నమస్సులు తెలిపే చిన్న ప్రయత్నం ఈ ఛానల్.

కేవలం పాటని, ఆ సాహిత్యాన్నిమాత్రమే కాకుండా, ఆ పాటని మరింత వివరించే చిత్రాలను గీస్తూ.. ఆ పాట లో అంతరార్థాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. వాటిలో కొన్ని ఇవి..

1. Maree Anthaga - SVSC

2. Hare Rama Hare Rama - Okkadu

3. Aasa Paasam - Care of Kancharapalem

4. Chalore chalore chal - Jalsa

5. Chakravarthy ki - Money

6. Tarali Raada Thane - Rudraveena

7. Kalalonaina - Nuvvu Vasthavani

8. Bhaga Bhagamani - Kanche

9. Ghal Ghal - Nuvvosthanante Nenoddantaana

10. Maguva Maguva - Vakeel Saab

Stay tune for more such beautiful songs